Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
New Year Celebrations 2025: ఫ్యామిలీల కోసం హైదరాబాద్‌లో మంచి న్యూ ఇయర్ ఈవెంట్స్ ఇవే.. ధర కూడా తక్కువే!
గురూ! కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఎన్నో కొత్త కొత్త ఆశలతో పాత ఏడాదిలో చేసిన తప్పులను పాలద్రోలి కొత్త ఏడాదిని స్వాగతం పలికేందుకు చాలా మంది ఉత్సాహంగా ఉన్నారు. ఇదే సమయంలో పాత ఏడాదిని వీడ్కోలు పలికేందుకు.. ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలని అనుకుంటున్నారు. బ్యాచిలర్స్ ఎక్కడపడితే అక్కడ పార్టీలు చేసుకుంటారు. వారికి నిర్దిష్టమైన ప్రదేశాలు కూడా అవసరం లేదు. అయితే ఫ్యామిలీలు వేడుకలు జరుపుకోవడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్కడ ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
DJ ఎమిలీ
హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్ అయిన DJ ఎమిలీ సంధ్య జంక్షన్ గచ్చిబౌలి వద్ద ఈవెంట్ నిర్వహిస్తుంటారు. ఈ ఈవెంట్‌లో ఫ్యామిలీ వాళ్ళకే ఎంట్రీ ఉంటుంది. థ్రిల్లింగ్ లైవ్ పర్ఫార్మెన్స్, ఎలెక్ట్రిఫయింగ్ పార్టీస్‌తో రాత్రంతా పార్టీలు జరుపుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడపొచ్చు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి 8 గంటల నుంచి ఈ పార్టీ మొదలవుతుంది. ఇందులో ఎంట్రీ అయ్యేందుకు 499 రూపాయల ఫీజ్ ఉంటుంది. ఇది సంధ్య జంక్షన్ గచ్చిబౌలిలో ఉంటుంది.

నోవాటెల్ హైటెక్ సిటీ
హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో కూడా కొత్త ఏడాది వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. నూతన సంవత్సర వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మీ ప్రియమైన వారితో కొత్త ఏడాదిని జరుపుకోవడానికి ఇది సరైన ప్రదేశం. కుటుంబ సభ్యులతో లైవ్ మ్యూజిక్, నిరావాల్ ప్రదర్శన వంటివి ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీలీల కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొంటుంది. ఇందులో పాల్గొనాలంటే 1499 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది.
హార్ట్ కప్ కాఫీ కొంపల్లి
న్యూ ఇయర్ ఈవ్ 2025 పేరుతో కొంపల్లిలోని హార్ట్ కప్ కాఫీలో కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి 1:30 గంటల వరకు ఈ వేడుకలకు నిర్వహిస్తారు. ఇక్కడ ఎన్నో రకాల ప్యాకేజెస్ ఉంటాయి. వాటి ఆధారంగా ఇందులో ఎంట్రీ అనేది ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ 1999 నుంచి ప్రారంభం కానున్నాయి.
అలాగే ఎల్‌బీ నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో కూడా UB ఎంటర్టైన్మెంట్స్ బ్యాండ్ కూడా కొత్త ఏడాది వేడుకలను నిర్వహించనుంది. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లి ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. పిల్లల కోసం, కపుల్స్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసి ఉంచారు. డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
వీటితో పాటు రామోజీ ఫిలిం సిటీలో కూడా వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ఎన్నో ప్రదేశాల్లో కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహిస్తుంటారు. ఇందులో పాల్గొనేందుకు చాలా తక్కువ మొత్తం ఫీజ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీకి సెట్ కాదనే భావన ఉంటుంది. అందుకే పైన పేర్కొనబడిన ఫ్యామిలీ ఫ్రెండ్లి ఈవెంట్లలో పాల్గొని కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవచ్చు.



Click it and Unblock the Notifications