Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
బావులు గుండ్రంగానే ఎందుకుంటాయి? అసలైన రహస్యం ఇదే!
పల్లెటూరు అనగానే మన కళ్ల ముందు పచ్చని పొలాలు, పశువుల పాకలు, ఇంకా చల్లని నీటిని అందించే జీవధారలైన బావులు మెదలైనవి మెదులుతుంటాయి. పట్టణాలలో బావులు కనుమరుగవుతున్నా నేటికీ ఎన్నో గ్రామాలకు ఈ బావులే జీవనాధారం. తాగునీటికీ, సాగునీటికీ ఇవే ప్రాణం పోస్తాయి. అయితే బావులన్నీ దాదాపుగా గుండ్రంగానే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా?. వాటిని చతురస్రంగానో, త్రిభుజంగానో ఎందుకు తవ్వరు?
మన పూర్వీకుల నుండి నేటి ఇంజనీర్ల వరకు అందరూ వృత్తాకారాన్నే బావులకు ఎంచుకుంటున్నారు. చాలామంది ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం..అందుకే మన పూర్వీకులు అనుసరించిన ఆకారాన్ని మార్చలేదని భావిస్తారు. కానీ ఇందులో కేవలం సంప్రదాయం మాత్రమే కాదు అద్భుతమైన శాస్త్రీయత, ఆచరణాత్మక అనుభవం కూడా దాగి ఉన్నాయి. బావి గుండ్రంగా ఉండటమే దాని మన్నికకు, ఆయుష్షుకు అసలైన రహస్యం.

ఒత్తిడిని తట్టుకునే అద్భుత నిర్మాణం
బావిని తవ్వినప్పుడు చుట్టూ ఉన్న మట్టి, భూమి, ఖాళీ అయిన ఆ ప్రదేశంపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తాయి. బావి గుండ్రంగా ఉంటే ఈ బాహ్య ఒత్తిడి గోడలపై అన్ని వైపుల నుండి సమానంగా పంపిణీ అవుతుంది. దీనివల్ల నిర్మాణం అత్యంత బలంగా, స్థిరంగా ఉంటుంది.
అదే బావిని చతురస్రం లేదా త్రిభుజాకారంలో నిర్మిస్తే భూమి ఒత్తిడి మూలల దగ్గర కేంద్రీకృతమవుతుంది. ఈ అసమాన ఒత్తిడి వల్ల మూలలు బలహీనపడి, గోడలు త్వరగా పగుళ్లు బారతాయి. ఇది కాలక్రమేణా బావి కూలిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇక బావి నిండా నీరు ఉన్నప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. లోపల ఉన్న నీరు గోడలపై విపరీతమైన పీడనాన్ని కలుగజేస్తుంది. వృత్తాకార నిర్మాణం వల్ల ఈ నీటి పీడనం కూడా 360 డిగ్రీలలో సమానంగా విస్తరించి, గోడల ఆయుష్షును పెంచుతుంది. అదే చతురస్రాకార బావిలో అయితే నీటి పీడనం మూలల్లో ఎక్కువగా ఉండి ఆ ప్రాంతంలో గోడలు త్వరగా దెబ్బతింటాయి.
వాడుకలో సౌలభ్యం, నిర్వహణలో సులభం
గుండ్రని బావులలో మూలలు అనేవే ఉండవు. కాబట్టి నాచు పట్టడానికి, బురద పేరుకుపోవడానికి ఆస్కారం చాలా తక్కువ. దీనివల్ల నీరు పరిశుభ్రంగా ఉంటుంది. చతురస్రాకార బావిలో అయితే మూలలు శుభ్రం చేయడం కష్టం. అక్కడ నాచు, బురద సులభంగా చేరి నీటిని కలుషితం చేస్తాయి. అంతేకాకుండా చేదతో నీళ్లు తోడేటప్పుడు గానీ, మోటారు పైపులు దించేటప్పుడు గానీ చతురస్రాకార బావి మూలల్లో చిక్కుకుపోయే అవకాశం ఉంది. గుండ్రని బావిలో ఈ సమస్యే తలెత్తదు. '
కాబట్టి బావి గుండ్రంగా ఉండటం కేవలం ఒక ఆచారం కాదు, అది వేల సంవత్సరాల మానవ అనుభవం, భౌతిక శాస్త్ర సూత్రాలపై ఆధారపడిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నమూనా. తక్కువ నిర్వహణ, ఎక్కువ మన్నిక, సురక్షితమైన నిర్మాణం..ఇలా అన్ని విధాలా వృత్తాకారమే బావులకు సరైన, శాస్త్రీయమైన ఆకారం.



Click it and Unblock the Notifications
