Bigg Boss Telugu 9 Grand Finale Voting: తనూజకు షాక్... నరాలు తెగేలా బిగ్‌బాస్ 9 ఫైనల్ ఓటింగ్‌, టాప్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు మరో నాలుగు రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దాదాపు మూడు నెలలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది ఈ మెగా రియాలిటీ షో. ప్రతివారం ఒక్కొక్క కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా.. చివరికి ఐదుగురు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. సంజన గల్రానీ, తనూజ పుట్టస్వామి, పవన్ డిమోన్, ఇమ్మాన్యుయేల్, పడాల పవన్ కళ్యాణ్‌లు టాప్ 5లో నిలిచారు. వీరిలో ముగ్గురు సెలబ్రిటీలు కాగా.. ఇద్దరు కామనమెన్స్ ఉన్నారు. వీరిలో ఎవరు బిగ్‌బాస్ తెలుగు 9 విజేత కాబోతున్నారు అనేది డిసెంబర్ 21న తేలిపోనుంది. అయితే ఫైనల్ ఓటింగ్ ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ పరిశీలిస్తే..

టాప్ 5లో ఐదుగురు
బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 5లో చోటు దక్కించుకున్న ఐదుగురు అనేక అడ్డంకులను దాటుకుని తమ వ్యక్తిత్వం, దూకుడు, టాస్క్‌లు ఇతర అంశాలతో ఇక్కడి వరకు చేరుకున్నారు. కానీ విజయం ఒక్కడినే వరిస్తుందన్నది తెలిసిందే.. ఆ ఒక్కరు ఎవరు? అన్నదే ఇక్కడ సస్పెన్స్‌గా మారింది. పవన్ కళ్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామిల మధ్య తొలి నుంచి నువ్వా నేనా అన్నట్లుగా పోరాటం జరుగుతుండగా.. వీరిలో ఒకరు బిగ్‌బాస్ విజేత అవుతారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.

Big Boss Telugu 9 Grand Finale Voting Padala Pawan Kalyan leading thanuja in trouble

తనూజ బలం అదే
నిజాయితీ, కలుపుగోలుతనం, త్యాగం, సింప్లిసీటీ అన్న అంశాలు తనూజకు బలంగా మారాయి. గ్రూపులు కట్టకుండా, సింపతీ కార్డ్ వాడకుండా తన ఆటను తాను ఆడుతూ అందరి మన్ననలు పొందుతోంది. అంతేకాకుండా తను గెలిచే ప్రైజ్‌మనీని పేద విద్యార్ధుల కోసం వినియోగిస్తానని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పి మరింత ఓటింగ్‌ పొందింది. దాంతో సోషల్ మీడియాలో ఆమెకు పాజిటివిటీ పెరిగి ఓట్లుగా మారుతున్నాయి.

దుమ్మురేపుతోన్న సోల్జర్
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అతనొక సైనికుడు. బిగ్‌బాస్‌పై ఆసక్తితో ఉద్యోగానికి కొన్ని రోజులు సెలవు ప్రకటించి కామన్‌మెన్ కేటగిరీలో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టాడు. తొలుత ఆట అర్ధం కావడానికి టైం పట్టడంతో పాటు అమ్మాయిల చుట్టూనే తిరుగుతున్నాడంటూ తిట్లు తిన్నాడు. అయితే నాగార్జునతో పాటు కంటెస్టెంట్ల హితబోధతో తన ఆటతీరు మార్చుకున్నాడు. టాస్క్‌లైనా, ఫైటింగ్ అయినా సై అన్నట్లుగా దూసుకొచ్చాడు. నామినేషన్స్‌లోకి వస్తే సెలబ్రిటీలను మించిన ఓటింగ్‌తో టాప్‌లో ఉండేవాడు. రెండు సార్లు కెప్టెన్‌గా నిలవడంతో పాటు ఈ సీజన్‌కు తొలి ఫైనలిస్ట్‌గానూ ఫైనల్‌లో అడుగుపెట్టి టైటిల్ కోసం తనూజతో ఢీ అంటే ఢీ అంటున్నాడు.

ప్రభావం చూపలేకపోతున్న ముగ్గురు
ఒకప్పటి హీరోయిన్ సంజన గల్రానీ కూడా తొలి నుంచి టైటిల్ రేసులో వినిపించినప్పటికీ బిగ్‌బాస్ తొలివారాలలో చూపించిన ఫైర్ ఇప్పుడు ఆమె చూపించలేకపోతోంది. అయినప్పటికీ చివరిలో పుంజుకుని టాప్ 5లో నిలిచింది. ఈ సీజన్‌ విన్నర్ ఎవరు అని నాగ్ అడిగితే తనూజ, కళ్యాణ్‌ల పేరు చెప్పి రేసులో నేను లేను అని అప్పుడే హింట్ ఇచ్చింది. ఇక జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ టాప్‌లో నిలిచినప్పటికీ.. మూడు సార్లు కెప్టెన్ అయినప్పటికీ నామినేషన్స్‌లోకి దాదాపు 9 వారాల పాటు దూరంగా ఉండటం అతని ఓటింగ్‌ని దెబ్బతీసింది. కామన్‌మెన్ కేటగిరీలో వచ్చి చివరి వరకు నిలిచాడు డిమోన్ పవన్. రీతూ చౌదరితో సక్సెస్‌ఫుల్‌గా లవ్‌ ట్రాక్ నడిపిన ఈ కుర్రాడు.. మధ్యలో కొన్ని వివాదాలు కొని తెచ్చుకున్నా ఓవరాల్‌గా తన ఆటతీరుతో మంచి మార్కులే వేయించుకున్నాడు. అయితే కళ్యాణ్, తనూజలను దాటుకుని ఇతను టైటిల్ వరకు చేరుకోవడం అనుమానమే. అయినప్పటికీ తన ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు.

ఓటింగ్ రిజల్ట్ ఇదే
ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే ఓటింగ్‌ను పరిశీలిస్తే.. పడాల పవన్ కళ్యాణ్‌ ఏకంగా 45 శాతం ఓటింగ్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక అతనికి టఫ్ ఫైట్ ఇస్తోన్న తనూజ పుట్టస్వామి 27 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ 13 శాతం ఓటింగ్‌తో, డిమోన్ పవన్ 9.5 శాతం, సంజన గల్రానీ 5.63 శాతం ఓటింగ్‌తో చివరి స్థానంలో నిలిచారు. దాంతో ఎక్కువ మంది పవన్ కళ్యాణే ఈ సీజన్ బిగ్‌బాస్ విజేత కావాలని కోరుకుంటున్నారని అనిపిస్తోంది. అయితే ఓటింగ్ లైన్స్ మరికొన్ని రోజులు ఓపెన్‌లోనే ఉంటాయి. దాంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని భావిస్తున్నారు.

Desktop Bottom Promotion