Latest Updates
-
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది
Thumbs Up Emoji: సరేనా? కోపమా? థంబ్స్ అప్ ఎమోజీపై సరికొత్త డిబేట్..రగిలిపోతున్న యువత
ఇప్పుడున్నది అంతా డిజిటల్ యుగం. ఈ డిజిటల్ వరల్డ్ లో మనం మాట్లాడే భాష నిరంతరం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఉత్తరాల్లో మన భావాలను అక్షరాల్లో పొందుపరిచేవాళ్ళం. అయితే ఇప్పుడు ఒకే ఒక్క ఎమోజీతో మన మొత్తం అభిప్రాయాన్ని చెప్పేస్తున్నాం. ఈ ఎమోజీల ప్రపంచంలో ఒక చిన్న థంబ్స్ అప్ ఎమోజీ ఇప్పుడు పెద్ద తుఫానే క్రియేట్ చేసింది. నేటి యువతరం దృష్టిలో ఈ ఎమోజీ అంగీకారానికి చిహ్నం కాదు.. అదొక కోపాన్ని లేదా నిరాశను వ్యక్తం చేసే చర్య. దీన్ని వాడటం అంటే అవతలి వారిని అవమానించినట్లేనని యువత వాదిస్తున్నారు.
దీనంతటికి కారణం ఇదే
ఈ చర్చంతా ఒక రెడ్డిట్ పోస్ట్ తో మొదలైంది. ఒక యువ ఉద్యోగి తన కొత్త ఆఫీసులో ఎదుర్కొన్న ఒక వింత అనుభవాన్ని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ పాం రెడ్డిట్ లో షేర్ చేశాడు. అతడు ఏం చెప్పాడంటే..నేను ఇటీవలే ఒక కార్పొరేట్ జాబ్ లో చేరాను. ఆఫీసులో మేమంతా వర్క్ కోసం మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాడతాం. ఇక్కడ నా కొలీగ్స్, ముఖ్యంగా పెద్దవాళ్ళు ప్రతి మెసేజ్ కి'థంబ్స్ అప్' రియాక్షన్ తో స్పందిస్తున్నారు. నాకు మాత్రం అది చూడగానే ఏదో తెలియని అసౌకర్యం, చిరాకు కలుగుతుంది. అది చాలా మొరటుగా, సంభాషణను మధ్యలోనే ఆపేసినట్లుగా అనిపిస్తుంది. నేను సాధారణంగా హార్ట్ ఎమోజీని వాడతా లేదా 'గ్రేట్!, థాంక్స్!' వంటి చిన్న పదాలతో స్పందిస్తాను. నా లాగే ఇంకెవరైనా ఈ థంబ్స్ అప్ ఎమోజీని చూసి ఇబ్బంది పడుతున్నారా? అని అతను అడిగాడు.

నెటిజన్ల రియాక్షన్ ఇదే
అతని పోస్ట్ కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. దీంతో ఈ అంశంపై యువత ఎంత ఢిఫరెంట్ గా ఆలోచిస్తారో స్పష్టమైంది. ఒక నెటిజన్..మీరు వర్క్ ప్లేస్ లో హార్ట్ ఎమోజీ వాడటానికి సౌకర్యంగా ఉన్నప్పుడు థంబ్స్ అప్ సింబల్ తో ఎందుకంత ఇబ్బంది? నా దృష్టిలో థంబ్స్ అప్ అంటే సరే నేను అంగీకరిస్తున్నాను లేదా విషయం అర్థమైంది అని. హార్ట్ ఎమోజీ కంటే ఇదే ఎక్కువ ప్రొఫెషనల్‌గా అనిపిస్తుందని కామెంట్ చేశారు. అయితే కానీ, 24 ఏళ్ల ఒక Gen Z యూజర్ ఈ వాదనను పూర్తిగా తిప్పికొట్టాడు.
మా తరానికి (Gen Z)థంబ్స్ అప్ ఎమోజీ చాలా మొరటుగా, నిష్క్రియాత్మకంగా దూకుడుగా కనిపిస్తుంది. ఎవరైనా మీకు ఈ ఎమోజీ పంపితే వారు మీతో విసిగిపోయారని లేదా మీతో మాట్లాడటం ఇష్టం లేదని చెప్పినట్లు ఉంటుంది. మా ఆఫీసులో పెద్దవాళ్ళు ఇది వాడినప్పుడు వారు నా మీద కోపంగా ఉన్నారేమోనని నేను చాలా రోజులు ఆందోళన చెందాను. ఇది కచ్చితంగా తరాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అని తన అభిప్రాయాన్ని చెప్పాడు.
అసలు విషయం ఇది
మరొక నెటిజన్ దీనికి మరింత లోతైన విశ్లేషణ ఇచ్చాడు. థంబ్స్ అప్ ఎమోజీలో వ్యక్తిగత స్పర్శ ఉండదు. అందుకే అది చాలా మందికి కలవరపాటుకు గురి చేస్తుంది. అది సంభాషణకు ముగింపు పలికినట్లుగా ఉంటుంది. అవతలి వ్యక్తితో నిజమైన సంబంధాన్ని కోరుకునే వారికి ఇది నచ్చదు అని అన్నారు.
అయితే ఈ చర్చలో Gen Z తరానికి చెందిన మరొకరు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల వల్ల నేను Gen Z అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. అది కేవలం ఒక బొటనవేలు. దానికి అన్ని అర్థాలు తీయకండి. ప్రతీదాన్ని ఇంత లోతుగా ఆలోచించడం అనవసరం అని అన్నాడు.

తరాల మధ్య తేడా
.
పాత తరానికి థంబ్స్ అప్ అనేది ఒక పని పూర్తయిందని లేదా ఒక విషయాన్ని అంగీకరించామని చెప్పే సమర్థవంతమైన, వేగవంతమైన మార్గం. కానీ GIFలు, స్టిక్కర్లు, వందలాది ఎమోజీలతో పెరిగిన యువతరానికి ఆ ఒక్క బొటనవేలు సింబల్ చాలా నీరసంగా, ఆసక్తి లేనట్లుగా, కొన్నిసార్లు అగౌరవంగా కూడా కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ మీరు కావాలనే అవతలి వారిని దూరం పెట్టాలనుకుంటే తప్ప.. ఆ బొటనవేలును పక్కనపెట్టి ఒక నవ్వుతున్న ముఖం లేదా ఒక చిన్న మాటతో స్పందించడం ఉత్తమం.



Click it and Unblock the Notifications