Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Sankranti 2025 Rangoli Ideas: సంక్రాంతికి ఇలాంటి ముగ్గులు వేస్తే అందరూ మీ ఇంటివైపే చూస్తారు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంక్రాంతి పండగ వచ్చేసింది. ఈ పండగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు ప్రజలనందరూ పట్టణాలను విడిచేసి పల్లెటూర్లకు పయనమయ్యారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కోలాహలంగా సంతోషంగా ఈ పండగను జరుపుకోనున్నారు. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ముగ్గు. సంక్రాంతికి రంగు రంగుల ముగ్గులు వేస్తుంటారు. అందరిలోనూ తమ ముగ్గే అద్భుతంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. అందుకోసం రెండు మూడు రోజుల నుంచే ప్రేపరేషన్స్ మొదలుపెడతారు. అయితే ఈ సంక్రాంతికి కింద ఇవ్వబడిన కొన్ని రకాల ముగ్గులు ట్రై చేయండి. అందరిలో మీ ముగ్గే హైలైట్‌గా నిలుస్తుంది.
పువ్వులు, ఆకులతో నిండుగా
కింద కనిపిస్తున్న ఫొటోలో మాదిరిగా గుమ్మం ముందు నిండుగా కనిపించే ముగ్గు అయితే చాలా బాగుంటుంది. రంగు రంగుల పువ్వులు, ఆకులు కనిపిస్తున్న ఈ ముగ్గు సంక్రాంతి శోభను ఉట్టిపడేలా చేస్తుంది. ఈ ముగ్గును మీ ఇంటి ముందు వేశారంటే ప్రతి ఒక్కరూ మీకు ప్లాట్ అవ్వాల్సిందే. మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే.

కుండల ముగ్గు
సంక్రాంతి అంటే సాంప్రదాయకమైన పండగ. ఈ సాంప్రదాయకమైన పండగ రోజు కచ్చితంగా సాంప్రదాయకమైన ముగ్గు వేస్తే ఇంకా బాగుటుంది. అందుకోసం ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు ఇలాంటి కుండల ముగ్గు వేయండి. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వేయడం కూడా చాలా సులభం. దీంతో పాటు సాంప్రదాయకమైన కళ ఉట్టిపడుతుంది.

రథం ముగ్గు
సంక్రాంతి అంటే గుర్తొచ్చే ముగ్గు ఏదైనా ఉందంటే అది రథం ముగ్గు. చాలా మంది సంక్రాంతికి ఈ రథం ముగ్గును వేయడానికి ప్రయత్నిస్తారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నప్పటికీ.. ఆ ముగ్గు ఇంటి గుమ్మం ముందు అదరహో అనే మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతికి మీరు సింపుల్‌గా స్టైలిష్‌గా ముగ్గు వేసుకోవాలంటే రథం ముగ్గును ట్రై చేయొచ్చు.

కోలం ముగ్గు
సంక్రాంతికి చాలా మంది ఇష్టపడి వేసే ముగ్గులో కొలం ముగ్గు కూడా ఒకటి. వీటిని వివిధ రకాల లైన్స్‌ను కలిపి వేస్తారు. ఈ ముగ్గును వేసుకోవడం కూడా చాలా సులభం. అలాగే ఇందులో రంగులు అద్దిన తరువాత ఆ ముగ్గు అందం రెండింతలు అవుతుంది. ఈ సంక్రాంతికి మీరు చకచకా అందమైన ముగ్గు వేసుకోవాలని అనుకుంటే కచ్చితంగా ఈ కొలం ముగ్గును ట్రై చేయండి.

తామర పువ్వుల స్వాగతం
సంక్రాంతికి చాలా మంది అతిథులు ఇంటికి వస్తుంటారు. వారిని స్వాగతం పలుకుతున్నట్లు తామర పువ్వులతో స్వాగతం పలుకుతున్నట్లు ఉన్న ముగ్గు వేస్తే అందరికీ నచ్చుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ మీ ముగ్గుకు దాసోహం అవుతారు. ఓసారి మీరూ ట్రై చేయండి.




Click it and Unblock the Notifications