పెళ్లి కాని ప్రసాద్‌ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!

ఇటీవల కాలంలో ఎవరు ఎవరితో కలిసి ఉంటున్నారు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది. కుర్ర అమ్మాయిలు వెళ్లి ముసలివాళ్లను ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు..యువకులు ఆంటీలు, అమ్మమ్మల వెనుక పడుతున్నారు. ఒక అమ్మాయి అయితే ఏకంగా కుక్కని పెళ్లి చేసుకొని అందరిని షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొన్ని సమయాల్లో మన పెంపుడు జంతువులతో మనం పంచుకునే బంధం, ఏ ప్రేమ సంబంధం కన్నా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా..ఇక్కడ పెళ్లి కానీ బ్యాచిలర్స్ చాలామంది ఉన్నామమ్మా..మేమెవరకు నీకు కనబడలేదా అంటూ మరికొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ కూడా చేస్తున్నారు.

British model elizabeth hoad marries pet dog after many failed relationships

కుక్కను ఎందుకు పెళ్లి చేసుకుంది

బ్రిటన్ మాజీ గ్లామరస్ మోడల్ ఎలిజబెత్ హోడ్(Elizabeth hoad)ఒక కుక్కని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ఎలిజబెత్ 200 మందితో డేటింగ్ చేసింది, అయితే అన్నీ బ్రేకప్ అయ్యాయి. ఇందులో నాలుగు సార్లు ఎంగ్ మెంజ్ దాకా వెళ్లి ఆగిపోయాయి. ఇంతమందితో రిలేషన్ షిప్ ఫెయిల్ తర్వాత ఇక సరైన భాగస్వామి దొరుకుతారన్న నమ్మకం కోల్పోయింది.

పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట!

మనుషులనే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లుంది. దీంతో తన 6 ఏళ్ల వయస్సు ఉన్న పెంపుడు కుక్కనే పెళ్లి చేసుకుంది. ఈమె పెళ్లి వేడుకను ఒక టీవీ కార్యక్రమంలో కూడా ప్రసారం చేశారు. అయితే ఈ పెళ్లి చట్టబద్దంగా గుర్తింపు పొందలేదు. అయితే ఈ పెళ్లి జరిగింది 2019లో కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలిజబెత్ స్టోరీ వైరల్ గా మారింది. కుక్కని పెళ్లి చేసుకోడం అనే ఆమె తీసుకున్న అసాధారణ నిర్ణయం ప్రేమ, రిలేషన్స్, పెంపుడు జంతువులు అందించే ఓదార్పు వంటి అంశాలపై చర్చకు దారితీసింది.

Story first published: Wednesday, October 21, 2026, 16:58 [IST]
Desktop Bottom Promotion