Latest Updates
-
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్!
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!
సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని చూశాడు, బాగా ఇష్టపడ్డాడు. ఒంటరితనంతో బాధపడుతున్నా అని ఆ అమ్మాయి వీడియో పెట్టగానే మనోడి కళ్లల్లో నీళ్లు తిరిగాడు. ఎవరూ లేని ఆ అమ్మాయికి అండగా ఉండాలనుకున్నాడు. తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేశాడు. 1900 కి.మీ ప్రయాణించి ఆ అమ్మాయి ఉంటున్న ప్లేస్ కి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక మనోడికి నోట్లో మాట రాలేదు..పెద్ద కొండ ఎర్రిపప్ప అయ్యాకదా అని నెత్తి నోరు బాదుకున్నాడు. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
సోషల్ మీడియాలో కనబడేదంతా నిజం కాదు. ఇదొక రంగుల మాయా ప్రపంచం, కనబడే వీడియోలు, చాటింగ్ చేసే అమ్మాయిలు అంతా నిజం కాదు. ఈ సోషల్ మీడియా ప్రేమలను నమ్మి మోసపోయినవాళ్లు బోలెడు మందే ఉన్నారు.. అలాంటివారిలో ఎడిమర్ మార్టిన్స్ ఒకరు.

బ్రెజిల్ దేశానికి చెందిన ఎడిమర్ మార్టిన్స్(Edimar Martins)అనే 49 ఏళ్ల తాపీ మేస్త్రీ సోషల్ మీడియా ఎక్కవగా వాడుతుంటేవాడు. 2020 నుంచి టిక్ టాక్ లో జస్సికా ఒలివీయారా(Jessica Oliveira)అనే పేరుతో ఉన్న ఒక అమ్మాయి ఫ్రొఫైల్ ని ఫాలో అయ్యేవాడు. ఆమె పెట్టే వీడియోలు, ఫొటోలు అన్నీ చూసేవాడు. తాను ఒక పొలంలో నివపిస్తున్నట్లు, తనని అర్థం చేసుకునేవాడి కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపించేలా జెస్సికా ఆన్ లైన్ వీడియోలు ఉండేవి.
తాను తల్లిని కోల్పోయానని, ఆమె మరణం తర్వాత తాను చాలా కష్టాలు పడతున్నానని, ఒంటరిగా మిగిలిపోయానని, ఏ తోడు లేక బాధపడుతున్నా అంటూ ఆమె వీడియోలు ఉండేవి. అయితే ఇవన్నీ చూస్తుండే మార్టిన్స్ తెగ ఫీల్ అయిపోయాడు. ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు. ఎవరూ లేని ఆ అమ్మాయికి కొత్త జీవితం ప్రసాదిద్దాం అనుకున్నాడు. వెంటనే బస్సు టిక్కెట్ డబ్బుల కోసం తన దగ్గర ఊర్లో ఉన్నవి అన్నీ అమ్మేసి పెట్టేబేడా సర్దుకుని నేరుగా వీడియోలలో ఆ అమ్మాయి చెప్పే ఆమె అడ్రెస్ కి వెళ్లాడు.

అక్టోబర్ 9, 2026న దాదాపు 1900 కి.మీ 36గంటల సేపు ప్రయాణించి బ్రెజిల్ లోని బెలో హారిజొంటె(belo horizonte)నగరానికి చేరుకున్నాడు. తన ప్రేయసి, కలల రాణిని కలిసినప్పుడు ఏం మాట్లాడాలా అని ఒకటే కలలు కంటూ జర్మీ అంతా హాయిగా గడిపి లోకేషన్ కు చేరుకున్నాక మార్టిన్స్ కు దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ కనబడింది. అసలు తన డ్రీమ్ గర్ల్ నిజమైన అమ్మాయి కాదని, అది ఒక ఏఐ(AI)తో సృష్టించిన అమ్మాయి అని, ఏఐతో చేసిన అమ్మాయి ఫొటో ఉన్న అకౌంట్ నా ఇన్నాళ్లు నేను ఫాలో అయ్యి ఇదంతా చేశాను అని నోటి మీద వేళ్లు వేసుకున్నాడు మార్టిన్స్. వ్యూస్ పెంచుకొని ప్రొడక్ట్స్ అమ్మేందుకు సృష్టించిన ఏఐ ప్రొఫైల్ అదని దాన్ని నిర్వహించే వ్యక్తి ఆ తర్వాత అంగీకరించాడు.
ఇదేంది మావా నా లైఫ్ ఇలా అయ్యింది ఈ వయస్సులో అనుకుంటూ మార్టిన్స్ తిరిగి తన ఊరికి వెళ్లేందుకు డబ్బులు లేక స్థానిక అధికారులను సాయం కోరినట్లు సమాచారం.
మార్టిన్స్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అందుకే మావా సోషల్ మీడియాలో కనబడేదంతా నమ్మకూడదు, నిజమైన ప్రేమ కోసం వెళ్తే మొత్తం దివాళా తీశావు కదా మావా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే రాబోయే రోజుల్లో ఏఐతో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications
