కొవిడ్‌ ఇచ్చిన కిక్‌.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.!

ఈ రోజుల్లో డిగ్రీ కాదు కదా పీహెచ్‌డీ పట్టాలు ఉన్నా ప్రతిభకి తగిన ఉద్యోగాలు దొరకడం లేదు. చిన్నాచితకా ఉద్యోగాలు, చాలీచాలని సంపాదనతో నేటి యువతరం కుటుంబాలను నెట్టుకొస్తోంది. ఇక, పెళ్లిళ్లు కూడా పాతికేళ్ల లోపు కావడం కష్టంగానే మారింది. కానీ ఈ యువకుడు అందుకు విరుద్ధం. డిగ్రీ సర్టిఫికెట్‌ లేదు.. కానీ రెండు పదుల వయసులోనే రూ. లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఆ యువకుడి స్ఫూర్తి గాథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఆ యువకుడు ఇంత చిన్న వయసులోనే ఇంతగా ఎలా సంపాదించగలుగుతున్నాడు.. దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి.. యువకుడు చేసిన పోస్ట్‌ వివరాలు చూద్దాం..

Bihar young man earns rs 5 lakhs per month viral story and inspiration for youth

డిగ్రీ పట్టా లేకపోయినా ఫ్రీలాన్సింగ్‌ ద్వారా నెలకు రూ. 4 లక్షలకి పైగా సంపాదిస్తూ తన తల్లి పడుతున్న కష్టాలకు చెక్‌ పెట్టాడు బిహార్‌కి చెందిన 20 ఏళ్ల యువకుడు. ఆ యువకుడు రెడిట్‌లో చేసిన పోస్ట్‌లో 'X’లో విపరీతంగా షేర్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ప్రకారం బిహార్‌కి చెందిన యువకుడు చిన్నప్పటి నుంచే కుటుంబంలో కష్టాలు, ఒడుదొడుకులు ఎదుర్కొంటూ పెరిగాడు. ఐదేళ్లప్పుడు అతని తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి పోషణలో మాత్రమే పెరిగాడు. ఆర్థిక ఇబ్బందులతో సీబీఎస్ఈ సిలబస్‌ చదవలేకపోయాడు. స్టేట్‌ బోర్డుకి మారాడు. కానీ ఇవేమీ అతనిలో పట్టుదలను ఆపలేదు. 2020లో అంటే 14 ఏళ్ల వయసులో ఆ యువకుడు తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.

చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం!

PUBG డిజైన్‌తో జీవితం

14 ఏళ్ల వయసులోనే టెక్నికల్‌ స్కిల్స్‌పై దృష్టి సారించి నైపుణ్యాలు నేర్చుకుంటూ PUBG ఈ స్పోర్ట్స్ జట్ల కోసం గ్రాఫిక్‌ డిజైనింగ్‌, ఎడిటింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. అయితే అప్పుడే కొవిడ్‌ సమయంలో భారత్‌లో PUBGని నిషేధించడంతో ఆదాయం, పని ఆగిపోయింది. దీంతో చాలా కాలం పాటు డిప్రెషన్‌లో కూరుకుపోయాడు.

ఉద్యోగంతో కాస్త ఊరట

ఈ క్రమంలో తనకున్న స్కిల్స్‌తో ఆన్‌లైన్‌ ద్వారా నోయిడాలోని వెబ్‌3 ఏజెన్సీలో నెలకు రూ. 15 వేల జీతంతో ఉద్యోగ జీవితం ఆరంభించాడు. డిగ్రీ లేకపోయినా అతను ఈ ఉద్యోగం సాధించడం గర్హనీయం. కానీ నోయిడాలో వాతావరణం, పని ఒత్తిడి కారణంగా మానసికంగా డిప్రెషన్‌కి గురై ఐదు నెలల తర్వాత తిరిగి బిహార్‌కు చేరుకున్నాడు.

అయితే అతను ప్రయత్నాలను అంతటితో ఆపలేదు. పట్టుదలతో ఒక టెక్‌ కమ్యూనిటీ కోసం ఉచితంగా బ్రాండింగ్‌ చేయడం విదేశీ క్లయింట్లను సంపాదించేలా చేసింది. దీంతో అనతి కాలంలోనే అతని సంపాదన వేల డాలర్లకి చేరింది. నెలకు సుమారు రూ. 3.3 లక్షల నుంచి రూ. 5.4 లక్షల వరకు పెరగడంతో తన తల్లికి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. తల్లికి రిటైర్‌మెంట్‌ ఇచ్చి బంగారు ఆభరణాలతో ముంచెత్తాడు.

హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్!హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్!

విజయం ఉన్నా మూల్యం తప్పలేదు

చిన్న వయసులోనే రూ. లక్షలు సంపాదిస్తూ ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా.. ఒంటరి జీవితం, కుంగుబాటుతో బాధపడుతున్నట్లు పోస్ట్‌లో యువకుడు పేర్కొన్నాడు. స్నేహితులు లేకపోవడం, సమాజంలో కలవలేకపోవడం ఇలా కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తనకి విజయం కిక్‌ ఇచ్చినా.. ఇది ఒక మూల్యంగా పేర్కొంటున్నాడు. ఏదేమైనా ఈ యువకుడి జీవితం.. చిన్న చిన్న సమస్యలకే కుంగుబాటుకి గురయ్యే కొందరు యువతకి స్ఫూర్తిదాయకంగా నిలిచిందనే చెప్పవచ్చు.

Story first published: Wednesday, September 9, 2026, 14:08 [IST]
Desktop Bottom Promotion