Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఆఫీస్ లేదు,డిగ్రీ లేదు..కానీ నెల సంపాదన రూ.8 లక్షలు..ఈ ఆటో డ్రైవర్ తెలివికి ఫిదా అవ్వాల్సిందే!
ఒక పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం కనుగొంటే అది ఎంత పెద్ద వ్యాపారంగా మారుతుందో చెప్పడానికి ఈ ఆటో డ్రైవర్ కథే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆటో నడపకుండానే కేవలం తన తెలివితో నెలకు రూ. 5 నుండి 8 లక్షలు సంపాదిస్తున్న ఒక సామాన్యుడి విజయ గాథను ప్రముఖ కళ్లద్దాల సంస్థ లెన్స్‌కార్ట్ ప్రొడక్ట్ లీడర్ రాహుల్ రూపానీ లింక్డిన్ లొ షేర్ చేయడంతో ఇప్పుడు అది సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓ ఆటో డ్రైవర్ ఆటో నడపకుండా ఇన్ని లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయం ఇది
అమెరికా వీసా కోసం ముంబైలోని కాన్సులేట్ కు వెళ్లే వేలాది మంది ప్రతిరోజూ ఒకే సమస్యను ఎదుర్కొంటారు. కాన్సులేట్ లోపలికి బ్యాగులు, ఫోన్లు వంటి వస్తువులను అస్సలు అనుమతించరు. కానీ వాటిని భద్రంగా దాచుకోవడానికి సమీపంలో ఎలాంటి అధికారిక లాకర్ సౌకర్యం ఉండదు. ఈ చిన్న సమస్యే ఆ ఆటో డ్రైవర్‌కు బంగారు అవకాశంలా మారింది.

ఇటీవల తన వీసా అపాయింట్‌మెంట్ కోసం కాన్సులేట్‌కు వెళ్లిన రాహుల్ రూపానీకి ఇదే అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ ఆయన బ్యాగ్‌ను లోపలికి తీసుకువెళ్లడానికి వీల్లేదని చెప్పారు. అక్కడ లాకర్లు లేవు, ఎవరూ సూచనలు ఇవ్వలేదు. ఏం చేయాలో తెలియక ఫుట్ పాత్‌పై అయోమయంగా నిలబడ్డాను అని ఆయన తన లింక్డ్ ఇన్ పోస్ట్ లో తెలిపారు. అప్పుడే ఒక ఆటో డ్రైవర్ ఆయన వైపు చేయి ఊపుతూ సార్, బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. నేను భద్రంగా చూసుకుంటా. ఇది మాకు రోజూ చేసే పనే. ఛార్జీ కేవలం రూ. 1,000 అన్నాడు.
మొదట వెయ్యి రూపాయలు ఎక్కువ అనిపించినా, లక్షలు ఖర్చుపెట్టి అమెరికా వెళ్లాలనుకునేవారికి,కీలకమైన వీసా ఇంటర్వ్యూను కోల్పోయే ప్రమాదంతో పోలిస్తే ఇది చాలా చిన్న మొత్తమని రూపానీ గ్రహించారు. ఆ డ్రైవర్ కేవలం నమ్మకం అనే పునాదిపై ఒక అద్భుతమైన వ్యాపార నమూనాను సృష్టించాడని రాహుల్ రూపానీ తెలిపారు.
ఆ ఆటోడ్రైవర్ ప్రతిరోజూ 20 నుండి 30 మంది కస్టమర్లకు ఈ సేవ అందిస్తాడు.. అంటే రోజుకు రూ. 20,000 నుండి రూ. 30,000 సంపాదన అని రాహుల్ తెలిపారు. తన ఆటోను ఒక రిసెప్షన్ కౌంటర్ లాగా వాడుతూ స్థానిక పోలీసు అధికారి సహకారంతో సురక్షితమైన లాకర్లలో బ్యాగులను భద్రపరుస్తాడు. ఆటో అక్కడే ఉండటంతో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. అతని దగ్గర ఎలాంటి యాప్ లేదు, ఆఫీసు లేదు, ఎంబీఏ డిగ్రీ అంతకన్నా లేదు.. కేవలం తన వీధి తెలివితేటలు, మనుషులను లోతుగా అర్థం చేసుకునే నైపుణ్యంతో సంపాదిస్తున్నాడు. ఇదే అసలైన, శక్తివంతమైన వ్యవస్థాపకత అని రూపానీ ప్రశంసించారు.
నెటిజన్ల రియాక్షన్
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఒక నెటిజన్.. మీ పోస్ట్ అతని జుగాడ్ వ్యాపారాన్ని పన్ను ఎగవేతను పొగడటమే కాకుండా,వ్యవస్థలోని ఒక అపవిత్ర బంధాన్ని కూడా బయటపెట్టింది అని తీవ్రంగా విమర్శించారు. మరో నెటిజన్ గత వారం ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో నాకు ఇదే అనుభవం ఎదురైంది. వాళ్లే ఒక పెద్ద సమస్యను సృష్టించి, దానికి పరిష్కారం చూపిస్తూ మన దగ్గర నుంచే భారీగా డబ్బు వసూలు చేస్తారు. చివరికి వాళ్లే మనల్ని కాపాడే రక్షకుల్లా కనిపిస్తారు అని కామెంట్ చేశారు. ఇలా కొందరు ఆ ఆటోడ్రైవర్ తెలివితేటలను పొగుడుతూ,మరికొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
