Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
Bhogi 2025: మీ స్నేహితులకు, ఆత్మీయులకు భోగి పండగ శుభాకాంక్షలను ఇలా అందంగా చెప్పేయండి!
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభా సంతరించుకుంది. ప్రజలందరూ పట్టణాలను వదిలేసి పల్లెటూర్లకు పయనమవుతున్నారు. తమ వాళ్ళతో సంతోషకరమైన వాతారణంలో సంక్రాంతి జరుపుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఊరికి వెళ్లిపోయారు. తెల్లారితే భోగి. ఇంకో కొన్ని ఘంటల్లో భోగి మంటలు కూడా వేసేస్తారు. ఎంతో పవిత్రమైన ఈ భోగి నాడు.. భోగి మంటలు వేసి అందులో పాత వస్తువులతో పాటు పాత చేదు జ్ఞాపకాలను కూడా కాల్చేస్తారు. అయితే మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికీ భోగి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో చూడండి.
భోగి శుభాకాంక్షలు తెలుగులో
సంవత్సరానికి ఓసారి వచ్చి పాత చేదు జ్ఞాపకాలను, కష్టాలను తుడిపేసే పవిత్రమైన భోగి సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు!

మీకు మీ కుటుంబాలకు పవిత్రమైన భోగి పండగ శుభాకాంక్షలు మిత్రమా. మీరంతా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.
పాత బాధలు, పాత కష్టాలు అన్నీ భోగి మంటల్లో కాలిపోయి కొత్త ఆనందాలను మీకు ఆ దేవుడు ప్రసాదించాలని, మీ ఇంట్లో కొత్త ఆనందాలు వెల్లివిరియాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
పవిత్రమైన భోగి వెలుగులు మీ జీవితంలో కూడా గొప్ప వెలుగులు నింపాలని, సంతోషాన్ని కలగజేయాలని కోరుకుంటున్నాను మిత్రమా! మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
భోగి పండుగ సందర్భంగా మీకు మరియు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం, సంపద మరియు సంతోషం లభించాలని కోరుకుంటాను.
భోగి మంటల్లో మీ అన్ని కష్టాలు కాలిపోయి, కొత్త ఆశలు మొలకెత్తాలని కోరుకుంటూ, మీకు భోగి శుభాకాంక్షలు.
భోగి మంటల్లో పాత బాధలు కాలిపోయాయి, కొత్త ఆనందాలు మొదలవనున్నాయి. ఆ కొత్త ఆనందం మీ జీవితంలో కొత్త మార్పులను తీసుకురావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సబ్యులకు భోగి శుభాకాంక్షలు
భోగి వెలుగు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. ఈ భోగి పండుగ మీకు కొత్త ఆరంభాలను తీసుకురావాలని కోరుకుంటాను. భోగి శుభాకాంక్షలు మిత్రమా!
ఈ భోగి పండగ మీకు ఎనలేని సంతోషాలను, ఆనందాలను కలగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సబ్యులకు భోగి శుభాకాంక్షలు.
భోగి మంట వెలుగులు సూర్యుడి కిరణాల మాదిరిగా మీ జీవితంలో కూడా వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండగ శుభాకాంక్షలు
ఈ పవిత్రమైన భోగి పండగ నాడు మీరు చేపట్టే పనులన్నీ విజయవంతమవ్వాలని, మీకు ఎనలేని విజయాలను అందివ్వాలని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలు మిత్రమా.



Click it and Unblock the Notifications