Latest Updates
-
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా.. -
మీ పిల్లలు రోజులో ఎన్ని చాక్లెట్స్ తింటున్నారు.. ఈ లిమిట్ దాటితే ఎంత ప్రమాదమో తెలుసా.?
హీటర్ అక్కర్లేదు.. కరెంట్ బిల్లు రాదు.. ఇంటిని ఇలా వెచ్చగా మార్చుకోండి!
చలికాలంలో బయటకు వెళ్లాలంటే మందపాటి స్వెటర్లు, జాకెట్లు వేసుకుని జాగ్రత్తపడతాం. కానీ ఇంటి లోపల పరిస్థితి ఏమిటి? ఒక్కోసారి బయట ఉన్నంత చల్లగా ఇంటి లోపల కూడా అనిపిస్తుంది. అలాగని ఇంట్లో కూడా ఎప్పుడూ కుప్పలు తెప్పలుగా బట్టలు వేసుకొని కూర్చోలేం.
దీనికి పరిష్కారంగా చాలామంది రూమ్ హీటర్లను ఆశ్రయిస్తుంటారు. కానీ అందరికీ హీటర్లు కొనుగోలు చేసే స్తోమత ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా వాటిని నిరంతరం వాడటం వల్ల కరెంటు బిల్లు తడిసి మోపెడవుతుంది. పైగా హీటర్ల నుండి వచ్చే కృత్రిమ వేడి చర్మాన్ని పొడిగా మారుస్తుంది, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. హీటర్ లేకుండా, కరెంటు బిల్లు పెరగకుండా ఇంటిని వెచ్చగా మార్చుకోవడం ఎలాగో ఇక్కడ చూడండి.

సూర్యరశ్మి
సూర్యుడు మనకు అందుబాటులో ఉన్న సహజమైన హీటర్. పగటిపూట మీ కిటికీల కర్టెన్లను పూర్తిగా తెరిచి ఉంచండి. సూర్యకాంతి గదిలోకి ప్రసరించడం వల్ల గదిలోని తేమ తగ్గి, గోడలు, ఫర్నిచర్ వేడెక్కుతాయి. అయితే సాయంత్రం సూర్యాస్తమయం కాగానే కర్టెన్లను గట్టిగా మూసివేయాలి. దీంతో పగలు పోగైన వేడి బయటకు పోకుండా, గది లోపలే ఉండి రాత్రంతా వెచ్చదనాన్ని ఇస్తుంది.
చల్లగాలికి చెక్ పెట్టండి
మీ ఇంటి తలుపులు,కిటికీల కింద చిన్నపాటి ఖాళీలు ఉండటం సహజం. ఆ సందుల ద్వారా చల్లటి గాలి లోపలికి ప్రవేశించి గదిని కూల్ చేసేస్తుంది. అందుకే తలుపు కింద మందపాటి గుడ్డను లేదా డోర్ స్టాపర్ ను ఉంచండి. ఇది బయట నుండి వచ్చే చలిని అడ్డుకుని, గదిలోని వేడిని కాపాడుతుంది.
నేల చల్లదనాన్ని తగ్గించండి
శీతాకాలంలో టైల్స్ లేదా మార్బుల్ నేలలు ఐస్ ముక్కల్లా మారిపోతాయి. అందుకే నేల ఖాళీగా ఉంచకుండా కార్పెట్లు లేదా మందపాటి రగ్గులను పరచండి. ఒకవేళ కార్పెట్లు లేకపోతే మందపాటి కాటన్ బెడ్ షీట్లను లేదా బొంతలను నేలపై వేయవచ్చు. ఇవి పాదాలకు వెచ్చదనాన్ని ఇవ్వడమే కాకుండా, గది ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ గా ఉంచుతాయి.
ఉపయోగించని గదులను మూసివేయండి
మీ ఇంట్లో మీరు ఎక్కువగా ఉపయోగించని గదులు ఉంటే వాటి తలుపులను మూసి ఉంచండి. దీనివల్ల వేడి గాలి ఇల్లంతా విస్తరించాల్సిన అవసరం లేకుండా మీరు నివసించే గదిలో మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది. తక్కువ స్థలాన్ని వేడి చేయడం సులభం కాబట్టి గది త్వరగా వెచ్చబడుతుంది.
పడక గదిలో మార్పులు
రాత్రి నిద్రించేటప్పుడు బెడ్ చల్లగా ఉంటే నిద్ర పట్టడం కష్టం. మంచం మీద వెచ్చని ఉన్ని లేదా ఫ్లాన్నెల్ షీట్లను వేయండి. ఇవి సాధారణ కాటన్ షీట్ల కంటే ఎక్కువ వెచ్చదనాన్ని ఇస్తాయి. మందపాటి దుప్పట్లు వాడటం వల్ల కూర్చున్నప్పుడు కూడా హాయిగా అనిపిస్తుంది.
గదిని నిండుగా ఉంచండి
గదిలో సామాన్లు తక్కువగా ఉండి, ఖాళీగా ఉంటే చలి ఎక్కువగా అనిపిస్తుంది. ఫర్నిచర్, పుస్తకాలు లేదా ఇతర వస్తువులు గదిలో ఉంటే అవి ఉష్ణాన్ని గ్రహించి నెమ్మదిగా విడుదల చేస్తాయి. కాబట్టి గది మరీ ఖాళీగా లేకుండా చూసుకోండి.



Click it and Unblock the Notifications