Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఇంటి ప్రవేశద్వారం వద్ద చెంబులో నీటిని ఉంచండి.. ఈ ఒక్క పరిష్కారంతో సమస్యలన్నీ మాయం
వాస్తు శాస్త్రం ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపిస్తుంది. మనం ఉండే ఇల్లు, కార్యాలయం, వ్యాపార స్థలంలోని వాస్తు తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు కొన్ని దిక్కుల్లోనే ఉండాలి. కొన్ని రకాల చెట్లు, వంట గది, అద్దం, ఇతర వస్తువులు కూడా వాస్తు ప్రకారం సరైన దిశలో ఉండాలి. అప్పుడే ఆ ఇంట్లో అనుకూలత ఉంటుంది. లేకపోతే ప్రతికూల శక్తుల వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుంది. కష్టాలు, సమస్యలు వేధిస్తాయి.
తలపెట్టిన పనులు నెరవేరకపోవడం, పనులు ఆగిపోవడం, ఆర్థిక సమస్యలు వేధించడం లాంటి వాటితో ఇబ్బందులు పడుతుంటే ఇంట్లో ఒక చోట ఓ గిన్నెలో నీటిని ఉంచడం ద్వారా అద్బుతమైన ప్రయోజనం కలుగుతుందని చెబుతోంది వాస్తు శాస్త్రం.

వాస్తు శాస్త్రం ప్రకారం నీరు శ్రేయస్సును, సానుకూలను సూచిస్తుంది. అలాంటి నీటిని ఒక గిన్నెలో పోసి అందులో కొన్ని పూలను వేసి ఇంట్లో ఉంచడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది.
నీటి గిన్నె ఓ మూలలో ఉంచాలి?
ఇంటికి వచ్చే వ్యక్తులు, అతిథుల దృష్టి పడేలా.. నీటితో నింపిన గిన్నెను ఉంచాలి. గుండ్రని గిన్నెలో నీటిని నింపి అందులో కొన్ని పూలు, ఆకులను వేసి హాల్ లో ఉంచండి. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. హాలు మధ్యలో, ఆగ్నేయ మూలలో, ఈశాన్య మూలలో, ఉత్తర దిశలో, నైరుతి మూలలో ఉంచాలి. పసుపు రంగు పూలు, ఆకుపచ్చ రంగు ఆకులు ఈ నీటిలో ఉంచాలి.
ఏ లోహపు గిన్నె వాడాలి?
ఇత్తడి, బంగారం వంటి ఏదైనా లోహంతా తయారు చేసిన గిన్నెను ఇందులో వాడుకోవచ్చు. గ్లాస్, క్లే, సిరామిక్ వంటి వాటితో తయారు చేసిన గిన్నెలను కూడా వాడొచ్చు. వెండి, ఇనుము, అల్యూమినియం వంటి వాటిని మాత్రం వాడకూడదు.
* నీటికి నెగెటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అలాగే నీరు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇత్తడి గిన్నెలో నీరు పోసి హాలు మధ్యలో ఉంచితే కుటుంబసభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* హాలులో వాటర్ బౌల్ పెట్టడం వల్ల సంతోషంగా ఉంటారు.
* వాస్తు దోషం పోవడానికి ఈశాన్య దిక్కులో వాటర్ బౌల్ పెట్టాలి.
* ఇత్తడి గిన్నెలో నీరు పోసి పూలతో అలంకరించి ఈశాన్య మూలలో ఉంచితే ఐశ్వర్యం, శ్రేయస్సు పెరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications