Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Ramzan 2023: ఇది రంజాన్ సీజన్.. ఈ ప్లేసెస్‌లో ఫుడ్ టేస్ట్ చేయకపోతే చాలా మిస్సైపోతారు
ఇది రంజాన్ సీజన్. ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తుంటారు. అయితే ఈ సమయంలో చాలా చోట్ల స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ జోరుగా నడుస్తుంది. సాయంత్రం ఉపవాసం ముగిసిన సమయం నుండి అర్ధరాత్రి అయినా స్ట్రీట్ ఫుడ్స్ కొనసాగుతాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ లో పలు చోట్ల రంజాన్ స్ట్రీట్ ఫుడ్స్ మార్కెట్.. ఫుడ్ లవర్స్‌కు స్వర్గధామం అనే చెప్పాలి.
కబాబ్‌లు, హలీమ్‌లు, కుర్బానీ కా మీఠా, షీర్ ఖుర్మా, పథర్ కా గోష్ ఇలా చాలా రకాల ఆహార పదార్థాలు నోరూరిస్తుంటాయి. రంజాన్ సీజన్‌లో అదిరిపోయే రుచికరమైన ఆహారపదార్థాలను ఆస్వాదించాలనుకుంటే హైదరాబాద్‌లోని బెస్ట్ ప్లేసెస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛత్తా బజార్:
ఈ ప్రాంతంలో రంజాన్ మాసంలో నోరూరించే వంటకాలు టెంప్ట్ చేస్తుంటాయి. మటన్ హలీమ్, పాయా, నిహరి, ఖీమా, ఖిచ్డీ, పథర్ కా గోష్ ఇంకా చాలా రకాల వంటకాల ఘుమఘుమలు మైమరిపిస్తాయి. ఖిచ్డీ-ఖట్టా అనే స్పెషల్ రెసిపీ ఇక్కడ చాలా ఫేమస్. రంజాన్ సీజన్ లో హైదరాబాద్ కు వెళ్లినా, హైదరాబాద్ లో ఉంటున్నా.. ఛత్తా బజార్ కు వెళ్లి ఖిచ్డీ-ఖట్టా పక్కా ట్రై చేయండి.
చార్ మహల్ పేట్లబురుజు:
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో హుస్సేనీ ఆలం రోడ్డులో అలా వెళ్తుంటే ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు రారమ్మని పిలుస్తుంటాయి. కబాబ్ లు నోరూరిస్తుంటాయి. ఇక్కడ దొరికే పథర్ కా గోష్, మటన్ సూప్, మరాగ్(క్రీమ్ మీట్)లు చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ దొరికే పథర్ కా గోష్ చాలా ఫేమస్.
ట్రూప్ బజార్:
ట్రూప్ బజార్ అంటే హలీమ్, హలీమ్ అంటే ట్రూప్ బజార్. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దొరికే హలీమ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ కేవలం హలీమ్ మాత్రమే కాకుండా ధమ్ బిర్యానీ కూడా నోరూరిస్తుంది. కబాబ్ లు, కుర్బానీ కా మీఠా, షీర్ ఖుర్మా ఇంకా చాలా లభిస్తాయి.
పంచ్ మొహల్లా, చార్మినార్:
తాజా పండ్లు, మలై క్రీమ్ కలయికతో ఇక్కడ దొరికే స్వీట్ చాలా మధురంగా ఉంటుంది. చార్మినార్ సమీపంలోని పంచ్ మొహల్లా ప్రాంతంలో ఈ స్వీట్ ఒక్కటే కాదు, నాలుకకు స్వర్గాన్ని చూపే రుచులు ఎన్నో ఉంటాయి. మల్బరీ క్రీమ్, మ్యాంగో క్రీమ్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి.
ఘాన్సీ బజార్, చార్మినార్:
రంజాన్ సందర్భంగా చార్మినార్ వద్ద విపరీతమైన రద్దీ ఉంటుంది. రోడ్లన్నీ స్ట్రీ షాపింగ్ తో నిండిపోతాయి. ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటిని దాటుకుని చార్మినార్ కు వెళ్లగలిగితే అక్కడ ఘాన్సీ బజార్ కు వెళ్లి నోటిని రుచితో మైమరిచిపోనివ్వండి. ఇక్కడే దొరికే ఇరానీ ఛాయ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇరానీ ఛాయ్ తో పాటు ఉస్మానియా బిస్కెట్, బన్ మస్కా మజాగా ఉంటాయి.



Click it and Unblock the Notifications