Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పార్లమెంట్ లో సంచలన చట్టం ఆమోదం..ఆ వయస్సు వచ్చే వరకు సోషల్ మీడియా వాడటంపై బ్యాన్!
ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించే బిల్లుని ఆస్ట్రేలియా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. అంటే 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు ఎవరైనా TikTok, Instagram, Snapchat, Facebookతో సహా ఇతర సోషల్ మీడియా యాప్ లు వాడకుండా నిరోధించబడతారు.
బుధవారం హౌప్ ఆఫ్ రిప్లజంటేటివ్స్ లో అంటే ఆ దేశ దిగువసభ,సెనేట్ లో కూడా అంటే ఆ దేశ రాజ్యసభ్యలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందింది. సెనేట్ లో ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఆల్బనీస్ పార్టీకి తగినంత బలం లేనప్పటికీ ప్రతిపక్షం కూడా ఈ బిల్లుకి సపోర్ట్ చేయడంతో ఈజీగా పాస్ అయ్యింది.

ఈ మేడాది మే నెలలో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో తన పాపులారిటీని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్న ఆల్బనీస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి హాని కలుగుతుందని కాబట్టి ఈ బ్యాన్ విషయంలో తనకు తల్లిదండ్రుల మద్దతు ఇవ్వాలని ఆల్బనీస్ కోరారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత ఏజ్ వెరిఫికేషన్ సంబంధిత ప్రొటెక్షన్స్ కోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధలు ఉల్లంఘించిన కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల వరకు జరిమానా విధించవచ్చు.
సోషల్ మీడియా బ్యాన్ చట్టాన్ని అమలు చేయడానికి బయోమెట్రిక్స్ లేదా ప్రభుత్వ గుర్తింపును కలిగి ఉండే వయస్సు ధృవీకరణ సిస్టమ్ ని టెస్ట్ చేయాలని ఆస్ట్రేలియా ఆలోచిస్తుంది. అయితే గూగుల్,మెటా కంపెనీలు మాత్రం వయస్సు ధృవీకరణ ట్రయల్ పూర్తయ్యే వరకు నిషేధం ఆపాలని కోరుతున్నాయి. ఈ విషయంలో మరింత సంప్రదింపులు అవసరమని టిక్ టాక్ తెలిపింది. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో ఎక్స్ ఫ్లాట్ ఫాం అయితే ఈ చట్టం పిల్లల మానవ హక్కులను దెబ్బతీస్తుందని తెలిపింది. ఈ చట్టం అమలు చేయడానికి ఏడాది వరకు సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు,ఆస్ట్రేలియాలోని టీనేజర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ముఖ్యమైన సామాజిక, కుటుంబ సంబంధాల నుండి తమను విడదీస్తుందని అంటున్నారు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదని తాము అర్థం చేసుకున్నామని.. కానీ పూర్తిగా నిషేధం కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఆస్ట్రేలియా హ్యూమన్ రైట్స్ కమీషన్ కూడా ఈ నిషేధాన్ని వ్యతిరేకించింది. ఇది పిల్లల స్వీయ వ్యక్తీకరణ,సమాజంలో పాల్గొనే హక్కులను ఉల్లంఘిస్తుందని తెలిపింది.



Click it and Unblock the Notifications