Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తిరుమల, తిరుపతి భక్తుల కోసం అద్దె బైక్ లు, బాలాజీ దర్శనంతో పాటు ఈ ప్రదేశాలను కూడా బైక్ లో సందర్శించవచ్చు..
తిరుమలలోని శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వేల సంఖ్యలో తిరుపతికి వస్తుంటారు. ఇతర అవసరాలు, పనుల మీద, బంధువులు, స్నేహితును కలుసుకోవడానికి, తిరుపతిలో చదువుకుంటున్న పిల్లలను చూడటానికి ఇలా ప్రతిరోజు లక్షలాది మంది తిరుపతి చేరుకుంటారు. తిరుమల చేరుకోవాలంటే కచ్చితంగా తిరుపతి మీదుగానే వెళ్లాలి. తిరుపతి నుంచి కాకుండా తిరుమలకు మరో మార్గం లేదు.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నడక మార్గం, లేదా వాహనాల్లో తిరుమల కొండకు చేరుకోవాలి. తిరుమల కొండ మీదకు కేవలం ఏపీఎస్ ఆర్ టీసీ బస్సులను మాత్రమే అనుమతి ఇస్తారు. ఇతర రాష్ట్రాల ఆర్ టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులను అనుమతించరు. ఇక ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు, భక్తుల సొంత వాహనాలు, బైక్ లు తిరుమల కొండ మీదకు వెళ్లడానికి టీటీడీ అధికారులకు అనుమతి ఇస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఎక్కువ మంది బస్సుల్లో, రైలులోనే తిరుపతికి వస్తున్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్లు తిరుమలకు, తిరుపతికి వస్తుంటారు. శ్రీవెంకటేశ్వరస్వామి భక్తులకు అందుబాటులో తిరుమతిలో లెక్కలేనన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. తిరుమల వెళ్లడానికి, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు సందర్శించడానికి వేలాది మంది భక్తులు ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తున్నారు.
ఇక పలు ట్రావెల్స్ కంపెనీలు చాలా కాలం నుంచి తిరుపతిలో తిరుమల భక్తుల కోసం అద్దెకు బైక్ లు ఇస్తున్నారు. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తిరుచానూరు, కపిలతీర్థం, అలిపిరి పరిసర ప్రాంతాలు, శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ సమీపంలోని బాలాజీ కాలనీ, టౌన్ హాల్ సర్కిల్, పెద్దకాపు లేఔట్ తదితర ప్రాంతాల్లోని ట్రావెల్స్ నిర్వహకులు బైక్ లు అద్దెకు ఇస్తున్నారు.
చాలాకాలం నుంచి తిరుపతిలో బైక్ లు అద్దెకు ఇస్తున్నారు. అయితే ఇద్దరు మాత్రమే తిరుమలతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంచరించాలంటే బైక్ లు అద్దెకు తీసుకుంటున్నారు. ఎక్కువ మందితో కలిసి తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని దేవాలయాలు, పర్యాటక కేంద్రాలు చూడాలంటే కార్లు అద్దెకు తీసుకుంటున్నారు.
తిరుమలకు బైక్ లో వెళ్లాలి అని ఆశపడుతున్న వారు మాత్రమే బైక్ లు అద్దెకు తీసుకుని హాయిగా తిరుమల గిరుల అందాలను ఆశ్వాదిస్తూ తిరుమలకు వెళ్లి వచ్చి తరువాత తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నారు. చాలాకాలం నుంచి తిరుపతిలో బైక్ లు అద్దెకు ఇస్తున్నా ఎక్కువగా తిరుమల వెళ్లే భక్తులు పెద్దగా బైక్ లు అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని, తిరుపతి పరిసర ప్రాంతాల్లో సంచరించడానికి ఎక్కువగా బైక్ లు అద్దెకు తీసుకుంటున్నారని ఓ ట్రావెల్స్ యజమాని అంటున్నారు.

తిరుపతి చుట్టూ బైక్ లో చూడదగ్గ ప్రదేశాలు:
*శ్రీ వేంకటేశ్వర ఆలయం: తిరుమల ఆలయం అని కూడా పిలువబడే శ్రీ వేంకటేశ్వర ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మరియు పూజ్యమైన దేవాలయాలలో ఒకటి.
*శ్రీ గోవిందరాజస్వామి ఆలయం: తిరుపతిలోని మరొక ప్రసిద్ధ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం.
