Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
నా అన్వేషణ అన్వేష్ అరెస్ట్.. కేసులు నమోదు చేసిన పోలీసులు, ఎందుకంటే?
తెలుగులో అత్యంత ఫేమస్ యూట్యూబర్లలో నా అన్వేషణ కూడా ఒకరు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తూ తన యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు పెడుతుంటారు. వాటి ద్వారా భారీగానే డబ్బులు సంపాదిస్తుంటారు. ఈయనకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫాంలలో సుమారు 60 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌పై ప్రమోషన్స్ చేస్తూ.. బాగా పాపులర్ అయ్యారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్‌పై పోరాటం చేస్తూ.. బాగా పాపులర్ అయ్యారు కూడా. అయితే అన్వేష్‌కు భారీ షాక్ తగిలింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే అతను అరెస్ట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అసలు ఆయనపై ఎందుకు కేసు నమోదు చేశారు? అనే విషయాల గురించి క్లియర్‌గా ఇక్కడ తెలుసుకుందాం.
అన్వేష్‌పై ఎందుకు కేసు నమోదు చేశారు?
మీ అందరికీ తెలుసు.. ఇటీవల కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత మొత్తంలో చర్చ నడిచిందో అని. దీనిపై ప్రభుత్వాలు సైతం స్పందించి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వీటన్నిటికీ ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాటిలో నా అన్వేషణ కూడా ఒకరు. ఇతరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపై భారీగా పోరాటం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం నేరమని పేర్కొన్నారు. ఇలా వీసీ సజ్జనార్‌తో కలిసి పోరాటం చేయడంతో.. పలువురు బెట్టింగ్ ప్రమోటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ క్రమంలో అన్వేష్ పలువురు అధికారులపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. మెట్రో సీఎండీ, IASలు, పలువురు అధికారులు సీఎంలు కూడా ఉన్నారని పలు ఆరోపణలు చేశారు. వీరంతా సుమారు 300 కోట్ల రూపాయలు తీసుకున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో పోలీసులు నా అన్వేషణ అన్వేష్ పై కేసులు నమోదు చేశారు. అతను తప్పుడు ఆరోపణలతో.. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, సమాజంలో తప్పుడు వార్తలను తీసుకెళ్తున్నారని కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి.. విచారించే అవకాశం ఉంది.
ఇదంతా స్టార్ట్ అయ్యింది అక్కడే..
బయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ నుంచి ఈ తతంగం అంతా మొదలైంది. అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల.. ఎంతో మంది ప్రాణాలు పోయాయని, అతడిని అరెస్ట్ చేయాలని అన్వేష్ వీడియోస్ చేశారు. ఆయనకు పోటీగా బయ్యా సన్నీ యాదవ్ సైతం వీడియోలు చేయడంతో ఇద్దరి మధ్య యుద్ధం అనేది మొదలైపోయింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం, దుర్భాషలాడుకోవడం వంటివి చేశారు. ఇది క్రమంగా పెరిగి.. చాలా మంది యూట్యూబర్లపై అన్వేష్ వీడియోస్ చేయడం ప్రారంభించారు. చిలికి చిలికి గాలి వాన అయినట్లు.. అన్వేష్ పలువురు అధికారులు, సీఎంలు, మాజీలు, ఎమ్మెల్యేలలపై కూడా వీడియోస్ చేశాడు. దీంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అతడిపై కేసు ఫైల్ అయ్యింది.
అన్వేష్ అరెస్ట్ అవుతాడా?
అన్వేష్ అరెస్ట్ అవుతాడా అంటే అది చెప్పలేమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. అతడిని రప్పించి.. విచారించిన తరువాత పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Click it and Unblock the Notifications