Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్నారా.. ఈ స్ట్రీట్ ఫుడ్స్ మాత్రం అస్సలు మిస్ కావొద్దు
ఏపీలోని ప్రతి వీధిలో పునుగులు, మురి మిక్స్, టొమాటో బజ్జీ లాంటివి దొరుకుతాయి. మీరు నిజమైన ఫుడ్ లవర్, గ్యాస్ట్రోనోమ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్ట్రీడ్ ఫుడ్స్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో లభించే బెస్ట్ స్ట్రీట్ ఫు
ఆంధ్రప్రదేశ్ అనగానే చాలా మంది తిరుపతి, అన్నవరం లాంటి పుణ్యక్షేత్రాలు గుర్తుకువస్తాయి. ఫుడ్ లవర్స్‌కు మాత్రం తిరుపతి అనగానే లడ్డూ, అన్నవరం అనగానే అన్నవరం ప్రసాదం, వైజాగ్ అంటే పునుగులు, అరకు అంటే బొంగు చికెన్, కాకినాడ అంటే కాజాలు గుర్తుకువస్తాయి. ఆంధ్రప్రదేశ్ అనగానే పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, లోయలు, గుహలు మాత్రమే కాదు స్ట్రీట్ ఫుడ్ కూడా గుర్తుకు వస్తుంది.

ఏపీలోని ప్రతి వీధిలో పునుగులు, మురి మిక్స్, టొమాటో బజ్జీ లాంటివి దొరుకుతాయి. మీరు నిజమైన ఫుడ్ లవర్, గ్యాస్ట్రోనోమ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్ట్రీడ్ ఫుడ్స్ తప్పకుండా ట్రై చేయాల్సిందే.
ఆంధ్రప్రదేశ్‌లో లభించే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బొంగు చికెన్
దీనినే బాంబూ చికెన్ అని కూడా పిలుస్తారు. బొంగు చికెన్ ఎక్కువగా అరకు లోయలో లభిస్తుంది. అరకు లోయకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి అన్ని మసాలాలు దట్టించి కొద్ది సేపు పక్కన పెడతారు. తర్వాత మెరినేటెడ్ చికెన్‌ను వెదురు బొంగులో నింపి దానిని మంటపై కాలుస్తారు. వెదురు రుచి చికెన్‌కు పట్టుకుని మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆయిల్ ఏమాత్రం ఉపయోగించరు. అరకు లోయ వైపు వెళ్తున్నప్పుడు బొంగు చికెన్ రోడ్డు పక్కన కనిపిస్తుంది.

2. ఎగ్ బోండా
ఎగ్ పకోరా లేదా ఎగ్ బజ్జీ అని కూడా పిలుస్తారు. వీటిని ఉడకబెట్టిన గుడ్లతో తయారు చేస్తారు. శెనగ పిండిలో ఉడకబెట్టిన గుడ్డును ముంచి దానిని నూనెలో ఫ్రై చేస్తారు. మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేస్తారు. సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయలు, నిమ్మరసం, చట్నీతో కలిపి ఎగ్ బోండా తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.

3. లివర్ కబాబ్
వైజాగ్ వీధుల్లో లివర్ కబాబ్ ఎక్కువగా లభిస్తుంది. ఈ స్ట్రీట్ ఫుడ్‌కు వైజాగ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. నిమ్మ సోడా, పరోటా, రోటీతో పాటు లివర్ కబాబ్ తినొచ్చు. వైజాగ్ కాంప్లెక్స్, ఎంవీపీ సర్కిల్ సహా ఇతర చాలా ప్రాంతాల్లో లివర్ కబాబ్ లభిస్తుంది. నానె వెజ్ ప్రియులు తప్పక దీనిని ట్రై చేయాల్సిందే.

4. పునుగులు
పునుగులు వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో పునుగులు లభిస్తాయి. పునుగులు, కొబ్బరి చట్నీ, వేరుశెనగ చట్నీ, టొమాటో చట్నీ సూపర్ కాంబినేషన్. పునుగులు బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. కొద్దిగా పులుపు రుచి వస్తుంది. వైజాగ్‌లో వీధుల్లో దొరికే ఈ స్ట్రీట్ ఫుడ్ తిని తీరాల్సిందే.

5. చెకోడీ
కరకరలాడే ప్రధాన చిరుతిండి చెకోడీ. బియ్యపు పిండి, జీలకర్ర, నువ్వుల గింజలతో వీటిని తయారు చేస్తారు. చకోడీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా లభిస్తాయి. వీటిని పండగల సమయంలోనూ ఇళ్లల్లో తయారు చేస్తుంటారు. విజయదశమి, దీపావళికి ప్రత్యేకంగా తయారు చేస్తారు.

6. బూరెలు
ఆంధ్రా వంటకాల్లో బూరెలు లేదా పూర్ణాలు చాలా ప్రసిద్ధి. ఈ తీపి వంటకాలను టేస్టు చేయని ఆంధ్రుడు దొరకడం చాలా కష్టం. బెల్లం, శెనగపప్పు, బియ్యం పిండి, డ్రై ఫ్రూట్స్, యాలకులతో వీటిని తయారు చేస్తారు. చిన్న చిన్న బంతుల్లా ఉంటాయి. పండుగలు, వేడుకలు, శుభకార్యాల సమయంలో బూరెలు తయారు చేస్తుంటారు.

7. టొమాటో బజ్జీ
టొమాటో బజ్జీ ఎక్కువగా బీచ్ సైడ్ ప్రాంతాల్లో లభిస్తుంది. టొమాటోలను శెనగపిండిలో ముంచి వాటిని డీప్ ఫ్రై చేస్తారు. టొమాటోలతో కలసి మర్మరాలు మంచి రుచిని అందిస్తాయి. టొమాటో బజ్జీలను చాలా మంది ఇష్టంగా తింటారు.
మీరు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే తప్పకుండా ఈ స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తినాలనిపించేవి ఇందులో చాలా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి.



Click it and Unblock the Notifications