Mothers Day 2023: ఈ సెలబ్రిటీలకు పెళ్లి కాలేదు కానీ తల్లులయ్యారు, ఎవరంటే?

పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం సాధారణ ప్రజల్లో చాలా పెద్ద విషయమే కానీ సెలబ్రిటీల్లో కాదు. చాలా మంది ప్రముఖులు పెళ్లి కాకుండానే గర్భం దాల్చి తల్లిగా మారారు. సింగిల్ మామ్ లాగే ఉంటూ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు. తండ్రి లేరు అనే ఆలోచన ఇసుమంతైనా రాకుండా వారిని పెంచి పెద్ద చేస్తున్నారు. పెళ్లి కాకుండానే తల్లులైన ఆ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం.

Celebrities Who Become Mothers Without Marriage Details In Telugu

కల్కీ కోచ్లిన్:
పెళ్లి కాకుండానే తల్లిగా మారిన ప్రముఖుల జాబితాలో మొదట ఉండే పేరు కల్కీ కోచ్లిన్. కల్కి కోచ్లిన్ ఇంతకుముందు సినీ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ను వివాహం చేసుకున్నప్పటికీ, ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత కల్కి కోచ్లిన్ ఓ ఇజ్రాయెల్ వ్యక్తితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతని పేరు గై హెర్ష్‌బర్గ్. ఆ ఇజ్రాయెల్ వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉండగానే కల్కి కోచ్లిన్ గర్భం దాల్చింది. అలా పెళ్లి కాకుండానే తల్లి అయింది.

అమీ జాక్సన్:
బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాల్లో నటించి మంచి పేరు, గుర్తింపు సంపాదించుకున్న నటి అమీ జాక్సన్. అమీ జాక్సన్ 2019 సంవత్సరంలో బాయ్ ఫ్రెండ్ జార్జ్ పయానిటుతో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి అమీ జాక్సన్ జార్డ్ పయానిటు ఇద్దరూ పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులుగా మారారు. అమీ జాక్సన్ కొడుకు పేరు ఆండ్రియస్. అయితే ఆ తర్వాత వీరిద్దరూ తమ రిలేషన్ షిప్‌కు బైబై చెప్పినట్లు గాసిప్స్ వచ్చాయి. 31 ఏళ్ల అమీ జాక్సన్ కు ఇంకా పెళ్లి కాలేదు. సింగిల్ మదర్ గా ఉంటూనే తన కొడుకుని పెంచి పెద్ద చేస్తోంది.

నీనా గుప్తా:
ప్రముఖ నటి నీనా గుప్తా, మాజీ లెజెండరీ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ మధ్య రిలేషన్ షిప్ ఉన్నట్లు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోకముందే డేటింగ్ సమయంలోనే గర్భం ధరించి కుమార్తె మసాబాకు జన్మనిచ్చారు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ తమ రిలేషన్ షిప్‌కు తెగదెంపులు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. చాలా కాలం పాటు నీనా గుప్తా సింగిల్ మదర్‌గానే ఉంటూ కుమార్తెను పెంచింది. నీనా తన 49 ఏళ్ల వయస్సులో వివేక్ మెహ్రాను పెళ్లి చేసుకుంది.

గాబ్రియెల్లా-డెమెట్రియాడ్స్:
మోడల్, నటి అయిన గాబ్రియెల్లా-డెమెట్రియాడ్స్ కూడా పెళ్లి కాకుండానే తల్లిగా మారింది. గాబ్రియెల్లా-డెమెట్రియాడ్స్, నటుడు అర్జున్ రాంపాల్ రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడే తను గర్భం దాల్చింది. అలా ఓ కుమారుడికి జన్మనిచ్చారు. వీరిద్దరూ ఆ తర్వాత విడిపోయారు. అర్జున్ రాంపాల్ సూపర్ మోడల్ మెహర్ జెసియాను 1998లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహికా, మైరా అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆ తర్వాత అర్జున్ రాంపాల్, మెహర్ విడాకులు తీసుకుని విడిపోయారు.

మహి గిల్:
మహి గిల్ తన 17 ఏళ్ల వయస్సులోనే వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. అతనితో విడాకులు తీసుకుని చాలా కాలం పాటు ఒంటరిగా ఉండిపోయింది. 2019వ సంవత్సరంలో తనకు రెండున్నరేళ్ల కుమార్తె ఉందని మహి గిల్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఇలియానా:
తన వయ్యారాలతో టాలీవుడ్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి ఇలియానా. దేవదాస్ చిత్రం నుండి ఈ బ్యూటీ ఫిగర్ కు కుర్రాళ్లు వెర్రెత్తిపోయే వారు. మహేష్ బాబు పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన పోకిరి సినిమాలో ఈ అమ్మడి అందాలను అందరూ ఫిదా అయిపోయారు. ఇలియానా ఇప్పటి వరకు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించలేదు. కానీ ఈ మధ్యే తను 'అడ్వెంచర్ మొదలైంది' అనే క్యాప్షన్ ఉన్న టీషర్టు ధరించి ఇన్‌స్టాలో ఓ పోస్టు పెట్టింది. మెడలో 'మామా'(అమ్మ) అనే అక్షరాలతో ఉన్న పెండెంట్ ఉంది. ఈ పోస్టుకు 'కమింగ్ సూన్.. మై లిటిల్ డార్లింగ్ ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అనే క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. ఈ పోస్టుపై ఆమె తల్లి కామెంట్ చేశారు. 'గ్రాండ్ వెల్కమ్ టూ మై గ్రాండ్ బేబీ' అంటూ తన ఆనందం వ్యక్తం చేసింది.

Story first published: Sunday, May 14, 2023, 8:16 [IST]
Desktop Bottom Promotion