Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
నెట్టింట తెగ వైరల్ అవుతున్న బెడ్ రాటింగ్ అంటే ఏమిటి? ఎందుకంత ట్రెండ్ అవుతోంది?
మనకు కాస్త అలసటగా అనిపించినా, ఆరోగ్యం బాగాలేకపోయినా, బాధ ఎక్కువైన, ఓపిక తగ్గినా.. వెంటనే మనం బెడ్ రూంలోకి వెళ్లిపోయి మంచంపై పడుకుంటాం. నిద్ర పట్టకపోయినా అటూ ఇటూ బొర్లుతూ ఏదో ఆలోచిస్తుంటాం. లేదా ఫోన్ పట్టుకొని ఏదో ఒకటి చూస్తుంటాం. ఇది చాలా సహజంగా జరిగేది. అందరూ చేసేదే కూడా. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో జెనరేషన్ జెడ్ వాళ్లు దీన్ని మరో కొత్త పేరుతో ట్రెండ్ చేస్తున్నారు. అదే బెడ్ రాటింగ్.
బెడ్ రాటింగ్ అంటే ఏంటి?:
బెడ్ రాటింగ్ అంటే మరేమీ లేదండి. ఎక్కువ సమయం పాటు పడక పైనే ఉండడం. తాజాగా బెడ్ రాటింగ్ పేరుతో వస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బెడ్ రాటింగ్ చాలా మంచిదని.. ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడంలో ఓ దశ వరకు భౌతిక, మానసిక ప్రశాంతతకు ఇదెంతో ఉత్తమ మార్గం అని కొంతమంది నిపుణులు కూడా సూచిస్తుండడం గమనార్హం.

అమెరికా టిక్ టాకర్ తీసుకొచ్చిన బెడ్ రాటింగ్ ట్రెండ్:
అమెరికాకు చెందిన ఓ టిక్ టాకర్ తొలుత ఈ బెడ్ రాటింగ్ అనే పదాన్ని ఉపపయోగిస్తూ... ఇలా బెడ్ కు అంకితం అవడం ఎవరికి ఇష్టం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. వెంటనే ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో ఎంతో మంది లైకులు, షేర్లు, కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు ఈ వీడియోను కోటిన్నర మంది వీక్షించారు. మరో యువతి పెట్టిన టిక్ టాక్ పోస్టును మూడు కోట్లకు పైగా చూశారు.
ఏం చేస్తామన్నది కాదు, బెడ్‌పై ఉండటమే ముఖ్యం:
ఇదే తరహాలో అనేక వీడియోలు ఇటీవల టిక్ టాక్ వంటి వీడియో మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ కోసం నేటి యువతు ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారట. ఎక్కువ సేపు బెడ్ మీద పడుకోవడమే బెడ్ రాటింగ్ అర్థం. సాధారణం కంటే ఎంత ఎక్కువ సేపు మంచానికే పరిమితం అవుతున్నారనేది దీని భావం. ఎందుకు అంతసేపు ఉంటున్నారు, ఆ సమయంలో ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు.
ఓటీటీలు చూడడం, రీల్స్ చూడడం, సీలింగ్ ను చూస్తూ ఉండిపోవడం, యోగా చేయడం చేస్తుంటే.. మరికొందరు నిద్రపోతుండడం చేస్తున్నారు. అయితే బెడ్ రాటింగ్ మాదిరిగానే ఇటీవలే ఎన్నో చేష్టలు ట్రెండింగ్ గా మారాయి. బాడీ చెకింగ్, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వంటి పేర్లతో కూడా గతంలో అనేక వీడియోలు వైరల్ అయ్యాయి.



Click it and Unblock the Notifications
