Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు, జీఐ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో చోటు
పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరే పూతరేకుల అద్భుతమైన రుచి గురించి చాలా మందికి తెలిసిందే. నోరూరించే పూతరేకులకు ఆత్రేయపురం ఫేమస్. తాజాగా ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు చోటు దక్కించుకున్నాయి.
భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్ధర్ కాటన్ పూతరేకుల సహకారం సంఘం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుపై స్పందించిన కేంద్ర విభాగం..

ఫిబ్రవరి 13వ తేదీన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) జర్నల్ లో ఆత్రేయపురం పూతరేకుల భౌగోళిక గుర్తింపుపై ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు గడువు కూడా ఇచ్చింది. తాజాగా ఈ గడువు ముగియగా.. ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. దీంతో ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు వచ్చినట్లు అయిందని సర్ ఆర్ధర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం వెల్లడించింది.
పూతరేకుల్లో ఆత్రేయపురం పూతరేకులు వేరయా:
పూతరేకులు చాలా ప్రాంతాల్లో దొరుకుతాయి. కానీ ఆత్రేయపురంలో దొరికే పూతరేకులనే చాలా మంది ఇష్టపడతారు. ఇక్కడే లభించే పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయని అంటారు. ఇక్కడ తయారైన పూతరేకులకు చాలా డిమాండ్ ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. విభిన్న రకాల రుచులతో ఇక్కడ పూతరేకులు లభిస్తాయి. రుచికి రుచి, శుచికి శుచి వీటి ప్రత్యేకత. అలా ఆత్రేయపురం పూతరేకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.
19వ ప్రఖ్యాత ఉత్పత్తిగా పూతరేకులకు గుర్తింపు:
ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి వరకు 18 ఉత్పత్తులకు జియోలాజికల్ ఇండికేషన్స్ లో చోటు లభించింది. వాటిలో కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డూ, ఉప్పడ జిందానీ చీరలు, బందర్ లడ్డూ లాంటివి ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో ఆత్రేయపురం పూతరేకులు చేరాయి.
ఆత్రేయపురం పూతరేకులు చరిత్ర:
రాజమండ్రికి 30 కిలోమీటర్లదూరంలో ఉంటుంది ఆత్రేయపురం. ఇక్కడి పూతరేకులకు 400 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. ఇక్కడి పూర్వీకులు పూతరేకుల తయారీని వృత్తిగా చేసుకున్నట్లు స్థానికులు చెబుతారు. ప్రస్తుతం ఆత్రేయపురంలో సుమారు 300 వరకు పూతరేకుల దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఇంటింటా పూతరేకులు తయారు చేస్తుంటారు. విభిన్న రకాల రుచులతో ఇక్కడ పూతరేకులు తయారు చేస్తారు.
పంచదార, బెల్లం, నేతితో తయారైన పూతరేకులతో పాటు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్లు, షుగర్ ఫ్రీ ఇంకా పలు రకాల ఫ్లేవర్లతో పూతరేకులు తయారు చేస్తారు. దేశ విదేశాలకు ఆత్రేయపురం నుంచి పూతరేకులు వెళ్తుంటాయి. ఆర్డర్లు ఇచ్చి మరీ ఇక్కడ పూతరేకులు తెప్పించుకుంటారు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆత్రేయపురం పూతరేకులను అమ్ముతుంటారు. ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ మేళా లాంటి కార్యక్రమాల్లో ఆత్రేయపురం పూతరేకులను ప్రదర్శిస్తుంటారు. పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరే పూతరేకుల అద్భుతమైన రుచి గురించి చాలా మందికి తెలిసిందే. నోరూరించే పూతరేకులకు ఆత్రేయపురం ఫేమస్. తాజాగా ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు చోటు దక్కించుకున్నాయి.
పూతరేకుల్లో ఆత్రేయపురం పూతరేకులు వేరయా:
పూతరేకులు చాలా ప్రాంతాల్లో దొరుకుతాయి. కానీ ఆత్రేయపురంలో దొరికే పూతరేకులనే చాలా మంది ఇష్టపడతారు. ఇక్కడే లభించే పూతరేకులు చాలా టేస్టీగా ఉంటాయని అంటారు. ఇక్కడ తయారైన పూతరేకులకు చాలా డిమాండ్ ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. విభిన్న రకాల రుచులతో ఇక్కడ పూతరేకులు లభిస్తాయి. రుచికి రుచి, శుచికి శుచి వీటి ప్రత్యేకత. అలా ఆత్రేయపురం పూతరేకులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది.



Click it and Unblock the Notifications