Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
డిసెంబర్ 31 నైట్ వెళ్లడానికి హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్ లు..హీరోయిన్ శ్రీలల కూడా వస్తుంది
కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. డిసెంబర్ 31 నైట్ ని ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటది అని ఇంకా ఆలోచిస్తున్నారా? డిసెంబర్ 31 నైట్ సెలబ్రేట్ చేసుకోడానికి హైదరాబాద్ లో అద్భుతమైన కొన్ని ప్లేస్ లు ఉన్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లలో జరిగే ఆకర్షణీయమైన ఈవెంట్‌ల నుండి ప్రముఖ క్లబ్‌లలో ఉత్సాహంగా ఉండే జనాల వరకు కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతించాలో హైదరాబాద్ కు బాగా తెలుసు. గొప్ప సంస్కృతి, నైట్ లైఫ్ కి ప్రసిద్ధి చెందిన హైదరాబాద్ వివిధ రకాల థ్రిల్లింగ్ న్యూ ఇయర్ పార్టీలను అందిస్తుంది. ఇక్కడికి వెళ్తే ఆట పాటలు, మందు,చిందు,విందు అన్నీ అద్భుతంగా ఉంటది.
పార్టీ ప్రియుల కోసం ప్రిజమ్ క్లబ్, ది పార్క్, హైలైఫ్ బ్రూయింగ్ కో వంటి వేదికలు కొన్ని ప్రసిద్ధ DJలు,లైవ్ షోలు, విలాసవంతమైన బఫే, డ్రింక్స్ కలిగి ఉండే అద్భుతమైన ఈవెంట్‌లను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రదేశాలు అద్భుతమైన లైట్లు,ఉత్తేజకరమైన సంగీతం, ఉత్సాహభరితమైన జనసమూహంతో ఉల్లాసంగా ఉంటాయి. ఇవి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఎంజాయ్ చేయడానికి సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెప్పడానికి హైదరాబాద్ లో డిసెంబర్ 31, 2024 రాత్రి జరిగే కొన్ని నూతన సంవత్సర ఈవెంట్‌లు, పార్టీలు జరిగే ప్లేస్ ల లిస్ట్ ఇక్కడ చూడండి.

హైదరాబాద్ లో న్యూ ఇయర్ 2025 ఈవెంట్‌లు, పార్టీలు
NYE కార్నివాల్
శ్రావ్యమైన బ్యాంగ్ తో 2025 వెల్కమ్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉండండి. బ్లాక్‌బస్టర్ హిట్‌లు, టైమ్‌లెస్ క్లాసిక్ మ్యూజిక్ తో డిసెంబర్ 31 నైట్ జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇస్తుంది. వారి లైవ్ షోస్ సంతోషకరమైన వేడుకకు మరింత ఉత్సాహానిస్తాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ఇది సరైన ప్లేస్
సమయం: రాత్రి 7:00 PM
టికెట్: రూ. 1699
ప్లేస్: బౌల్డర్ హిల్స్,హైదరాబాద్
అమల్ మాలిక్ లైవ్
HITEX ఓపెన్ అరేనాలో విలాసవంతమైన,వినోదం,ఉత్సాహంతో కూడిన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు ఉంటుంది. అమల్ మాలిక్,అతని టీమ్ చేసే సంచలనాత్మక లైవ్ షో డిసెంబర్ 31 నైట్ కి హైలైట్ ఉంటుంది. వారు వేదికపైకి వచ్చినప్పుడు మంత్రముగ్దులను చేయడానికి సిద్ధంగా ఉండండి.
సమయం: 7:00 PM
టికెట్: రూ. 1299
స్థానం: HITEX ఎగ్జిబిషన్ సెంటర్, హైదరాబాద్
NYE 2025
సెన్సేషనల్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్పెషల్ గెస్ట్ గా పాల్గొంటుంది ఈ ఈవెంట్ లో. శ్రీలల ప్రత్యేక షో స్టాపింగ్ ప్రదర్శనతో పాటు ప్రేక్షకుల ఇష్టమైన నిరావల్‌తో కూడిన లైవ్ షో ఆడియన్స్ ని మర్చిపోలేని రాత్రిగా మిగిలిపోతుంది. గ్లామర్, వినోదంతో కూడిన రాత్రిగా నిలిచిపోతుంది.
సమయం: 8:00 PM
టికెట్: రూ. 1499
స్థానం: నోవాటెల్, HICC హైదరాబాద్
ప్రిజం సర్కస్ 4.0
భారతదేశంలోని ప్రీమియర్ నైట్ లైఫ్ డెస్టినేషన్ అయిన ప్రిజం క్లబ్‌లో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడం భలేగా ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మరపురాని రాత్రిగా మిగితిపోతుంది.
సమయం: 8:00 PM
టికెట్: రూ. 2499
స్థానం: ప్రిజం క్లబ్ అండ్ కిచెన్,హైదరాబాద్
డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్ లో ఈ ప్లేస్ లకు వెళ్లడం మిస్ అవ్వకూడదు
ఉప్పల్ స్టేడియం
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో డిసెంబర్ 31 నైట్ 7 గంటల నుంచి అతిపెద్ద బహిరంగ నూతన సంవత్సర వేడుక జరుగుతుంది. లోకల్ లైవ్ బ్యాండ్‌లు, అంతర్జాతీయ DJలు, ప్రత్యేక బీట్స్ వినడానికి సిద్ధంగా ఉండండి. ఈ కార్యక్రమానికి హాజరై మీ నూతన సంవత్సర వేడుకలను మరపురానిదిగా చేసుకోండి. దీనికి టిక్కెట్ ధర రూ. 149గా ఉంటుంది.
హైటెక్ ఎరీనా
హైదరాబాద్‌లోని హైటెక్ ఎరీనాలో డిసెంబర్ 31 నైట్ 7 గంటల నుంచి అతిపెద్ద నూతన సంవత్సర వేడుక జరుగుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడాని ఇది నిస్సందేహంగా హైదరాబాద్‌లోని ప్రధాన గమ్యస్థానం. దీనికి టిక్కెట్ ధర రూ.299గా ఉంటుంది.
నైట్ ఇన్ ప్యారిస్ 2.0 NYE
హైదరాబాద్ లో డిసెంబర్ 31 రాత్రి 8గంటల నుంచి తాజ్ దక్కన్ హోటల్ లో జరిగే నూతన సంవత్సర వేడుకలో జాయిన్ అయితే సూపర్ గా ఉంటది. ఈఫిల్ టవర్ ప్రేరేపిత డెకర్ నుండి రొమాంటిక్ వాతావరణం వరకు ప్రతిదీ మిమ్మల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. రాత్రి 8 గంటల నుంచి సెలబ్రేషన్స్ మొదలవుతాయి. టికెట్ ధర రూ. 2000గా ఉంది.



Click it and Unblock the Notifications