Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మిడ్ నైట్ బర్త్ డే బాయ్ ప్రైవేట్ పార్ట్స్ కు నిప్పు, వీడు పుట్టిన రోజే చచ్చి బతికాడు
ప్రతి ఒక్కరు వాళ్ళవాళ్ల పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అనుకుంటారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వారివారి స్థాయిని బట్టి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. స్నేహితుడు లేదా స్నేహితురాలి బర్త్ డే వేడుకలను వాళ్ల స్నేహితులు అందరూ కలిసి జరుపుకుంటారు. ఇక శ్రీమంతులు, సెలబ్రిటీల కుటుంబాలలో అయితే విందులు, వినోదాలతో సందడి చేస్తుంటారు. కొందరు అర్ధరాత్రి 12 గంటల తర్వాత స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటారు.
మరికొందరు మరుసటి రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో పాటు వాళ్ల స్నేహితుల్ని, బంధువుల్ని పిలిపించి కేక్ కట్ చేసి విందు ఇస్తుంటారు. ఇక బ్యాచులర్స్ అయితే సాయంత్రం నుండి మందు, విందు అంటూ చిందులు వేస్తూ హంగామా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సిటీలలో పీజీలలో ఉంటున్న బ్యాచిలర్స్ అంటే అబ్బాయిలు అయినా, అమ్మాయిల అయినా సరే స్నేహితుల పుట్టినరోజు వేడుకలను కేక్ కటింగ్ చేసి బయట ఫుడ్ ఆర్డర్ చేసి హ్యాపీగా గడిపేస్తున్నారు.

Image Courtesy: Twitter
ఎక్కువగా అబ్బాయిలు బయట డాబాల్లో, హోటల్స్ లో, బ్యాచిలర్ రూమ్స్ లో బర్త్ డే వేడుకల్లో మందు పార్టీలు చేసుకుంటారు. ఇక్కడ ఓ యువకుడికి అతని బర్త్ డే రోజు చచ్చి బతికినంత పని అయ్యింది. బర్త్ డే బాయ్ కి అతను ప్రైవేట్ పార్ట్స్ పైన స్ప్రే చల్లిన అతని స్నేహితులు ఏకంగా నిప్పు అంటించి అతని ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించారు. బ్యాచిలర్స్ ఉంటున్న రూమ్ లో బర్త్ డే బాయ్ నిద్రపోతున్నాడు.
అదే సమయంలో బయట నుండి అతని స్నేహితులు ఆ రూమ్ లోకి వెళ్లారు, ఆ తర్వాత నిద్రపోతున్న బర్త్ డే బాయ్ ప్రవేట్ పార్ట్ పై న స్రై చల్లాడు. మరొ యువకుడు అతని ప్రైవేట్ పార్ట్ కు నిప్పంటించాడు.. ఆ తర్వాత గట్టిగా హ్యాపీ బర్త్ డే టూ యూ అంటూ కేకలు వేశారు బర్త్ డే బాయ్ నిద్రలేచి చూసేసరికి అతని ప్రైవేట్ పార్ట్ పైన మంటలు వ్యాపించిన విషయం గుర్తించి వెంటనే అతను బోర్లా పడి మంటలు ఆర్పి వేసుకున్నాడు. ఆ తర్వాత స్నేహితులను పట్టుకుని కొట్టాడు. కొన్ని సెకన్లలోనే ఆ బర్త్ డే బాయ్ అతని స్నేహితులతో కలిసి పోయి బర్త్ డే సెలబ్రేషన్స్ లో మునిగిపోయాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు మండిపడుతున్నారు. వీడి అదృష్టం బాగుందని, బర్త్ డే రోజే చచ్చిబతికాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు.. మరికొందరు ఫన్నీగా వీడియో చేసి ఉంటారని. కామెర్లు పెట్టారు మరికొందరు పబ్లిసిటీ కోసం స్నేహితులు అందరూ కలిసి ఇలా చేసి ఉంటారని. కామెంట్లు పెడుతున్నారు. మొత్తం మీద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు మాత్రం వీడియోలో లేవు. ఈ వీడియోని కాలేష్ అనే వ్యక్తి ఎక్స్ అకౌంట్ నుండి షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.



Click it and Unblock the Notifications