Latest Updates
-
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.!
New year Celebrations 2025: అతి తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవాలంటే ఈ 8 ప్లేసెస్ బెస్ట్.. బడ్జెట్
2024 చివరి దశకు వచ్చేసింది. చాలా మంది 2025 కోసం ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2025 న్యూ ఇయర్ వేడుకలను ఏ విధంగా జరుపుకోవాలి? అతి తక్కువగా ఖర్చులతో ఏ ప్రదేశంలో జరుపుకోవాలని తర్జన భర్జన పడుతున్నారు. అలాంటి వారి కోసం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు అత్యంత తక్కువ ఖర్చుతో అయిపోయే ఎనిమిది ప్లేసెస్ ఇక్కడ చెప్పాము. ఈ ప్రదేశాల్లో న్యూ ఇయర్ జరుపుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ప్లేసెస్ ఏంటో చూద్దాం రండి..
గోవా
ఎలాంటి వేడుకలు జరుపుకోవాలనుకున్నా మొదటగా వచ్చే పేరు గోవా. ఈ ప్లేస్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌కు సరిగ్గా సూట్ అవుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ప్రదేశంలో బీచ్ పార్టీలు భారీగా జరుగుతుంటాయి. నైట్ క్లబ్స్, వాటర్ యాక్టివిటీస్, పార్టీ కల్చర్ ఇలా కొత్త సంవత్సరాన్ని ఒక సంబరాల ప్రపంచంలో స్వాగతం చెబుతున్నట్లు ఉంటుంది. ఒకవేళ మీరు అతి తక్కువ ఖర్చుతో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అనుకుంటే గోవా ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు.

మనాలి
చాలా మంది ఫెవరెట్ టూరింగ్ ప్లేస్ ఏదైనా ఉంటుందంటే అది మనాలి అని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఇక్కడ జరుపుకుంటే చాలా బాగుతుంటుంది. చలికాలంలో మనాలి చూడడానికి చాలా బాగుంటుంది. మంచుతో ఆటలు ట్రెక్కింగ్, స్కీయింగ్ వంటివి చేయవచ్చు. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మనాలిలో నైట్ డీజే పార్టీలు చాలా ఉంటాయి. వాటిని ఎంజాయ్ చేస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలకొచ్చు.
పాండిచ్చెరి
బీచ్ కల్చర్ అంటే ఇష్టమనున్న వ్యక్తులకు పాండిచ్చేరి బాగా ఇష్టం ఉంటుంది. ఇక్కడ న్యూ రోజు సెలెబ్రేషన్స్ చాలా గట్టిగా జరుగుతుంటాయి. ఇక్కడ పార్టీ కల్చర్ కూడా బాగుంటుంది. అలాగే బీచ్ పార్టీస్, బైకింగ్, కేఫ్‌లు అక్కట్టుకుంటాయి. ఇక్కడి ఆర్కిటెక్చర్ కూడా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడ రకరకాల చేపలతో చేసిన ఫుడ్ కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే పురాతన కట్టడాలను చూస్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతం పలకొచ్చు.
ఊటీ
ఏదైనా వెకేషన్‌కు వెళ్లాలంటే చాలా మంది ఆసక్తి చూపించే ప్రదేశం ఊటీ. ఇక్కడి ప్రకృతి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పచ్చదనం, సరస్సులు, హిల్ స్టేషన్స్, ఉద్యానవనాలు ఇలా ఎన్నో రకాల ప్రకృతి నిలయాల మధ్య పార్టీ చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలకొచ్చు.
హైదరాబాద్
తెలుగు రాష్టాల ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు ఇది. ఇక్కడ కూడా న్యూ ఇయర్ పార్టీలు చాలా ఘనంగా జరుగుతుంటాయి. పబ్‌లు, అవుట్ డోర్ డీజేలు, క్లబ్బులు వంటి వాటితో చాలా సందడిగా కొత్త సంవత్సరం వేడుకలు జరుగుతుంటాయి. అలాగే హైదరాబాద్‌లో చూడడానికి ఎన్నో ఐకానిక్ ప్రదేశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరం రోజు పార్టీ చేసుకోవడంతో పాటు ఈ ప్రదేశాలను చూస్తూ ఎంజాయ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది.
శ్రీనగర్
పర్వతాల మధ్య, మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకునే వ్యక్తులకు జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోవడంతో పాటు మంచు కురవడం కూడా చూడొచ్చు. మంచుతో ఆటలు కూడా ఆడుకోవచ్చు. అలాగే ప్రకృతి మధ్య కొత్త ఏడాది సంబరాలు జరుపుకోవచ్చు. ఒక ట్రిప్ పూర్తవడంతో పాటు న్యూ ఇయర్ వేడుకలు కూడా పూర్తయినట్లు ఉంటుంది.
మున్నార్
ప్రకృతి అందాలకు నెలవు ఈ మున్నార్. కేరళలో ఈ ప్రదేశం ఉంటుంది. ఇక్కడి పచ్చదనం మనసుకు ఎంతగానో ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు, మన మనసును దోచేస్తుంది. ఇక్కడ కూడా కొత్త సంవత్సరం పార్టీలు భారీగానే జరుగుతాయి. దీంతో పచ్చని వాతావరణం మధ్యలో ట్రెక్కింగ్, ఇతర యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు.
ముంబై
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా పార్టీలు ఓ రేంజ్‌లో జరుగుతుంటాయి. భారీగా పార్టీలు, డీజే నైట్స్, క్లబ్బింగ్ వంటివి జరుగుతుంటాయి. ఈ పార్టీల్లో పాల్గొని కొత్త సంవత్సరాన్ని కొత్త ఉత్సాహంతో స్వాగతం పకోచ్చు. అలాగే మెరైన్ డ్రైవ్, బీచ్‌లో తిరుగుతూ ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే గేట్ వే ఆఫ్ ఇండియాను కూడా చూడొచ్చు.
ఈ ప్రదేశాల్లో తిరగడం పార్టీలు చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. అదే సమయంలో కొత్త ఏడాదిని కూడా ఒక మెమొరీతో స్వాగతం పలికినట్లు ఉంటుంది. అది కూడా చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది.



Click it and Unblock the Notifications