Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జూన్, జులైలో ఈ లొకేషన్స్‌కు వెళ్తే స్వర్గమే.. ప్లాన్ చేసుకుంటారా..?
ఈ సారి ఎండాకాలంలో ఎండలు విపరీతంగా మండిపోతున్నాయ్. 10 నిమిషాలు కూడా ఎండలో నిలబడలేని పరిస్థితి వుంది. ఇంటి బయట అరుగుపైన బండలపైన సులువుగా అమ్లెట్లు వేసుకోవచ్చు. ఇంత ఎండలో కూడా స్వర్గాన్ని తలపించే టూరింగ్ స్పాట్స్ వున్నాయ్. ఇప్పుడు అలాంటి లొకేషన్స్‌కి వెళ్తే వచ్చే కిక్కే వేరు. రాబోయే జూన్ జులైలో ఈ లొకేషన్స్‌ను సందర్శిస్తే మంచి అనుభూతి కలుగుతుంది. ఈ సమయంలో అక్కడి వాతావరణం మరింత బాగుంటుంది. ఈ వేసవిలో ఆ లొకేషన్స్ ఎక్కడాన్నాయ్, ఏ రాష్ట్రంలో వున్నాయ్. వాటి ప్రత్యేకతల గురించి మీకు వివరిస్తున్నామ్.
ఈ వేసవిలో బెస్ట్ ఎంటర్టైనింగ్ స్పాట్స్ :
లఢక్, జమ్ము కశ్మీర్
జమ్ము కశ్మీర్‌లోని లఢక్‌కు వెళ్తే ఈ వేసవిలోనే వెళ్లాలి. అక్కడికి వెళ్లగానే అక్కడున్న 15 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవించి ఎండాకాలాన్నే మరిచిపోతారు. కొండలపై బైక్ రైడ్లు, ట్రెక్కింగ్ మనల్ని అబ్బురపరుస్తాయ్. నుబ్రా లోయలు, పర్వతాలు, పాంగోంగ్ ట్సో నదిని చూస్తే వాటి అందాన్ని తట్టుకోవడం మన వల్ల కాదు.
ఉదయ్‌పూర్ రాజస్థాన్
జులైలో ఇక్కడి వాతావరణం 25 నుంచి 4 డిగ్రీల లోపు వుంటుంది. ఉదయ్‌పూర్ మొత్తం రాజకోటలతో నిండి వుంటుంది. రాజస్థాన్ వారి సంస్కృతి ఇక్కడ ఉట్టిపడుతుంది. సజ్జన్ గర్హ్ ప్యాలెస్, సిటీ ప్యాలెస్, లాంటి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించవచ్చు. వీటితో పాటు లేక్ పంచోలా, జగ్ మందిర్‌ను సందర్శించాలి.

శిల్లాంగ్ మేఘాలయ
మేఘాలయ రాజధాని శిల్లాంగ్‌ను స్కాట్ ల్యాండ్ ఆఫ్ ద ఈస్ట్‌గా పిలుచుకుంటాం. ఇక్కడ అదర్భుతమైన వాటర్‌ఫాల్స్‌ను చూడవచ్చు.
డార్జిలింగ్, పశ్చిమ బెంగాళ్
డార్జిలింగ్‌లో కూడా చల్లని వాతావరణం వుంటుంది. ఇక్కడి ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీలు వుంటుంది. ఇక్కడ నుంచి ఎన్నో అందమైన ప్రదేశాలను చూడవచ్చు. ఎత్తైన పర్వతం మౌంట్ కంచన్ జంగాను చూడవచ్చు. తేయాకు తోటలు ఇక్కడ ఎక్కువగా వుంటాయ్.
ఊటీ, తమిళనాడు
తమిళనాడులోని నీలగిరి కొండల్లో వుండే ఈ ఊటీని జూన్, జులై నెలలో సందర్శించాలి. వీటి ఉష్ణోగ్రత 15 నుంచి 25 డిగ్రీలు వుంటుంది. ఊటీలో కూడా తేయాకు తోటలు, పూల తోటలు కనువిందు చేస్తాయ్.
కేరళ
కేరళను కూడా ఈ వేసవిలో సందర్శించవచ్చు. అక్కడి ప్రదేశాలు కళ్లు చెదిరే విధంగా వుంటాయ్. కేరళలో నదులు, పడవలు, పచ్చదనం.. వీటిని మరిచిపోలేము. ఎండాకాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు కూడా కొంత అనుకూలంగా ఉంటాయ్.
డాల్ హౌసీ, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్‌లో వుండే డాల్‌హైసీ కూడా సందర్శించే ప్రదేశాల్లో ఒకటని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎత్తైన చెట్లు కనువిందు చేస్తాయ్. డాల్‌హౌజీ లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 23 డిగ్రీల మధ్యలో వుంటుంది.
బయట టూర్‌కి ప్లాన్ చేసేప్పుడు ఈ విషయాలను ఖచ్ఛితంగా గుర్తుపెట్టుకోవాలి :
ప్లాన్ లేకుండా టూర్‌కు బయటు దేరవద్దు. ఎంత ఖర్చవుతుంది, ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత మంది, ఏ ఆహారం తీసుకోబోతున్నారు. ఎంత సమయం గడపాలనుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాన్ని తీసుకున్న తరువాతే ప్రయాణించాలి. వెళ్తేది ట్రైన్‌లో అయినా కావచ్చు లేదు ప్లేన్‌లో అయినా కావచ్చు.. ముందే అడ్వాన్స్‌గా బుకింగ్ చేసుకోవాలి. అనవసర ఖర్చులు చేయకుండా వుండాలి. డబ్బు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి.



Click it and Unblock the Notifications