Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ లో వెళ్లడానికి బెస్ట్ ప్లేస్ లు ఇవే..జీవితంలో మర్చిపోలేరు
డిసెంబర్ నెలలో వచ్చే పెద్ద పండుగ క్రిస్మస్(Christmas). డిసెంబర్ చివర్లో క్రిస్మిస్ వస్తుంది..వెంటనే న్యూ ఇయర్ కూడా వస్తుంది. ఈ టైంలో చాలామంది ఎక్కడికైనా కొత్త ప్లేస్ కి వెళ్లి ఫ్యామిలీ,ఫ్రెండ్స్ తో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోవాలని కోరుకుంటారు. కొంతమంది పచ్చదనం,బీచ్‌లు ఉన్న ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు..మరికొందరు మంచుతో కప్పబడిన పర్వతాల దగ్గరకు వెళ్లి ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారు.
అయితే స్కూళ్లు,కాలేజీలకు సెలవులు, ఆఫీసులకు కూడా 4 లేదా 5 రోజులు సెలవులు ఉంటాయి కాబట్టి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో మీరు విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే వెళ్లడానికి మనదేశంలో కొన్ని బెస్ట్ ప్లేస్ లు ఉన్నాయి.

క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ లో వెళ్లడానికి ఈ ప్లేస్ లు బెస్ట్
గోవా
గోవా వెళ్లడానికి ఇదే కరెక్ట్ టైం. గోవాలో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో మీ హాలిడేస్ ని గోవాలో బాగా ఎంజాయ్ చేయవచ్చు. రకరకాల ఫుడ్,మందు, బీచ్ లు, అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయవచ్చు. ఈ టైంలో గోవా వెళ్తే ఆ ట్రిప్ ని జీవితంలో మర్చిపోలేరు. ఈ టైంలోనే విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు గోవాకు వస్తుంటారు.
కూర్గ్
మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని మైసూరుకి దగ్గర్లో ఉండే కూర్గ్ ప్రాంతం ఈ టైంలో వెళ్లేందుకు బెస్ట్ ప్లేస్.ఇక్కడ జలపాతాలు, పచ్చని పర్వతాలు, టీ,కాఫీ తోటలు, పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం,దుబరే ఎలిఫెంట్ క్యాంప్ వంటివి మీ ట్రిప్ ని ఎప్పటికీ మర్చిపోలేనివిగా చేస్తాయి. మీరు ఇక్కడ అనేక ప్రదేశాలను అన్వేషించవచ్చు. పచ్చదనం, జలపాతాలు వంటి ప్రకృతి అందాలతో నిండిన ప్రదేశాలలో ఇక్కడ గడపడానికి మీకు సమయం లభిస్తుంది.
పాండిచ్చేరి
తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకి కొద్ది దూరంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం కూడా క్రిస్మస్ హాలిడస్, న్యూ ఇయర్ వెకేషన్ కోసం బెస్ట్ ప్లేస్. పాండిచ్చేరిలో గోతిక్ చర్చిలు, కేథడ్రల్‌లు ఈ క్రిస్మస్‌లో మరొక ప్రపంచాన్ని చూపిస్తాయి. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతాయి. వీటిని చూసి బాగా ఎంజాయ్ చేయవచ్చు.
కోహిమా
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాజధాని కొహిమాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటారు. ఆ టైంలో నగరమంతా విద్యుద్దీపాలతో కళకళలాడుతుంది. దీంతో మీరు క్రిస్మస్ సమయంలో కోహిమా వెళ్లడం కూడా అద్భుతంగా ఉంటుంది. నగరం మొత్తం పండుగ వాతావరణంలో ఉన్నప్పుడు షాపింగ్ చేయడం, రెస్టారెంట్లలో వెరైటీ వంటకాలను ఆస్వాదించడం అద్భుతంగా ఉంటుంది.అక్కడున్న మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్స్ కేథడ్రల్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటి.
సిమ్లా
క్రిస్మస్ వేడుకలు ప్రత్యేకంగా జరిపే ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా. ఇక్కడి క్రిస్మిస్ వేడుకలు మిమల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకుపోయే విధంగా ఉంటాయి. సిమ్లాలో ఉన్న కేఫ్‌లు, రెస్టారెంట్లలో వివిధ రకాల వంటకాలు విందుకు అందిస్తాయి.
షిల్లాంగ్
క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉన్న మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో క్రిస్మస్ వేడుకలు అద్భుతంగా నిర్వహించబడతాయి. పండుగ సందర్భంగా వీధులను లైట్లు అలంకరించి ఆటలు, పాటలతో మునిగిపోతారు. ఇక్కడ, క్రిస్మిస్ పండుగను ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడకి వెళ్తే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో పాటు అనేక అందమైన ప్లేస్ లు, చారిత్రక ప్రదేశాలను చూడవచ్చు.



Click it and Unblock the Notifications