Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ వర్షాకాలంలో తప్పక చూసి, ఆస్వాదించాల్సిన జలపాతాలు
వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలోని జలాశయాలు, వాగులు, వంకలు, నదులు నిండుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. ఈ వర్షాకాలం నీళ్లు నిండుగా ఉండటంతో.. ఈ వాటర్ ఫాల్స్ అద్బుతమైన రూపును సంతరించుకున్నాయి. పచ్చని ప్రకృతి మధ్యలో పై నుంచి తెల్లని దారలా.. నీరు దూకుతుంటే ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. తెలంగాణలోని అద్భుతమైన జలాపాతాల లిస్టు ఇది.
కుంటాల జలపాతం
ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ గ్రామ సమీపంలో ఉంటుంది కుంటాల జలపాతం. తెలంగాణలోని చాలా మందికి తెలిసిన జలపాతాల్లో కుంటాల ఒకటి. ఎత్తైన రాతి కొండలపై నుంచి నీరు ఎగిసిపడుతుంది. హైదరాబాద్ నుంచి 261 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మల్ నుంచి 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుంటాలా.

బొగత జలపాతం
ములుగు జిల్లాలో ఉండే బొగత జలపాతం మరో ప్రసిద్ధి చెందిన జలపాతం. దీనిని తెలంగాణ నయగారా అని కూడా పిలుస్తుంటారు. అంత అద్భుతంగా, మంత్రముగ్దులను చేసే ప్రకృతి సౌందర్యం మధ్య ఉంటుంది. వరంగల్ నుంచి 140, ములుగు నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బొగత జలపాతం.
మల్లెల తీర్థం జలపాతం
నల్లమల అడవిలోని ప్రసిద్ధ జలపాతం మల్లెల తీర్థం. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య మనోహరంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఉంటుంది. శ్రీశైలానికి కేవలం 58 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
పొచ్చెర జలపాతం
పొచ్చెర జలపాతం నిర్మల్ కు కేవలం 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పచ్చని చెట్ల మధ్య ఉండే ఈ జలపాతం అద్భుతమైన ఫీల్ ను ఇస్తుంది.
గాయత్రి జలపాతం
నిర్మల్ జిల్లాల్లో ప్రవహించే గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఉంటుంది గాయత్రి జలపాతం. నిర్మల్ పట్టణానికి కేవలం 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ముత్యాల జలపాతం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అద్భుతమైన జలపాతం ఇది. పచ్చని చెట్లు, దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది ముత్యాల జలపాతం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications