Latest Updates
-
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.!
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా హిజ్రాల టాపిక్ మీద చర్చ జరుగుతుంది. చాలామంది ప్రజలు.. హిజ్రాల వల్ల తమ కుటుంబ పంక్షన్లలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుచేసుకుంటూ దీనిపై మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మీడియా, సోషల్ మీడియాలో అంతా దీని గురించి పెద్ద చర్చలు, డిబేట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని చింతల్ ఏరియా ఒక గృహ ప్రవేశ సమయంలో తాము అడినట్లు 50వేలు ఇవ్వలేదని హిజ్రాలు రచ్చ చేసిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవ్వడమే ప్రస్తుతం ఈ చర్చకి కారణం.
ఎక్కడైనా టెంట్ వేస్తే చాలు అక్కడ వాలిపోవడం, వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం, తాము అడినంత ఇవ్వకుండా అక్కడ నానా బూతులు మాట్లాడటం, బట్టలు విప్పేయడం వంటి అసభ్యకరమైన, అసహ్యకరమైన పనులు చేస్తూ ఉండటం చాలామంది హిజ్రాలకు అలవాటుగా మారిపోయింది. పలు సందర్భాల్లో హిజ్రాలు దాడులకు పాల్పడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు కూడా.

సంచలన నిజాలు వెలుగులోకి
హిజ్రాల వ్యవహారంపై చర్చ జరగుతున్న ఈ క్రమంలో అనేక ఆశక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు వీళ్లకు ఫలానా ఏరియాలో ఫలానా ఫంక్షన్ అని డోర్ నెంబర్ తో సహా తెలియడానికి ప్రధాన కారణం..పూజారులు, బిల్డర్లు, టెంట్ సప్లయర్స్, ఆటో డ్రైవర్లు, వాచ్ మెన్లు, సన్నాయి మేళం వాళ్లు, గోమాతను తెచ్చే వాళ్లు. ఈ విషయాన్ని స్వయంగా కొందరు హిజ్రాలే మీడియాలో చెబుతున్నారు. వాళ్లే తమకు ఖచ్చితమైన లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్లమంటారని, వచ్చిన డబ్బుల్లో తమ దగ్గర రూ. 1000 నుంచి రూ. 3 వేల వరకు కమీషన్ కూడా తీసుకుంటారని చెబుతున్నారు.
కొందరు మగవాళ్లు కూడా డబ్బుల కోసం హిజ్రా వేషం వేసి వాళ్లతో కలిసి శుభకార్యాలకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా ఒక్కో విషయం బయటకు వస్తుంది. ఇదంతా చూస్తుంటే ఇదొక పెద్ద ముఠానే నడస్తుందని చెప్పవచ్చు. ఈ సమయంలో గతంలో హిజ్రాలు వేధించిన ఘటనలకు సంబంధించిన వీడియోలో ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలోకి వస్తున్నాయి.
పోలీసుల స్పెషల్ డ్రైవ్
అయితే హైదరాబాద్ లోనే కాకుండా చాలా ప్రాంతాల్లో చాలా ఏళ్ల నుంచి హిజ్రాలు ఆగడాలు పెరుగుతున్నా..ఇప్పటికైనా పోలీసులు స్పందించడం మంచి పరిణామమే. హైదరాబాద్ లో స్పెషల్ డ్రైవల్ చేపట్టి హిజ్రాల ఆగడాలను అరికడతామని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు. హిజ్రాలు వచ్చి డబ్బుల కోసం గొడవ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలని కొన్ని సూచనలు చేశారు.

రైళ్లలో కూడా దారుణంగా
అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గురించి చాలామంది అసలు మాట్లాడటం లేదు..అదేంటంటే రైళ్లలో కూడా హిజ్రాల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. ఎలాంటి టిక్కెట్ లేకుండా రైళ్లు ఎక్కడం,ప్యాసింజర్లను డబ్బులు అడిగి,ఇవ్వకుంటే వారిని కొట్టడం,తిట్టడం,చీరలు లేపి వారి ముఖంపై వేయడం వంటి గలీజ్ పనులు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో చాలా ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రయాణికులు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ దీనిపై రైల్వే శాఖ కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది.
ఉన్నత స్థాయిలో హిజ్రాలు కూడా
అయితే మొత్తం హిజ్రా కమ్యూనిటీని నిందించలేం.. చాలామంది హిజ్రాలు సొంతంగా వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ అడుక్కోకుండా తమ కాళ్లపై తాము నిలబడుతూ గర్వంగా జీవిస్తున్నారు. కొందరు అత్యున్నత స్థాయిలో కూడా ఉంటున్నారు. వీరిని ఎట్టకేలకు ప్రభుత్వాలు గుర్తించి వీరి లోన్లు కూడా మంజూరు చేస్తున్నారు. ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు కూడా వీరికి జారీ చేస్తున్నారు. అయితే వీరికేం ప్రభుత్వాలు దయ చూపడం లేదు..వీరి హక్కును వీరికి ఇస్తున్నాయి.
ఎట్టకేలకు అనేక పోరాటాల తర్వాత వారికి హక్కులు లభించినందుకు వాటిని అందిపుచ్చుకొని ఎదిగే ప్రయత్నం చేయకుండా ఇంకా అడుక్కుంతూ, ఇలా సామాన్యులను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తే మాత్రం వీరికి ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్దమయ్యారు.



Click it and Unblock the Notifications
