Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Chanakya Niti: బలవంతుడైన శత్రువును ఎలా ఓడించాలి?..చాణక్యుడు చెప్పిన 5 రహస్య సూత్రాలు
చాణక్యుడు కేవలం రాజనీతిజ్ఞుడే కాదు, మానవ మనస్తత్వాన్ని, జీవితపు లోతులను అవపోసన పట్టిన ఒక మహోన్నత జ్ఞాని. వందల ఏళ్ల క్రితం ఆయన రచించిన చాణక్య నీతి నేటికీ మన జీవితాలకు ఒక దిక్సూచి. జీవితంలో ఎదగాలన్నా లేదా విజయం సాధించాలన్నా చాణక్యుడు చెప్పింది చేస్తే చాలు. చాలామంది శత్రువు బలవుతుండైతే వారిని చూసి భయపడి సైలెంట్ అయిపోతుంటారు. మన నిత్య జీవితంలో చాలామందినే ఇలా చూస్తుంటాం. అయితే శత్రువు ఎంత బలవంతుడైనా మన మేధస్సు ముందు తలవంచాల్సిందేనని చాణక్యుడు స్పష్టం చేశారు. అందుకే మన పెద్దలు కండబలం కన్నా బుద్ధిబలమే ఎల్లప్పుడూ గొప్పదని తరచూ చెబుతుంటారు. శక్తివంతమైన శత్రువును సైతం మట్టికరిపించే ఐదు అద్భుతమైన మార్గాలను చాణక్యుడు సూచించారు. అవేంటో ఇక్కడ చూడండి.
అధ్యయయం
బలవంతుడైన శత్రువుపైవిజయానికి మొదటి మెట్టు..శత్రువును పూర్తిగా అర్థం చేసుకోవడమే. అతని బలాలు ఏమిటి? అతని బలహీనతలు ఎక్కడ ఉన్నాయి? అతని వ్యూహాలు, లక్ష్యాలు ఏమిటో గమనించాలి. శత్రువు గురించి మీరు ఎంత ఎక్కువ సమాచారం సేకరిస్తే విజయం మీకు అంత చేరువవుతుందని చాణక్యుడు చెప్పారు.

మిమ్మల్ని మీరు శక్తివంతులుగా చేసుకోండి
శత్రువు గురించి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. శత్రువును ఎదుర్కొనే ముందు మిమ్మల్ని మీరు శారీరకంగా, మానసికంగా, వ్యూహాత్మకంగా మరింత శక్తిమంతులుగా తీర్చిదిద్దుకోవాలి. మీ శక్తిని పెంచుకోవడంపైనే పూర్తి దృష్టి పెట్టాలని చాణక్యుడు సూచించారు.
సహనమే మీ ఆయుధం
యుద్ధంలో తొందరపాటు ఆత్మహత్యతో సమానం. చాణక్యుడు ప్రకారం సరైన సమయం కోసం ఓపికగా వేచి చూడటంలోనే అసలైన చాకచక్యం దాగి ఉంది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నప్పుడే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చాణక్యుడు తెలిపారు.
విభజించి పాలించండి
మీ శత్రువులు గుంపుగా ఉన్నప్పుడు వారి మధ్య అనైక్యతను, అపనమ్మకాన్ని సృష్టించాలి. వారి ఐక్యతను దెబ్బతీయడం ద్వారా వారిని బలహీనపరచవచ్చు. ఇది మీ గెలుపు అవకాశాలను రెట్టింపు చేస్తుందని చాణక్యుడు తెలిపారు.
చాకచక్యంతో మాయ చేయండి
యుద్ధంలో గెలుపునకు మోసం కూడా ఒక ఆయుధమే. శత్రువును తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించడం, వారి ప్రణాళికలను తలకిందులు చేయడం ఒక కళ. మీ ఈ ఉపాయం చాలాసార్లు మీకు అనూహ్య విజయాన్ని అందిస్తుందని చాణక్యుడు చెప్పారు.



Click it and Unblock the Notifications