హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్!

హైదరాబాద్ వాసులకు బంపరాఫర్. ఇకపై ఒక పాస్ తీసుకుంటే చాలు బస్సు,మెట్రోలో రెండిటింలో ఎన్నిసార్లు అయినా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు రెగ్యులర్ గా బస్ లో తిరగేందుకు ఒక పాస్ తీసుకోవాలి, అలాగే మెట్రోకు సపరేట్ గా ఒక పాస్ ఉంది. అయితే త్వరలోనే ఈ రెండింటికీ కలిపి ఒకే పాస్ అందుబాటులోకి రానుంది.

ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సంజయ్ జహు అధికారులను ఆదేశించారు. దీంతో మెట్రోలో ప్రయాణించాలంటే ఒక టిక్కెట్, ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటే మరో టిక్కెట్ తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.

Big Relief for Hyderabadis Single Pass for Metro and RTC Buses Soon

సెప్టెంబర్ 6న బేగంపేటలోని మెట్రోరైల్ భవన్ లో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారుల, తెలంగాణ ఆర్టీసీ ,ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్, ఇతర ఏజెన్సీల మధ్య జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్ లో ప్రజా రవాణా, జరుగుతున్న మెట్రో పనుల గురించి చర్చ జరిగింది. ఈ సమయంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ..కామన్ మెట్రో-ఆర్టీసీ పాస్ ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ధర ఎంత, వ్యాలిడిటీ ఎట్లా

అయితే ఈ పాస్ లు నెలావారీగా మాత్రమే కాకుండా రోజువారీగా కూడా అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ పాస్ ధర, వ్యాలిడిటీ కండీషన్స్, అర్హత రూల్స్, అప్లికేషన్ ప్రాసెస్, దీన్ని ఒక ఫిజికల్ కార్డుగా అందిస్తారా లేదా డిజిటల్ పాస్ గా ఉంటుందా అనే అన్ని వివరాలను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు.

Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ!

వీళ్లకు చాలా బెనిఫిట్

హైదరాబాద్ లో రోజూ లక్షల మంది బస్సులు, మెట్రోలో ప్రయాణిస్తుంటారు. చాలామంది తమ ఇళ్ల దగ్గర నుంచి మెట్రో స్టేషన్ వరకు చేరుకోడానికి బస్సులో ప్రయాణిస్తుంటారు. మళ్లీ మెట్రో దిగిన తర్వాత కూడా కొందరు తమ ఆఫీసులు లేదా పని ప్రదేశాలకు చేరుకోడానికి మళ్లీ బస్సులు ఎక్కుతుంటారు. ఇలాంటి వాళ్లందరికీ ఈ పాస్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా, బస్సుకు ఒక టిక్కెట్, మెట్రోకి బక టిక్కెట్ తీసుకోవడం ఖర్చు బాగానే అవుతుందని భావించి సొంత వాహనాలు లేదా ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ఉపయోగించేవాళ్లకు ఈ కామన్ పాస్ ఉపయోగపడుతుంది.

జాతీయ స్థాయిలో ఒకే దేశం-ఒకే కార్డు అనే దృక్పథంతో విస్తృతంగా గుర్తింపు పొందిన నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) వెనుక ఉన్న ఆలోచన ఇదే. మెట్రో, బస్సు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలలో ఒకే చెల్లింపు సాధనాన్ని ఉపయోగించేలా NCMC రూపొందించబడింది. అంతేకాకుండా ఈ పాస్ ను పార్కింగ్, చిన్న మొత్తాల చెల్లింపుల వంటి సేవలకు కూడా వాడుకోవచ్చు. ముంబై, నాగ్ పూర్, పూణే, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి చాలా నగరాల్లో NCMC సిస్టమ్ ఇప్పటికే అందుబాటులో ఉంది.

వివిధ మెట్రో, RRTS, బస్సు రవాణా సంస్థల మధ్య పరస్పరం వినియోగించుకోగలిగే టికెటింగ్ విధానాన్ని కల్పించే లక్ష్యంతో రూపొందించిన NCMC వ్యవస్థ.. 13 మెట్రో ప్రాజెక్టులు, 11 బస్సు రవాణా సంస్థలలో అందుబాటులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం 2026 జూలైలో తెలిపింది. ముంబై, నాగ్ పూర్, పూణే, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లో ఇది ఇప్పటికే అందుబాటులో ఉంది.

Story first published: Tuesday, September 8, 2026, 20:50 [IST]
Desktop Bottom Promotion