Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Honeymoon Destinations: కొత్తగా పెళ్లయిందా? డిసెంబర్ లో భాగస్వామితో ఇక్కడికి వెళ్తే స్వర్గమే
గత కొన్ని రోజులుగా చలి విపరీతంగా ఉంటోంది. ఈ చలికాలంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న చాలా జంటలు హనీమూన్ కి మంచి ప్లేస్ కి వెళ్లాలని ఫ్లాన్ చేసుకుంటున్నారు. అయితే డిసెంబర్ లో హనీమూన్ కి ఫ్లాన్ చేసుకుంటున్నట్లయితే ఇండియాలో వెళ్లడానికి రొమాంటిక్, బ్యూటిఫుల్ ప్లేస్ లు కొన్ని ఉన్నాయి. ఈ గమ్యస్థానాలు మంచి హనీమూన్ అనుభవాన్ని అందిస్తాయి. ఇక్కడ మీరు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ అద్భుతమైన శృంగార అనుభవాన్ని ఆస్వాదించవచ్చు. డిసెంబర్ లో జంటలు హనీమూన్ వెళ్లడానికి 8 ఉత్తమ ప్రదేశాలు ఏవో ఇక్కడ చూడండి.
ఊటీ
తమిళనాడు రాష్ట్రంలోని ఊటీ మంచి రొమాంటిక్, బ్యూటిఫుల్ హనీమూన్ డెస్టినేషన్. డిసెంబరులో ఇక్కడ వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊటీకి వెళ్తే ప్రశాంతమైన వాతావరణంలో, ప్రకృతికి దగ్గరగా జీవించిన అనుభూతిని పొందుతారు. ఊటీ పర్యటనలో టీ ఎస్టేట్ లు, ఊటీ సరస్సులో బోటింగ్,ట్రెక్కింగ్ చేయడంలో మంచి ఫీల్ ఉంటుంది. టాయ్ ట్రైన్ ప్రయాణం అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

కొడైకెనాల్
తమిళనాడు రాష్ట్రంలోని కొడైకెనాల్ దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక అందమైన, ప్రశాంతమైన హిల్ స్టేషన్. డిసెంబరులో ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడి సరస్సులో బోటింగ్, చాక్లెట్ ఫ్యాక్టరీ సందర్శన,వాకింగ్ ట్రైల్స్ అన్నీ అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.
మున్నార్
కేరళలో రాష్ట్రంలోని మున్నార్ ఒక రొమాంటిక్ హనీమూన్ డెస్టినేషన్. తేయాకు తోటల మధ్య ఉన్న ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా, అందంగా ఉంటుంది. తేయాకు తోటలు, ఎరవికులం నేషనల్ పార్క్, ప్రశాంత వాతావరణం మీ హనీమూన్ ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేస్తుంది.
మనాలి
మనాలి ఒక ప్రసిద్ధ హనీమూన్ డెస్టినేషన్. ఇక్కడ డిసెంబర్‌లో మంచు కురుస్తుంది. రొమాంటిక్ మూడ్‌ని సెట్ చేయడానికి ఈ ప్రదేశం సరైనది. మంచుతో కప్పబడిన లోయలు, స్నో గేమ్స్, సోలాంగ్ వ్యాలీపై అద్భుతమైన వీక్షణలు, రోహ్‌తంగ్ పాస్ ఇలా ఇక్కడి ప్రత్యేకలు మీకు గొప్ప హనీమూన్ అనుభవాన్ని అందిస్తుంది.
కూర్గ్
కర్ణాటకలోని కూర్గ్ కూడా హనీమూన్ కి బెస్ట్ ప్లేస్. ఇక్కడి వాతావరణం,ప్లేస్ లు మంచి అనుభవాన్ని అందించడమే కాకుండా రొమాంటిక్ గా ఉండే ప్లేస్ లు మీలో కొత్త కోరికలను పెంచి మీ భాగస్వామితో ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి సాయపడతాయి.
కశ్మీర్
మంచు కురిసే శీతాకాలంలో కాశ్మీర్ అందం మరింత పెరుగుతుంది. ఇక్కడి గుల్‌మార్గ్, పహల్గామ్, సోన్‌మార్గ్ వంటి హిల్ స్టేషన్‌లు హనీమూన్‌కి అనువైనవి. మంచుతో కప్పబడిన పర్వతాలు,నిర్మలమైన లోయలు, షికారా రైడ్, గుల్‌మార్గ్‌లో స్కీయింగ్ మనోహరమైన హిల్ స్టేషన్ వాతావరణం ఇక్కడి ప్రత్యేకతలు.
జైసల్మేర్
రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉన్న జైసల్మేర్ ఒక ప్రత్యేకమైన హనీమూన్ గమ్యస్థానం. ఇక్కడ ఉన్న బంగారు భవనాలు, కోటలు, ఎడారి సఫారీలు చాలా ఉత్తేజకరమైనవి. ఎడారిలో నైట్ క్యాంపింగ్, జైసల్మేర్ కోట, పట్వాస్ హవేలీ ఎడారిలో సూర్యాస్తమయం వీక్షణ ఇక్కడి ప్రత్యేకతలు.
గ్యాంగ్‌టక్
సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ చాలా ప్రశాంతమైన,రొమాంటిక్ గమ్యస్థానం. ఇక్కడ నుండి కాంచనజంగా పర్వత దృశ్యం చూడటం చాలా అందంగా ఉంటుంది. బౌద్ధ విహారాలు,హిమాలయ శిఖరాలను చూడటం చాలా బాగుంటుంది.



Click it and Unblock the Notifications