Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Bengaluru Techie: ఏడాదికి అర కోటి జీతం, అయినా అసంతృప్తి, బెంగళూరు టెకీ ఆవేదన
అలా చదువు అయిపోగానే ఇలా మంచి కంపెనీలో ఉద్యోగం. అదిరిపోయే ప్యాకేజీ. సంవత్సరానికి 58 లక్షల జీతం అంటే నెలకు దాదాపు 5 లక్షల శాలరీ. ఎంతో మందికి కలలు కనే ప్యాకేజీ అది. అనుకూలమైన పని వేళలు, ఎలాంటి కష్టాలు లేవు. జీవితం చాలా సాఫీగా సాగిపోతోంది. ఇంకేం జీవితంలో సెటిలైపోయినట్లే.

ఇలాంటి జీతం జీవితం ఉన్న ఓ బెంగళూరుకు చెందిన యంగ్ టెకీని చూసి తన స్నేహితులు, బంధువులు ఇంకేం కావాలి. మంచి జీతం, సమస్యల్లేని జీవితం, సూపర్ లైఫ్ అన్నారు. అయితే ఆ యంగ్ టెకీలో మాత్రం జీవితంపై తీవ్ర అసంతృప్తి. లక్షల కొద్దీ జీతం అందుకుంటున్నా తనలో ఆనందం లేదు. జీవితం సాఫీగా సాగిపోతుంటే తను ఏదో మిస్ అవుతున్నాడు. జీవితంలో ఒంటరి అయిపోయినట్లు అనిపిస్తోంది అతడికి.
'జీవితంలో ఏమాత్రం సంతృప్తి లేదు':
'జీవితంలో ఏమాత్రం సంతృప్తి లేదు' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. అంత పెద్ద మొత్తంలో జీతం, సూపర్ జీవితం అన్నీ ఉన్నా తనలో ఉన్న నిరాశ నిస్పృహలు సుఖదా అనే ట్విట్టర్ యూజర్ ను కదిలించాయి. తన పోస్టును 'ది అదర్ ఇండియా' పేరుతో ట్విట్టర్ పోస్టు చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
పోస్టులో ఏం రాశాడంటే:
'నా వయస్సు 24 సంవత్సరాలు. నేను పెద్ద ఐటీ కంపెనీలో 2.9 ఏళ్లుగా పని చేస్తున్నాను. నా జీతం ఏడాదికి రూ.58 లక్షలు. అనుకూలమైన పనివేళలు. కానీ, జీవితంలో సంతృప్తి లేదు. ఏదో వెలితిగా అనిపిస్తోంది. నేను ఒంటరిగా ఉండిపోయానని అనిపిస్తోంది. గర్ల్ ఫ్రెండ్ లేదు. నా మిత్రులందరూ వారి వారి జీవితాలతో బిజీగా ఉన్నారు. దాదాపు మూడేళ్లుగా ఇదే ఉద్యోగంలో ఉన్నాయి. కెరీర్ ప్రారంభం నుండి ఇదే కంపెనీలో ఇదే పొజిషన్ లో పని చేస్తున్నాను. చాలా కాలం నుండి పని చేయడం వల్ల కావొచ్చు. పనిలో పెద్దగా ఎగ్జైట్మెంట్ లేకుండా పోయింది. పనిలో కూడా కొత్తదనం లేదు. రొటీన్ జాబ్ వల్ల జీవితంలో సవాళ్లు స్వీకరించడంపై, కెరీర్ లో మరింతగా ఎదగడంపై ఫోకస్ చేయలేదు. నా లైఫ్‌ను ఇంట్రెస్టింగ్ గా మార్చుకోవడానికి, నేను ఏం చేయాలో దయచేసి ఎవరైనా చెప్పండి. అలాగే 'జిమ్ కు వెళ్లు' అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే ఆల్రెడీ నేను జిమ్ కు వెళ్తున్నాను.' అని బెంగళూరుకు చెందిన ఆ యువ టెకీ రాసుకొచ్చాడు.
ఈ పోస్టు పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 'ఒంటరిగా, అసంతృప్తిగా ఉంటోందని నా మిత్రులు చాలా మంది నాతో చెప్పారు. నాకు చాలాసార్లు అలాగే అనిపించింది. ఇదే విషయాన్ని మా అమ్మతో చెప్పాను. బతకడానికి ఏముంది, తొందరగా చనిపోవాలని ఉందని చెప్పా.. వెంటనే ఒక్కటి తగిలించింది' అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. 'జీవితంలో డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, సంతోషం కూడా ఉండాలి అనేందుకు ఇదే ఉదాహరణ' అని మరొకరు కామెంట్ చేశారు. 'గర్ల్‌ఫ్రెండ్‌ను వెత్తుకో లేదా పెళ్లి చేసుకో ఇదే మంచి పరిష్కారం' అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. 'స్టార్టప్ కంపెనీ మొదలు పెట్టు బ్రో' అంటూ మరొకరు సలహా ఇచ్చారు.





Click it and Unblock the Notifications
