Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
ఈ వస్తువులను అమ్మాయిలు అత్తింటికి తీసుకెళ్లవద్దు.. తెలియక తీసుకెళ్లినా అరిష్టమే
అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత అత్తింటికి పంపించడం మన సాంప్రదాయం. హిందువులైనా ఇతర మతాల్లో అయినా పెళ్లయ్యాక అమ్మాయిలను మెట్టినింటికి పంపిస్తారు. పుట్టినప్పటి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని మరో ఇంటికి పంపించేటప్పుడు ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. కంటికి రెప్పలా చూసుకుున్న కూతురిని అలా వేరొకరి ఇంటికి పంపించడం చాలా కష్టంగా ఉంటుంది.
అలా పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లిన ఆడపడుచులకు పుట్టింటిపై ఎప్పుడూ హక్కు ఉంటుంది. అందుకే పెద్దలు ఎప్పుడూ ఓ మాట చెబుతుంటారు. ఆడపడుచులకు పుట్టిల్లు ఎప్పుడూ రుణం ఉంటుంది అని. అమ్మాయిలు వారి ఇంటి నుంచి మరొకరి ఇంటికి వెళ్లినా పుట్టిల్లు ఇప్పటికే సొంతిల్లే అనేది పెద్దలు చెప్పే మాట.

సాధారణంగా అమ్మాయిలు తమ పుట్టింటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే బహుమతులతో పాటు ఇతర వస్తువులు లాంటివి తీసుకెళ్తుంటారు. కొన్నింటిని తల్లిదండ్రులు ఇష్టపడి ఇస్తే, మరికొన్నింటిని అమ్మాయిలు తమ ఇష్టం కొద్దీ తీసుకుంటారు. అయితే ఇలా ఆడపడుచులు కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లవద్దని శాస్త్రాలు చెబుతున్నారు. వాటికి తీసుకెళ్తే మంచిది కాదని అంటారు. మరి పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లకూడని ఆ వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పు:
చాలా మంది తల్లిదండ్రులు తమ అమ్మాయి ఇంటికి కిరాణ సరుకులు పంపిస్తుంటారు. ఉప్పులు, పప్పులు, ఇతర సరుకులు కొని పంపిస్తుంటారు. అయితే ఈ కిరాణ వస్తువుల్లో ఎట్టిపరిస్థితుల్లో ఉప్పు ఉండకూడదని పెద్దలు చెబుతున్నారు. ఉప్పును తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం దెబ్బతింటుందని భావిస్తారు.
చింతపడ్డు:
చింతపడ్డును కూడా అమ్మాయిలు పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లవద్దు. తల్లిదండ్రులు కూడా ఇచ్చి పంపించవద్దు. ఇలా చింతపడ్డు తీసుకెళ్లడం వల్ల చెడు జరుగుతుందని విశ్వాసం. ఇది ఇరు కుటుంబాల మధ్య గొడవలను తెచ్చిపెడుతుందని అంటారు.
పదునైన వస్తువులు:
కత్తులు, కత్తి పీటలు, కత్తెరలు, బ్లేడ్లు లాంటి పదునైన వస్తువులు కూడా పుట్టింటి నుంచి మెట్టినింటికి తీసుకెళ్లకూడదు. వీటి వల్ల సంబంధాలు దెబ్బతింటాయి. ఇరు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాల్లోనూ కలహాలు వస్తాయి. మనస్ఫర్థలు పెరుగుతాయి. ఇది బంధుత్వాన్ని శత్రుత్వంగా మారుస్తుంది.
చీపురు, చాట:
చీపురును లక్ష్మీ దేవిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం చీపురుకు కాలు తగిలినా మొక్కుతుంటారు. అలాగే బియ్యాన్ని గాలించే చేట/చాటను కూడా అలాగే చూస్తారు. ఈ వస్తువులను కూడా అమ్మాయిలు పుట్టింటి నుంచి మెట్టినింటికి పంపించకూడదని అంటారు. చీపురు, చాటను తీసుకెళ్లడం ద్వారా పుట్టింటి వారిలో ఆర్థిక సమస్యలు వస్తాయి. అప్పులు పెరుగుతాయి.
అగ్గిపెట్టే, నల్లబట్టలు:
పుట్టింటి నుంచి అగ్గిపెట్టే కూడా తీసుకెళ్లకూడదు. అగ్గిపెట్టెను ఇంటికి వెలుగు అందించే పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే అగ్గిపెట్టెలను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకెళ్లకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు కూడా తీసుకెళ్లకూడదు. నల్ల వస్తువులు కూడా తీసుకెళ్లొద్దు. నలుపు రంగు శనిని సూచిస్తుంది. ఇలా నలుపు రంగు వస్తువులు తీసుకెళ్లడం వల్ల అత్తింటికి శని వస్తుందని అంటారు.
నూనె, పాలు, పెరుగు, దూది, గొడుగు, లక్ష్మీ కాయిన్, విసుర్రాయి, అద్దం లాంటి వస్తువులను కూడా పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకురావొద్దు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications