Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
హైదరాబాద్‌లోని ఈ ప్రదేశాల్లో ఫ్రీగా న్యూ ఇయర్ జరుపుకోవచ్చు.. ఫ్రీ టికెట్ కోసం ఈరోజు లాస్ట్ డే
దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. డిసెంబర్ 31వ తేదీన మొదలుకొని జనవరి 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు న్యూ ఇయర్ జరిపేందుకు గొప్ప ప్రదేశం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద ఈవెంట్‌లను ఏర్పాటు చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే కొందరు న్యూ ఇయర్‌ను ఉచితంగా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి హైదరాబాద్‌లో అత్యుత్తమ ప్రదేశాలు ఇవే.
ఇక్కడ ఉచితంగా కొత్త ఏడాది వేడుకలను నిర్వహించుకోవచ్చు. చాలా మంది ఈ ప్రదేశాల్లో కొత్త ఏడాది ఉత్సవాలను జరుపుకుంటారు. మీరు కూడా ఈ ప్రదేశాలకు వెళ్లి వేడుకలను జరుపుకోవచ్చు. ఆ ప్రదేశాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చార్మినార్
హైదరాబాద్ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటేనే హైదరాబాద్. కొత్త ఏడాది రోజున చాలా మంది ఈ ప్రదేశానికి వచ్చి కొత్త ఏడాదిని జరుపుకుంటారు. ఇంకొందరు ఉచితమైన ఈవెంట్‌లు చార్మినార్ ప్రదేశాల్లో నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ ఈవెంట్‌లలో పాల్గొనాలంటే ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడ కొత్త ఏడాది వేడుకలను జరుపుకునే వ్యక్తులతో కలిసి ఉచితంగానే జరుపుకోవచ్చు.
ట్యాంక్ బండ్
హైదరాబాద్ ఎవరు వచ్చినా కచ్చితంగా హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్‌ను సందర్శించి కానీ వెళ్లరు. అయితే ఇక్కడ కూడా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో కొత్త ఏడాదికి సంబంధించిన ఈవెంట్స్ నిర్వహిస్తారు. కొన్ని ఈవెంట్లకు డబ్బులు చెల్లించాలి. మరికొన్ని వాటికి ఉచితంగానే ప్రవేశం ఉంటుంది. ఇక్కడ లైటింగ్, పార్టీ కల్చర్ కొత్త ఏడాది సెలెబ్రేట్ చేసుకోవడానికి అద్భుతంగా ఉంటుంది.
నెక్లెస్ రోడ్
ట్యాంక్ బండ్‌కు దగ్గరలోని ఈ నెక్లెస్ రోడ్‌లో కూడా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఘననా జరుపుకుంటారు. నగరంలోకి ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి ప్రజలు కొత్త ఏడాదిని జరుపుకుంటూ ఉంటారు. రోడ్డు మీద కొన్ని వేడుకలు, బాణాసంచా కాల్పులు, పార్టీలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో పాల్గొనాలంటే ఉచితంగానే పాల్గొనవచ్చు.
రామోజీ ఫిలిం సిటీ
రామోజీ ఫిలిం సిటీలో కూడా ఘనంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుగుతాయి. కాకపోతే ఇందులో వెళ్లాలంటే కచ్చితంగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ఆఫర్లు, కొన్ని పరిమిత వ్యక్తులకు ఉచితంగా పాసెస్ ఇస్తారు. అవి విడుదలైనప్పుడే కొద్దీ మందికి మాత్రమే అలో చేస్తారు. ఆలోపు మీరు ఆ పాసెస్‌ను పొందాల్సి వస్తుంది.
శిల్పారామం
హైటెక్ సిటీలో ఉన్న ఈ శిల్పారామంలో కూడా న్యూ ఇయర్ సెలెబెరేషన్స్ ఘనంగా జరుగుతాయి. పార్టీలు, వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఇందులోకి వెళ్లాలంటే చిన్న మొత్తంలో ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అనంతరం లోపల ఘనంగా వేడుకలను జరుపుకోవచ్చు. ఉచితంగానే లోపలి అందాలను చూడొచ్చు.
గోల్కొండ ఫోర్ట్..
గోల్కొండ కోట వద్ద కూడా ఘనంగా ఈ కొత్త ఏడాది వేడుకలను నిర్వహిస్తారు. లైటింగ్, ఫైర్ వర్క్స్, డీజే డ్యాన్స్ ఇలా అనేక రకాలుగా ఇక్కడ కొత్త ఏడాదిని జరుపుకుంటూ ఉంటారు. ఇందులో పాల్గొనాలంటే చాలా తక్కువ మొత్తంలో ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. తరువాత లోపల అంతా ఉచితంగానే ఉంటుంది. మీరు కూడా ఇందులో పాల్గొని కొత్త ఏడాది వేడుకలను జరుపుకోవచ్చు.



Click it and Unblock the Notifications