Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Instagram, Facebook, Snapchat బ్యాన్.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం! ఎందుకంటే?
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదహారు ఏళ్లలోపు ఉన్న పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా బ్యాన్ విధించింది. TikTok, Facebook, Snapchat, Reddit, Twitter, Instagram వంటి సోషల్ మీడియా యాప్స్‌ను వినియోగించకుండా నిషేధించే చట్టాన్ని అమలు చేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టం అమల్లోకి తీసుకురావడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఈ నిర్ణయం సరైనదేనా? దీంతో వచ్చే దుష్ప్రయోజనాలు ఏంటి అనే ఇతర విషయాల గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సోషల్ మీడియా బ్యాన్ పిల్లలపై ప్రభావం చూపుతుందా?
పదహారేళ్ళొపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించడంపై చాలా మంది సానుకూలంగా స్పందించినప్పటికీ, కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాను వినియోగించే పిల్లలు ఒంటరిగా భావించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది ఎంత వరకు ప్రభావితం చూపిస్తుందో ఇప్పటి వరకు తెలియనప్పటికీ? భవిష్యత్తులో దీని ప్రభావం పిల్లలపై ఎంత వరకు ఉంటుందో స్పష్టంగా తెలియనుంది.

ప్రతికూల ప్రభావం చూపుతున్న సోషల్ మీడియా..
చాలా మంది పిల్లలపై సోషల్ మీడియా చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. పిల్లల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోయి సోషల్ మీడియాపై ఆసక్తి పెరుగుతోంది. సోషల్ మీడియా ఒత్తిడి కారణంగా ఖరీదైన ఫోన్లు కావాలని ఇంట్లో తల్లిదండ్రులతో గొడవ పడుతున్నారు. లైక్స్, షేర్ల గురించి ఆందోళన చెందడం వల్ల నిరాశకు దారితీసే అవకాశం కూడా ఉంది.
శారీరక ఆరోగ్యంపై ప్రభావం
ఫోన్లు, సోషల్ మీడియా లేని కాలంలో పిల్లలు ఎక్కువగా అవుట్ డోర్ గేమ్స్ ఆడేవారు. స్నేహితులతో కాళీ ఎన్నోరకాల ఆటలు ఆడుతుండేవారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం, ఫోన్లు వచ్చేయడం వల్ల.. పిల్లలు ఆడడం కంటే మొబైల్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది వారి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు రావడం, ఉభయకాయం, అధికంగా బరువు పెరిగిపోవడం వంటివి వారిని వెంటాడుతున్నాయి.
మానసిక ఆరోగ్యం కూడా..
పిల్లలు మొబైల్‌లో ఎక్కువ సమయం గడపడం వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది, పిల్లలు ఎవరితోనూ సాంఘికంగా ఉండకపోవడం, మొబైల్‌లో ఎక్కువ సమయం గడపడం వారిపై చాలా ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే తమలోని తాము కుంగిపోవడం, తమ భావాలను సమస్యలను తల్లిదండ్రులకు చెప్పుకోకుండా ఉండిపోవడం వంటి సమస్యలు అధికమవుతున్నాయి.
సోషల్ మీడియా పిల్లలకు మేలు కూడా చేసింది
కొంతమంది పిల్లలు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సోషల్ మీడియాను ఒక వేదికగా బాగా ఉపయోగిస్తున్నారు. తద్వారా వారు ఎక్కువ మంది వ్యక్తులను చేరుకోవడానికి మరియు జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి వీలు కలుగుతుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా వచ్చే డబ్బులతో పిల్లలకు ఆర్థికంగా సహాయకంగా ఉండడం, ఆర్థికంగా తమ కుటుంబం ఎదగడానికి ఉపయోగిస్తున్నారు.
ఒంటరి తనం తగ్గించుకోవడానికి:
సోషల్ మీడియా ఒంటరి తనాన్ని దూరం చేస్తుంది. అందులోని ఇతర వ్యక్తులతో పరిచయాలు ఒంటరిగా ఉన్నామనే భావనను కలిగించవు. ఏదైనా భావనను తమలో తామే దాచుకోకుండా సోషల్ మీడియా అనే ప్రపంచంలో షేర్ చేసుకుంటున్నారు. అందుకే సోషల్ మీడియా వల్ల ఎంత దుష్ప్రయోజనాలు ఉన్నాయో అంతే ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.



Click it and Unblock the Notifications