Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
హైదరాబాద్‌లో హలీమ్ తినడానికి బెస్ట్ రెస్టారెంట్స్ ఇవే.. జన్మలో మర్చిపోలేని టేస్ట్ ఇక్కడ దొరుకుతుంది!
రంజాన్ మాసం అనేది కేవలం ముస్లిం సోదరుల పండుగ. ఈ పండగ నెలలో హైదరాబాద్‌లోని ప్రతి ఒక్కరూ తినాలనుకునే ప్రత్యేక ఆహారం "హలీమ్". దీనికోసం గంటల తరబడి ఎదురుచూసి మరీ కొనుక్కొని తినేవాళ్లు ఉన్నారు. ఈ సీజన్‌లో, శరీరానికి మంచి పోషకాలు అందించే హలీం హైదరాబాద్‌లోని ప్రతీ ఏరియాలో దొరుకుతుంది. వీటిలో కొన్ని స్ట్రీట్ సైడ్ వెండర్స్ నుంచి ప్రముఖ రెస్టారెంట్లు కూడా హలీమ్‌ను సర్వ్ చేస్తాయి. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో లేదా కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి, బెస్ట్ హలీమ్ స్పాట్స్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ స్టోరీలో హైదరాబాద్‌లో బెస్ట్ హలీం స్పాట్స్ గురించి వివరించాము, చూసి మీరు కూడా వెళ్లి ఓసారి ట్రై చేయండి.
హైదరాబాద్‌లోని బెస్ట్ హలీమ్ స్పాట్స్
పిస్తా హోస్:
హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధి గాంచిన హలీమ్ స్పాట్ "పిస్తా హోస్". ప్రతి ఏడాది హలీమ్‌ను జ్యూసీగా, టేస్టీగా అందించడంతో ఎప్పటికప్పుడు పిస్టా హోస్ తన ముద్రను కంటిన్యూ చేసుకుంటూ వస్తోంది. ఇది నగరంలోని వివిధ ప్రదేశాల్లో విస్తరించి ఉంటుంది. కాబట్టి మీరు మీకు సమీపంలో ఉన్న ఒక పిస్తా హోస్లో ఈ రుచిని ఆస్వాదించవచ్చు.

షాదాబ్ హోటల్:
ఓల్డ్ సిటీ పరిధిలోని ఘాన్సీ బజార్లో ఉన్న షాదాబ్ హోటల్, ఈ ప్రాంతంలోని బెస్ట్ హలీమ్ ప్రదేశంగా గుర్తించబడింది. వారి హలీమ్‌తో హైదరాబాదీయులకు ఒక ట్రెడీషనల్ టేస్ట్ అందిస్తుంటారు. ఇక్కడ ఓసారి హలీం టేస్ట్ చేసిన వారు జన్మలో వదులుకోరు.
హోటల్ సిటీ డైమండ్:
మెహదీపట్నంలో ఉన్న హోటల్ సిటీ డైమండ్ హలీమ్‌తో ప్రసిద్ధి పొందింది. దీని హలీమ్ స్వచ్ఛమైన నెయ్యి, మసాలాలతో, పాతకాలపు భట్టిలో నెమ్మదిగా వండుతారు. దీనివల్ల దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది.
మందార్ రెస్టారెంట్:
టోలీచౌక్ ప్రాంతంలో ఉన్న మందార్ రెస్టారెంట్, మీరు ఇంటి రుచి మరియు విలేజ్ తరహా రుచులను ఇష్టపడితే హలీమ్ కోసం ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఇక్కడి హలీమ్ చాలా సూపర్‌గా అద్భుతంగా ఉంటుంది.
పెషావర్:
లక్టీకాపుల్ మరియు మలక్‌పేటలో ఉన్న పెషావర్ రెస్టారెంట్ టాపింగ్స్ లేకుండా నిజమైన హలీమ్ అందిస్తుంది. అసలు సిసలైన హలీమ్ రుచి కోసం ఈ రెస్టారెంట్‌ను ఎంచుకోవడం అత్యుత్తమైన ఎంపిక అని చెప్పుకోవచ్చు.
సుభాన్ బేకరీ:
ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి గాంచిన సుభాన్ బేకరీ కూడా ఇప్పుడు హలీమ్‌లో ఆ ప్రత్యేకతను అందిస్తోంది. నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల్లో దీని రుచి ఆస్వాదించవచ్చు.
టాపింగ్స్‌తో హలీమ్ స్పాట్స్
గ్రిల్ 9:
"బాహుబలి హలీమ్" అని ప్రత్యేకంగా గుర్తించబడిన గ్రిల్ 9 రెస్టారెంట్, హలీమ్‌లో టాపింగ్స్ (చికెన్ 65, బాయిల్డ్ ఎగ్స్, పత్తర్ కా ఘోష్, జీడిపప్పు, బాదం, క్రీమ్)తో ప్రత్యేకంగా సర్వ్ చేస్తుంది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఈ హలీమ్‌ను ట్రై చేయవచ్చు.
సర్వి రెస్టారెంట్:
మసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్ మరియు సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్న సర్వి రెస్టారెంట్, స్పెషల్ ఇరానీ హలీమ్‌ను జీడిపప్పు, క్రీమ్ మరియు చికెన్ 66తో అందిస్తుంది.
కేఫ్ 555:
మసాబ్ ట్యాంక్‌లోని కేఫ్ 555 రెస్టారెంట్, ఫ్యూజన్ హలీమ్‌కు ప్రసిద్ధి చెందింది. దీనిలో మీరు చికెన్ 65, నల్లి ఘోష్, తలావా ఘోష్, ఎగ్, క్రీమ్ వంటి టాపింగ్స్‌తో హలీమ్‌ను ఆస్వాదించవచ్చు.
షా ఘౌస్:
హైదరాబాద్‌లోని లక్టీకాపుల్, టోలీచౌక్, గచ్చిబౌలి, షా అలీ బండా ప్రాంతాల్లో ఉన్న షా ఘౌస్, తమ హలీమ్‌కు అనేక రుచులు, మాంసపు టాపింగ్స్ తో ప్రత్యేకతను అందిస్తుంది. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.



Click it and Unblock the Notifications