Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Places to Celeb New Year: ఈ న్యూ ఇయర్‌కు మీ ఫ్యామిలీతో ఈ ప్లేసెస్‌కు వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు
మీరు ఈ న్యూ ఇయర్‌ను పూర్తి ఉత్సాహంతో స్వాగతించాలనుకుంటే దేశంలోని ఈ ప్రదేశాలు మీకు మంచి ఎంపిక అవుతాయి.
Places to Celeb New Year: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సరాన్ని ఆహ్లాదంగా, ఆనందోత్సాహాలతో స్వాగతించాలని అనుకుంటున్నారా.

మీరు ఈ న్యూ ఇయర్‌ను పూర్తి ఉత్సాహంతో స్వాగతించాలనుకుంటే దేశంలోని ఈ ప్రదేశాలు మీకు మంచి ఎంపిక అవుతాయి.

1. గోవా
భారత్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు గోవా అత్యంత మంచి ఎంపిక. ఎంజాయ్ చేయడానికి గోవా కంటే మించిన ప్రదేశం లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా చాలా మంది గోవాకు క్యూ కడుతుంటారు. న్యూ ఇయర్ గోవాలో చేసుకోవడం చాలా మజాగా ఉంటుంది.
కొత్త సంవత్సరం కోసం గోవాలోని పబ్‌లు, క్లబ్‌లు తమ ప్రత్యేక ఏర్పాట్లతో సందర్శకులను ఆకట్టుకుంటాయి.

2. గుల్మార్గ్, జమ్ముకశ్మీర్
గుల్మార్గ్ పట్టణంలో వేడుకలు చాలా సరదాగా ఉంటాయి. ప్రకృతి ఒడిలో నూతన సంవత్సరాన్ని పలకరించాలనుకునే వారు గుల్మార్గ్ అసాధారణ అనుభూతిని ఇస్తుంది.
ప్రియమైన వారిని గుల్మార్గ్ తీసుకెళ్లి మంచులో ప్రకృతి ఒడిలో సేదతీరుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం నిజంగా రొమాంటిక్‌గా ఉంటుంది.

3. మనాలి, హిమాచల్ ప్రదేశ్
మనాలి ని వాలీ ఆఫ్ ది గాడ్స్ అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఏడాది మొత్తం పర్యాటకులతో కిక్కిరిసి ఉంటుంది. నూతన సంవత్సరం వేడుకలు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. గడ్డకట్టే వాతావరణంలో మంటలు వేసుకుని కూల్ కూల్‌గా, హాట్ హాట్‌గా ప్రకృతిని ఆస్వాదించవచ్చు.
ఓల్డ్ మనాలీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త రుచికరమైన వంటకాలు ఉంటాయి.

4. ఊటీ, తమిళనాడు
సంగీతం, మెరిసే పార్టీ, క్రేజీ పీపుల్స్‌తో ఊటీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. తమిళనాడులోని ఈ ప్రాంతం కొత్త సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రత్యేక పార్టీలు, డీజేల హోరు, ఉత్సాహభరిచే ఈవెంట్లు, మల్టీ కోర్స్ మీల్స్ ఇలా చాలా చాలా ఉంటాయి ఊటీలో.

5. వాయనాడ్, కేరళ
వాయనాడ్ ను గ్రీన్ ప్యారడైజ్ అని కూడా అంటారు. భారతదేశంలోని ఉత్తమ నూతన సంవత్సర గమ్యస్థానాల్లో ఒకటిగా చాలా ప్రజాదరణ పొందింది. ప్రశాంతమైన వాతావరణంలో కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడానికి ఇది ఉత్తమమైన ప్రాంతం. పచ్చని సుగంధ తోటల చుట్టూ తిరగొచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించొచ్చు. జలపాతాలు, తోటలు ఇలా కేరళలో చూడటానికి ఎన్నో ఉన్నాయి.

6. ఉదయపూర్, రాజస్థాన్
ఉదయపూర్‌లోని సిటీ ఆఫ్ లేక్స్ ప్రాంతంలో కొత్త ఏడాదిని ఆస్వాదించడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. ప్రియమైన వారితో ఉదయపూర్ లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికితే ఆ మధురానుభూతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
రాచరిక జీవనశైలి, గ్రామీణ వైబ్‌ల కలయికే రాజస్థాన్‌లోని ఉదయపూర్. కింగ్ సైజ్ జీవితాన్ని గడపాలనుకునే వారికి ఉదయపూర్ నిజమైన ఎంపిక.



Click it and Unblock the Notifications