Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ముంచుకొస్తున్న బర్డ్ ఫ్ల్యూ.. లక్షణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..! చికెన్ తినవచ్చా..?
దేశంలో బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి పెరగడం మొత్తం వైద్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. బర్డ్‌ఫ్లూ కేసులు పెరుగుతుండడంతో కేంద్రం అరెస్ట్ ప్రకటించింది. కోళ్ల ద్వారా బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. హెచ్5ఎన్1 ఇన్ఫెక్షన్ కోళ్ల ద్వారా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. నాలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్ల్యూ చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది. అన్ని పౌల్ట్రీ ఫాముల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు చాలా వేగంగా సోకుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మార్చ్ 2024 నుంచి బర్డ్ ఫ్ల్యూ కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్ల్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయ్.
బర్డ్ ఫ్లూ లక్షణాలు ఎలా వుంటాయ్ ?
బర్డ్ ఫ్ల్యూ వచ్చిన వాలళ్లో తీవ్రమైన జ్వరం వుంటుంది. పొడి దగ్గు, కండరాలు నొప్పిగా వుంటాయ్. జలువు వస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతల్లో కూడా వణుకు వస్తుంది. ఈ లక్షణాలన్నీ ఒకేసారి వుంటే దాన్ని బర్డ్‌ఫ్లూగా పరిగనించవచ్చు.
బర్డ్ ఫ్లూ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
బర్డ్ ఫ్ల్యూ అప్పటికే సోకిన వారి వద్దకు వెళ్లవద్దు. ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా సరే వారి వద్దకు వెళ్లవద్దు. చేతులు, కాళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. కరోనా సమయంలో సామాజిక దూరాన్ని పాటిస్తాం. అలాంటి సామాజిక దూరాన్నే పాటించాలి. కరోనా నిబంధనలను ఈ బర్డ్ ఫ్ల్యూకు కూడా అప్లై అవుతుంది.

కోళ్ల వద్దకు, పావురాల వద్దకు వెళ్లవద్దు. ఒక వేళ వెళ్లినా ముఖానికి మొత్తం మాస్క్ పెట్టుకొని ధరించి వెళ్లాలి.
బర్డ్ ఫ్ల్యూ ప్రధానంగా కోళ్ల నుంచి వస్తుందన్న విషయం తెలిసిందే. చికెన్ తింటే బర్డ్ ఫ్ల్యూ మరింత వేగంగా అంటుకుంటుందని భయపడుతుంటారు. అయితే చికెన్‌లో బాగా ఉడికిస్తే అందులో ఏదైనా వైరస్ వున్నా అది చచ్చిపోతుందని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. చికెన్, గుడ్ల నుంచి మాత్రం ఎలాంటి ప్రమాదం వుండదని నిపుణులు చెబుతున్నారు.
పౌల్ట్రీలో పనిచేసే వారికి ఈ బర్డ్‌ఫ్ల్యూ వైరస్ ఎక్కువగా సోకుతుంది. పక్షులకు ఈ బర్డ్ ఫ్ల్యూ వైరస్ ఎలా సోకుతుందంటే. హెచ్5ఎన్1 ఏవీయెన్ ఇన్‌ఫ్ల్యూయెంజా వైరస్ సోకిన పక్షులు తోటి పక్షుల వద్దకు వెళ్లినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. ఒకవేల మరణించిన పక్షుులకు ఈ వైరస్ వున్నా.. అలాంటి పక్షుల వద్దకు వేరే పక్షులు వెళ్లినా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా వుంటుంది.
హెచ్5ఎన్1 వైరస్ వున్న పక్షుల నుంచి రక్తం, నోటి నుంచి ఏదైనా ద్రవం, రెట్టల నుంచి కూడా ఈ వైరస్ వ్యాపి చెందే అవకాశాలు వున్నాయంటున్నారు.
హెచ్5ఎన్1 వ్యాక్సిన్‌ను అమెరికా త్వరలోనే తయారు చేయబోతోంది. సుమారు 48 లక్షల హెచ్5ఎన్1 వ్యాక్సిన్లను అమెరికా తయారు చేయడానికి సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం బర్డ్ ఫ్ల్యూను ఎదుర్కోవడానికి మాత్రం ఎలాంటి వ్యాక్సిన్ లేదు. కానీ బర్డ్‌ప్లూ ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ లా వ్యాప్తి చెందే అవకాశముందని అంటున్నారు.
1918లో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి చెందడం వల్ల లక్షల మంది మరణించారు. బర్డ్ ఫ్ల్యూకు వ్యాక్సిన్ లేకపోవడం. ఉన్నట్టుండి ఒకేసారి కరోనా వ్యాపించినట్లు వ్యాపిస్తే మరాణహోమం జరుగుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.



Click it and Unblock the Notifications