Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బెంజ్ కారుకు ఆటో సాయం, తోసుకుంటూ తీసుకెళ్లిన ఆటో డ్రైవర్
బెంజ్ వెనక వైపు కాలు పెట్టి ఆటో నడుపుతూ ఆ బెంజ్ కారును మెకానిక్ షెడ్డు వరకు తోసుకెళ్లాడు. బెంజ్ కారు ఆగిపోతే దానికి ఆటో సాయం చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
రోడ్డుపై బండిపై లేదా కారుపై వెళ్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. అందులో ఒకటి పెట్రోల్, డీజిల్ అయిపోవడం. బైక్, కారు కానీ ఆగిపోతే ఫ్రెండ్‌కు ఫోన్ చేస్తాం. వాళ్లు వాటర్ బాటిల్‌లో పెట్రోల్ తీసుకువస్తే పోసుకుని వెళ్తాం. అది కుదరకపోతే ఓ కాలును బైక్‌కు పెట్టి మరో బైకుతో తోసుకుంటూ వెళ్లడం చాలా మందికి తెలిసిందే.

ఇలాంటిదే ఆ ఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఇలా ఓ వాహనాన్ని తీసుకువెళ్తుండగా వెనక నుండి వస్తున్న కొంత మంది దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ఆ వీడియో కింద నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఖరీదైనా కార్లు ఎన్నో ఉంటాయి. కానీ బెంజ్ అనగానే ఓ రకమైన రిచ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. బెంజ్ అనే పేరు చెప్పగానే అబ్బో అనేస్తాం. బెంజ్ అనే పేరుకు ఉన్న క్రేజ్ అలాంటిది. అలాంటి ఓ బెంజ్ కారును షెడ్డు వరకూ తీసుకెళ్లేందుకు ఆ ఆటో డ్రైవర్ సాయం చేశాడు. అందుకే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంజ్ వెనక వైపు కాలు పెట్టి ఆటో నడుపుతూ ఆ బెంజ్ కారును మెకానిక్ షెడ్డు వరకు తోసుకెళ్లాడు.
బెంజ్ కారు ఆగిపోతే దానికి ఆటో సాయం చేయడం ఇప్పుడు వైరల్‌గా మారింది.



Click it and Unblock the Notifications
