Latest Updates
-
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఉల్లిపాయలకు మొలకలు రాకుండా, చెడిపోకుండా ఉండాలంటే.. ఇలా చేయండి
ఉల్లిపాయలు అన్ని కూరల్లో తప్పకుండా ఉండాల్సిందే అన్నంతగా వంటకాల్లో భాగం అయిపోయింది. కూరల్లో, విడిగా వండకుండా కూడా ఉల్లిపాయలు తినేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో ఒక్కసారిగా కొనేసి పెట్టేసుకుంటారు. రోజూ కూరల్లో కొన్ని కొన్ని వాడుతుంటారు. ఎక్కువ రోజుల పాడవకుండా ఉంటాయి. అయితే కొన్ని సార్లు ఉల్లిపాయలు మొలకలు రావడం, చెడిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
ఉల్లిపాయలు మొలకలు రాకుండా, చెడిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడం మంచిది:
నేషనల్ ఆనియన్ అసోసియేషన్(NOA) ప్రకారం, వాటిని చల్లని, పొడి, చీకటి, బాగా వెంటిలేషన్ వచ్చే గదిలో నిల్వ చేయాలి. ఎందుకంటే ఉల్లిపాయలను సులభంగా తేమను గ్రహిస్తాయి. ఉష్ణోగ్రతులు లేదా తేమ ఎక్కువగా ఉంటే, అవి మొలకెత్తడం లేదా కుళ్లిపోవడం జరుగుతుంది. ఉల్లిపాయలను నిల్వ చేయడానికి 4-10 డిగ్రీల సెంటిగ్రేడ్ మంచి ఉష్ణోగ్రతగా నేషనల్ ఆనియన్ అసోసియేషన్ చెబుతోంది.
ఎలాంటి బ్యాగుల్లో నిల్వ చేయాలి:
ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉండాలంటే ఓపెన్ బాస్కెట్, వెదురు స్టీమర్, మెష్ బ్యాగ్, నెట్టెడ్ బ్యాగ్ లాంటి బ్యాగుల్లో నిల్వ చేయాలి. ఇందులో గాలి చక్కగా వచ్చిన ఉల్లిపాయలు చెడిపోవు. అలాగే ఆనియన్స్ ను ప్లాస్టిక్ సచుల్లో నిల్వ చేయకూడదు. ఇందులో నిల్వ చేయడం వల్ల వెంటిలేషన్ లేని కారణంగా ఉల్లిపాయలు త్వరగా చెడిపోతాయి. అలాగే రంధ్రాలు ఉన్న బ్యాగుల్లో వేసి వాటిని చీకటి ఉన్న ప్రాంతంలో ఉంచడం వల్ల ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి.
ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో ఉంచొద్దు:
ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచొద్దు. ఉల్లిపాయలకు సహజంగానే తేమను గ్రహించే లక్షణం ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి త్వరగా మెత్తబడతాయి. అలా త్వరగా పాడవుతాయి. అయితే ముక్కలు చేసిన ఉల్లిపాయలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అవి చాలా సేపు పాడవకుండా ఉంటాయి. ఉల్లిపాయపైన పొరను పూర్తిగా తొలగించి వాటిని ఫ్రిజ్ లో ఉంచడం ద్వారా 10-14 రోజుల పాటు పాడవకుండా ఉంటాయి.
ఉల్లిపాయలను ఎక్కడ నిల్వ చేయాలి:
తేమ ఉన్న ప్రాంతంలో ఉల్లిపాయలను నిల్వ చేయడం వల్ల మొలకలెత్తుతాయి. అలాగే కుళ్లిపోతాయి. సూర్య కిరణాలు నేరుగా పడే చోట ఉల్లిపాయలు నిల్వ చేయవద్దు. అలాగే చల్లగా, పొడిగా ఉండే చోట ఉల్లిపాయలు నిల్వ చేయాలి. ఆ ప్రాంతంలో గాలి వస్తుండాలి. గాలి చొరబడని డబ్బాల్లో, ప్లాస్టిక్ కవర్లలో ఉల్లిపాయలు నిల్వ చేస్తే త్వరలోనే ఉల్లిపాయలు పాడవుతాయి.



Click it and Unblock the Notifications