Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Dhanteras Gold Buying Tips : బంగారం కొనేటప్పుడు..మోసపోకూడదంటే ఇది గుర్తుంచుకోండి
దీపావళి అంటే చాలామంది ఒక్క రోజు పండుగ అని భావిస్తారు. అయితే దీపావళి 5 రోజులు పండుగ. ధన్ తేరాస్ తో దీపావళి సెలబ్రేషన్స్ ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి జరుపుకుంటుండగా..అక్టోబర్ 18న ధన్ తేరాస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ధన్ తేరాస్ పండుగ రోజున ప్రజలు బంగారం కొనుగోలు చేయడం శతాబ్దాల నాటి సంప్రదాయం..ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం,శ్రేయస్సు వస్తుందని ప్రజలు నమ్ముతారు. అయితే ధన్ తేరాస్ రోజున బంగారం కొనేటప్పుడు మోసపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బంగారం కొనేటప్పుడు చాలామంది దాని స్వచ్ఛత, క్యారెట్ గురించి విచారించరు. దీంతో వాటిని కొన్నాక అవి విరిగిపోతున్నాయి,వంగిపోతున్పాయి అని ప్రజలు కంప్లెయింట్ చేస్తుంటారు. అయితే నగ మన్నిక, దాని అందం రెండూ క్యారెట్ పైనే ఆధారపడి ఉంటాయి. మరి ఏ సందర్భానికి, ఏ నగకి ఎన్ని క్యారెట్ల బంగారం సరైనదో ఇక్కడ చూడండి.

స్వచ్ఛమైన బంగారం ఇది
బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారం అంటే 99.9శాతం స్వచ్ఛమైన, మేలిమి బంగారం. ఇందులో ఇతర లోహాల కల్తీ అస్సలు ఉండదు. అందుకే ఇది అత్యంత మృదువుగా, వెన్నలా ఉంటుంది. ఈ కారణంగా 24 క్యారెట్ల బంగారంతో నగలు చేయిస్తే అవి సులభంగా వంగిపోవడం లేదా విరిగిపోవడం జరుగుతుంది. రోజువారీ వాడకానికి ఇది అస్సలు పనికిరాదు. అయితే, పెట్టుబడిగా బంగారు బిస్కెట్లు, నాణేలు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ఇది పెళ్లిళ్ల బంగారం
మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందినది 22 క్యారెట్ల బంగారమే. ఇందులో 91.6 శాతం బంగారం, మిగిలిన 8.4శాతం.. వెండి, రాగి వంటి ఇతర లోహాలు ఉంటాయి. ఈ మిశ్రమం బంగారానికి తగినంత గట్టిదనాన్ని, మన్నికను ఇస్తుంది. దీని మెరుపు, స్వచ్ఛత దాదాపు 24 క్యారెట్ల బంగారానికి దగ్గరగా ఉంటూనే దృఢంగా ఉంటుంది. అందుకే వివాహ ఆభరణాలు, మంగళసూత్రాలు, భారీ నెక్లెస్ సెట్లు, హారాలు, గాజులు వంటివి తయారు చేయడానికి 22 క్యారెట్ల బంగారాన్నే ఎక్కువగా సెలక్ట్ చేసుకుంటారు.
నిత్యం ధరించే నగల కోసం
మనం రెగ్యులర్ గా పెట్టుకునే ఉంగరాలు, గొలుసులు, ముక్కుపుడకలు, చెవిపోగులు వంటివి బలంగా ఉండాలి. అటువంటి వాటి కోసం 18 క్యారెట్ల బంగారం కరెక్ట్. ఇందులో 75శాతం స్వచ్ఛమైన బంగారం, 25శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఈ లోహాల కలయిక నగలకు అద్భుతమైన గట్టిదనాన్ని ఇస్తుంది, తేలికగా అరిగిపోకుండా కాపాడుతుంది. కాబట్టి మీ రోజువారీ ఆభరణాలు ఎక్కువ కాలం మన్నాలంటే 18 క్యారెట్లను ఎంచుకోవడం బెటర్.

చిన్న వస్తువులకు, లేటెస్ట్ డిజైన్లకు ఇదే కరెక్ట్
14 క్యారెట్ల బంగారంలో 58.5శాతం మాత్రమే బంగారం ఉంటుంది. స్వచ్ఛత తక్కువగా ఉన్నప్పటికీ ఇది చాలా దృఢంగా, గీతలు పడకుండా ఎక్కువ కాలం మన్నుతుంది. చిన్న ఉంగరాలు, లాకెట్లు, చెవిపోగులు వంటి వాటికి ఇది చక్కగా సరిపోతుంది. బడ్జెట్ తక్కువగా ఉండి, స్టైలిష్ గా కనిపించే రోజువారీ నగల కోసం చూసేవారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.
ఇవి తప్పక గుర్తుంచుకోండి
--ప్రతి నగపై బీఐఎస్ (BIS) హాల్ మార్క్ ముద్ర ఉందో లేదో కచ్చితంగా చూసుకోండి. ఇదే మీ బంగారం స్వచ్ఛతకు గ్యారెంటీ.
-ప్రతి కొనుగోలుకు సరైన బిల్లు తీసుకోండి. అందులో బంగారం బరువు, క్యారెట్, తయారీ ఛార్జీలు స్పష్టంగా ఉండాలి.
-మీ కళ్ల ముందే నగల తూకాన్ని సరిచూసుకోండి.



Click it and Unblock the Notifications