Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నదులు,సరస్సులు లేవు..సౌదీ అరేబియాకు మంచినీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా!
మిడిల్ ఈస్ట్ దేశాల్లొ సౌదీ అరేబియా ఒకటి. ఇకప్పుడు ఎడారి,ఒంటెలతో నిండిన ఈ దేశం ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్, టవర్స్, అద్భుతమైన రోడ్ల కనెక్టివిటి,టెక్నాలజీ వాడకంలో ముందుంటూ నేడు సంపన్నగా దేశంగా నిలబడింది. ముస్లింలకు అత్యంత పవిత్ర స్థలమైన ముక్కా మదీనా కూడా ఈ దేశంలో ఉంది. అయితే ఈ దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ మంచి నీళ్లకు మాత్రం ఈ దేశం చాలా కష్టపడాల్సి ఉంటుంది. దేశంలో ఎక్కడా నీటి జాడ కనిపించదు. నదులు, సరస్సులు వంటి సహజ నీటి వనరులు దాదాపుగా శూన్యం. మరి ఇంతటి కఠినమైన వాతావరణంలో ఆ దేశంలో నివసించే కోట్లాది ప్రజలు తమ దైనందిన అవసరాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారు?
ఉప్పునీటిని అమృతంగా
సౌదీ అరేబియా నీటి అవసరాలను తీరుస్తున్న ప్రధాన ఆయుధం డీశాలినేషన్. ఇది సముద్రంలోని ఉప్పునీటిని తాగేందుకు వీలుగా మంచినీటిగా మార్చే ఒక విప్లవాత్మక ప్రక్రియ. దేశంలోని మొత్తం నీటి సరఫరాలో దాదాపు 80శాతం ఈ పద్ధతి ద్వారానే లభిస్తోందంటే దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. ఎర్ర సముద్రం, అరేబియా గల్ఫ్ తీరాల వెంబడి ఏర్పాటు చేసిన భారీ డీశాలినేషన్ ప్లాంట్లు నిరంతరం పనిచేస్తూ.. సముద్ర జలాల నుండి ఉప్పును, ఇతర మినరల్స్ ను సపరేట్ చేసి తాగేందుకు అనువైన మంచి నీటిని ఉత్పత్తి చేస్తాయి. ఈ రంగంలో సౌదీ అరేబియా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. రివర్స్ ఆస్మాసిస్, డిస్టిలేషన్ వంటి పద్ధతులను ఉపయోగించే ఈ ప్రక్రియ అత్యంత ఖరీదైనది, అధిక శక్తిని వినియోగించుకుంటుంది. అయినప్పటికీ తమ ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇది తప్పనిసరి.

భూగర్భంలో దాగి ఉన్న పురాతన జలనిధి
డీశాలినేషన్ ప్లాంట్ల తర్వాత సౌదీకి నీటిని అందిస్తున్న మరో ముఖ్యమైన వనరు భూగర్భ జలాశయాలు. ఇవి సాధారణ భూగర్భ జలాలు కావు, వీటిని శిలాజ జలాలు(Fossil Water) అంటారు. వేల సంవత్సరాల క్రితం భూమి పొరలలో నిక్షిప్తమైన ఈ పురాతన నీటిని వెలికితీసి వినియోగిస్తున్నారు. అయితే ఈ వనరుకు ఒక పరిమితి ఉంది. ఇది పునరుత్పాదకం కాదు.. అంటే ఒకసారి వాడితే మళ్లీ అంత త్వరగా నిండదు. అందుకే దీని వాడకం విషయంలో సౌదీ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ అమూల్యమైన నీటిని కాపాడుకోవడం భవిష్యత్ తరాలకు అత్యంత అవసరం.
నీటి సంరక్షణ
నీటి లభ్యత ఎంత కష్టమో తెలిసిన సౌదీ ప్రజలకు దానిని పొదుపుగా వాడటం ఒక సాంస్కృతిక అవసరంగా, వారి జీవన విధానంలో భాగంగా మారిపోయింది. నీటిని ఆదా చేసే పరికరాలను వాడటం, లీకేజీలను వెంటనే సరిచేయడం వంటివి అక్కడ సర్వసాధారణం. ప్రభుత్వం కూడా ప్రజా చైతన్య కార్యక్రమాల ద్వారా నీటి పొదుపు ప్రాముఖ్యతను నిరంతరం తెలియజేస్తుంది. అంతేకాకుండా వందల కిలోమీటర్ల పొడవైన పైపులైన్లతో కూడిన ఒక అధునాతన పంపిణీ నెట్ వర్ క్‌ను నిర్మించి, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సురక్షితమైన నీటిని అందిస్తోంది. భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ, సౌదీ అరేబియా సౌరశక్తితో నడిచే డీశాలినేషన్ ప్లాంట్లు, నీటి పునర్వినియోగం వంటి నూతన సాంకేతికతలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రకృతిపరమైన సవాళ్లను సాంకేతికతతో అధిగమిస్తూ, తమ పౌరుల భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది సౌదీ అరేబియా



Click it and Unblock the Notifications