*శ్రీ కపిలేశ్వర ఆలయం: తిరుపతికి 3 కి.మీ దూరంలో ఉన్న కపిలతీర్థం పట్టణంలో శ్రీ కపిలేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది
*శ్రీ కోదండరామ స్వామి ఆలయం: తిరుపతి నడిబొడ్డున శ్రీరామునికి అంకితం చేయబడిన శ్రీ కోదండరామ స్వామి ఆలయం.
*శ్రీ కల్యాణ వేంకటేశ్వర ఆలయం: తిరుపతికి 12 కి.మీ దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం పట్టణంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర ఆలయం ఉంది. ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది
*శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం: తిరుపతికి 15 కి.మీ దూరంలో ఉన్న అప్పలాయగుంట పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ
*శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం: తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్వేటినగరం పట్టణంలో *శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది
*శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం: తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో తాళ్లపాక పట్టణంలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది
*శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం: తిరుపతికి 100 కి.మీ దూరంలో ఉన్న మంగళగిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది.
*శ్రీ వరాహ స్వామి ఆలయం: శ్రీ వరాహ స్వామి ఆలయం పుష్కరిణి నది ఒడ్డున ఉంది మరియు ఇది విష్ణువు యొక్క అవతారమైన వరాహానికి అంకితం చేయబడింది.
*శ్రీ కాళహస్తి ఆలయం: శ్రీ కాళహస్తీశ్వరాలయం తిరుపతికి దాదాపు 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది
*శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం: తిరుపతికి 6 కి.మీ దూరంలో ఉన్న అలిపిరి పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం హనుమంతునికి అంకితం చేయబడింది
ఎండ దెబ్బకు బైక్ లకు తగ్గిన డిమాండ్:
తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో జీవించే ప్రజలతో పాటు చిత్తూరు. కడప, అనంతపురం, అన్నమయ్య జిల్లా, కర్నూలు జిల్లాల ప్రజలు ఆ వాతవరణానికి అలవాటుపడిపోయారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు తిరుపతిలో వేడిని తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతూ ఎక్కువగా నీడపాటున ఉండటానికి ఇష్టపడుతుంటారు. వాతరణం గురించి ఆలోచిస్తే తిరుపతిలో ఎక్కువ వేడి ఉంటుంది.
తిరుమలకు వెళ్లడానికి ఎక్కువ మంది ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు, జీపులు అద్దెకు తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. తిరుపతిలోని ట్రావెల్స్ లో ఎక్కువగా ఏసీ వాహనాలు ఉంటాయంటే తిరుపతి వాతావరణం గురించి మనం అంచనా వెయ్యవచ్చు. స్నేహితులతో కలిసి తిరుమలకు జాలీ రైడ్ వెళ్లాలి అనుకునే వాళ్లు, తిరుమలలోని పలు పురాతన ఆలయాలు, పలు ప్రాంతాలు చూడాలి అనుకునే వాళ్లు తిరుపతిలో బైక్ లు అద్దెకు తీసుకుని తిరుమలకు వెలుతుంటారు.
అద్దె బైక్ లు తీసుకుని తిరుమలకు జాగ్రత్తగా వెళ్లి వస్తే ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, డ్రైవింగ్ సక్రమంగా రానివాళ్లు తిరుమల ఘాట్ రోడ్లలో బైక్ లు నడపం అంత మంచిది కాదని, ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని కొందరు పెద్దలు అంటున్నారు. మొత్తం మీద తిరుపతిలో బైక్ లు అద్దెకు తీసుకుని తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉందని, తిరుపతి పరిసర ప్రాంతాల్లో జాలీగా తిరగడానికి పర్యాటకులు ఇష్టపడుతున్నారని తిరుపతిలోని కొన్ని ట్రావెల్స్ యజమానులు అంటున్నారు.
అయితే తిరుపతిలోని ట్రావెల్స్ యజమానులు కొందరు పోటాపోటీగా డిస్కౌంట్ ల రూపంలో తిరుపతి పర్యాటకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తిరుపతిలో బైక్ లో అద్దెకు తీసుకునేవాళ్లు జస్ట్ డైల్ తో పాటు ఇంటర్నెట్ లో వెతికి మంచి బైక్ లు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బైక్ అద్దెకు తీసుకున్న వాళ్లే పెట్రోల్ పట్టించుకుని తిరగవలసి ఉంటుంది.



Click it and Unblock the Notifications