Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Bayya Sunny Yadav: యూత్ ఐకాన్‌గా మారిన బయ్యా సన్నీ యాదవ్, దేశాలు చుట్టొస్తున్న ఈ కుర్రాడి గురించి మీకు తెలుసా?
మోటో వ్లాగ్స్ చూసే వారికి చాలా మందికి తెలిసిన పేరు బయ్యా సన్నీ యాదవ్. ఈ కుర్రాడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగి మోటో వ్లాగింగ్ చేశాడు. చుట్టు పక్కల దేశాలకు వెళ్లొచ్చాడు. కొన్ని నెలల క్రితం వరల్డ్ టూర్ లో భాగంగా ఆస్ట్రేలియా కూడా వెళ్లి అక్కడ మోటో వ్లాగింగ్ చేశాడు.

ఈ కుర్రాడికి యూత్ లో క్రేజ్ అంతా ఇంతా కాదు. బీఎస్‌వై ఫ్యాన్స్ తో మీటప్ నిర్వహించే వేలాది మంది తరలి వస్తున్నారంటేనే ఇతడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ సాధారణ కుర్రాడికి ఈ స్థాయి ఆదరణ ఉంది అంటే.. అది తన కష్టం వల్లే అని చెప్పాలి. ఈ కుర్రాడు ఎలా ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు, తను ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్లు ఏంటి, తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యపేటలోని నూతనకల్ మండలంలో 1997లో జన్మించాడు బయ్యా సన్నీ యాదవ్. ఈ కుర్రాడి అసలు పేరు బయ్యా సందీప్ యాదవ్. బయ్యా అనేది తన ఇంటి పేరు. తండ్రి రవీందర్ యాదవ్ కు మెడికల్ షాప్ నడిస్తుంటాడు. ఖమ్మం, సూర్యపేటలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నాడు. పదో తరగతి తర్వాత డిప్లొమాలో చేరినా పాస్ అవ్వలేదు. డిప్లొమా సెకండ్ ఇయర్ లో బైక్ కొన్న సన్నీ.. ఆ తర్వాత రెండేళ్లు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాడు. అప్పుడే యూట్యూబ్ లో హిందీ మోటో వ్లాగర్లను ఫాలో అవుతుండేవాడు. అలా తెలుగులో తాను మోటో వ్లాగ్ చేయాలన్న ఐడియా రావడంతో ముందడుగు వేశాడు. అలా కేటీఎం ఆర్సీ 200 స్పోర్ట్స్ బైక్ తో మోటో వ్లాగింగ్ చేస్తూ 2017 నుంచి యూట్యూబ్ లో వీడియోలు అప్‌లోడ్ చేయడం ప్రారంభించాడు. స్పోర్ట్స్ బైక్ కావడంతో వెన్ను నొప్పి ఇబ్బంది పెట్టేది. దాంతో సెకండ్ హ్యాండ్ లో కేటీఎం డ్యూక్ 390 బైక్ కొన్నాడు. ఈ బైక్ పైనే చాలా రైడ్స్ చేశాడు. అయితే లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు ఈ బైక్ తో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. దాంతో అడ్వెంచర్ 390 బైక్ కొన్నాడు.
లడఖ్ రైడ్‌తో టర్నింగ్ పాయింట్:
మొదట్లో వ్యూస్ రావడం చాలా కష్టంగా ఉండేది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు సన్నీ. రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసేవాడు. క్రమంగా సబ్‌స్క్రైబర్లు పెరగడం మొదలైంది. ఆ సమయంలోనే హైదరాబాద్ టు లడఖ్ వీడియో పెట్టగా ఊహించని విధంగా సక్సెస్ అయింది. ఈ వీడియోకు ఏకంగా 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 22 రోజుల పాటు 7,500 కిలోమీటర్లు ఉండే ఈ రైడ్ బయ్యా సన్నీ యాదవ్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ లా నిలిచిందనే చెప్పాలి. అప్పటి నుంచి సన్నీ యూట్యూబ్ ఛానల్ కు సబ్‌స్క్రైబర్లు పెరగడంతో పాటు పెట్టిన వీడియోలకు లక్షల్లో వ్యూస్ వచ్చేవి. ఒక్కో వీడియో కోసం సబ్‌స్క్రైబర్లు ఎదురుచూసే స్థాయి క్రేజ్ వచ్చింది.
లడఖ్ రైడ్ తో వచ్చిన క్రేజ్ ను అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చాడు సన్నీ. తన సబ్‌స్క్రైబర్లకు కావాల్సిన కంటెంట్ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఒక దాని తర్వాత మరో రైడ్ చేస్తూ దూసుకుపోయాడు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవా, కొడైకెనాల్, కర్ణాటక, కన్యాకుమారి, ఉత్తరాఖండ్, వైజాగ్, అరకు, షిర్డీ, నార్త్ ఈస్ట్ రైడ్, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ లకు కూడా వెళ్లొచ్చాడు సన్నీ.
ఆ తర్వాత మలేషియా, థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, బ్యాంకాక్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలను చుట్టొచ్చాడు ఈ కుర్రాడు. మొత్తం 128 రోజుల పాటు సాగింది ఈ రైడ్. 15 వేల కిలోమీటర్లు ఆస్ట్రేలియాలో రైడ్ చేశాడు సన్నీ. ప్రస్తుతం కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న ఈ కుర్రాడు.. తర్వాత మరో దేశంలో రైడ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.



Click it and Unblock the Notifications
