Latest Updates
-
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే!
శ్రావణమాసంలో పుట్టిన పిల్లలకు ఈ పేర్లు పెట్టండి..శివయ్య ఆశీస్సులు ఉంటాయ్!
భోలేనాథ్ కి అత్యంత ఇష్టమైన శ్రావణమాసం ఇప్పటికే ఉత్తర భారతదేశంలో జులై 11 నుంచే ప్రారంభం కాగా, దక్షిణ భారతదేశంలో జులై 26,2025 నుంచి ప్రారంభమవుతుంది. నార్త్ ఇండియాలో పౌర్ణమితో నెల ముగిసే పూర్ణిమాంత క్యాలెండర్ ను ఫాలో అవుతుండగా...సౌత్ ఇండియాలో అమావాస్యతో నెల ముగిసే అమావాస్యంత క్యాలెండర్ ను అనుసరిస్తుంటారు. అందుకే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన శ్రావణ మాసం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. శ్రావణ మాసం అంటే కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి, ప్రేమ, భక్తి, పచ్చదనానికి ప్రతీక.
పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణమాసంలో పుట్టిన పిల్లలు చాలా అదృష్టవంతులని ఒక బలమైన నమ్మకం హిందువుల్లో ఉంది. అందుకే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కేవలం ట్రెండీగా ఉండటమే కాకుండా, అర్థవంతమైన పేరు పెట్టాలని ఆశిస్తారు. శివుడికి లేదా ప్రకృతికి సంబంధించిన పేర్లు పిల్లల జీవితంలో సానుకూల శక్తిని నింపుతాయి. వారి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చేలా, జీవితాంతం గర్వపడేలా ఉండే పేరును ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. పేరు పెట్టేటప్పుడు కేవలం ట్రెండ్ ను మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న అర్థాన్ని కూడా తప్పక తెలుసుకోవాలి. పేరు పిలవడానికి సులభంగా, వినడానికి మధురంగా ఉండేలా చూసుకోండి. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఈ పవిత్ర శ్రావణ మాసంలో జన్మిస్తే సంప్రదాయం, ఆధునికత కలగలిపిన కొన్ని అద్భుతమైన పేర్ల జాబితా ఇక్కడ చూడండి.

శ్రావణంలో పుట్టిన అమ్మాయిల కోసం ఈపేర్లు
శివాని: శివుడితో ముడిపడి ఉన్న ఈ పేరుకు శివుని శక్తి అని అర్థం. ఇది పార్వతీ దేవి మరో రూపం. అమ్మాయిలకు ఇది ఎంతో శక్తివంతమైన పేరు.
గౌరవి: శివయ్యకు ప్రియమైన గౌరీ మాత పేరు నుండి వచ్చిన గౌరవి అనే పేరు అమ్మాయిలకు బాగుంటుంది. దీని అర్థం గర్వించదగినది లేదా గౌరవానికి అర్హురాలు.
శ్రావ్య: మీ ముద్దుల కుమార్తెకు ఈ పేరు చాలా బాగుంటుంది. శ్రావ్య అంటే వినడానికి చాలా మధురమైనదని అర్థం.. ఈ పేరు కొత్తగా, అందమైన అర్థంతో ఉంటుంది.
కావ్య: అమ్మాయిలకు ఇది ఎంతో అందమైన పేరు. కావ్య అంటే అందమైన కవిత లేదా సౌందర్యానికి ప్రతీక అని అర్థం.
అన్విత: కొత్తగా, మోడ్రన్ గా పేరు పెట్టాలనుకుంటే అన్విత చాలా బెస్ట్ ఆప్షన్. అన్విత అంటే అన్నీ తెలిసినది, జ్ఞాని లేదా శక్తి స్వరూపిణి అని అర్థం.
శ్రావణమాసంలో పుట్టిన అబ్బాయిల కోసం అందమైన పేర్లు
శివాంశ్ : దీని అర్థం శివునిలో భాగం లేదా శివుని అంశ. పరమేశ్వరుడితో ముడిపడి ఉన్న ఈ పేరు మీ అబ్బాయికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది.
నీరవ్: నీరవ్ అంటే నిశ్శబ్దం లేదా ప్రశాంతత అని అర్థం. ఈ పేరు వినడానికి ఆకర్షణీయంగా, ప్రభావవంతంగా ఉంటుంది.
అర్జున్ : ఈ పేరుకు పవిత్రమైన, స్వచ్ఛమైన అని అర్థం. ఇది శక్తికి కూడా ప్రతీక. ఈ పేరు అర్థవంతంగా ఉండటమే కాకుండా గంభీరమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.
రుత్విక్: శ్రావణంలో పుట్టిన అబ్బాయికి ఇది చక్కటి పేరు. రుత్విక్ అంటే వేదాలు తెలిసినవాడు లేదా పండితుడు అని అర్థం.
వ్యోమన్ : ఇది మోడ్రన్ గా, ప్రత్యేకంగా ఉండటమే కాకుండా మంచి అర్థాన్ని కలిగి ఉంది. వ్యోమన్ అంటే ఆకాశం అంత విశాలమైనవాడు అని అర్థం వస్తుంది.

ప్రకృతి ప్రేమికుల కోసం..అబ్బాయి, అమ్మాయికి పెట్టదగిన పేర్లు
మేఘ్ : ఈ రుతువుకు తగ్గట్టుగా పేరు పెట్టాలనుకుంటే మేఘ్ సరైనది. అబ్బాయికి మేఘ్ అని, అమ్మాయికి మేఘ అని పెట్టవచ్చు. దీని అర్థం మేఘం లేదా మబ్బు.
వర్ష: ఈ వర్షాకాలానికి గుర్తుగా మీ చిన్నారికి వర్ష అని పేరు పెట్టవచ్చు. దీని అర్థం వాన. ఇది అమ్మాయిలకు ఎక్కువగా సరిపోతుంది.
హరిత్: వర్షాకాలంలో పెరిగే పచ్చదనానికి ప్రతీక ఈ పేరు. హరిత్ అంటే పచ్చదనం. ఈ పేరును అబ్బాయికి లేదా అమ్మాయికి కూడా పెట్టవచ్చు.
అంబర్ : ఈ పేరు అబ్బాయి, అమ్మాయి ఇద్దరికీ సరిగ్గా సరిపోతుంది. అంబర్ అంటే ఆకాశం. ఇది వినడానికి కొత్తగా, అందంగా ఉంటుంది.
జలనిధి: ఇది కూడా అబ్బాయి, అమ్మాయి ఇద్దరికీ పెట్టదగిన పేరు. శ్రావణం, ప్రకృతి స్ఫూర్తితో పెట్టగలిగే ఈ పేరుకు జల భాండాగారం లేదా సముద్రం అని అర్థం.



Click it and Unblock the Notifications











