Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
చాణక్య నీతి : ఈ సూత్రాలు పాటిస్తే.. మీరే అసలైన ధనవంతులు
చాణక్యుడు చెప్పే విషయాలకు చాలా పాపులారిటీ ఉంది. ఆయన సూక్తులు ఇచ్చి వందల సంవత్సరాలు గడిచినా ఈ ఆధునిక యుగంలో కూడా చాణ్యకుడి నీతులుకు చాలా ప్రముఖ్యత ఉంది. ఇంటర్వ్యూల్లో, పర్సనాలిటీ డెవలప్‌మెంట్లల్లో చాణక్య నీతుల పై ఉండే చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆర్థిక శాస్త్రం పైన కూడా ఆయన మనకు ఎన్నో విషయాలను అందించారు. ప్రత్యేకంగా అర్థశాస్ల్ర పూస్తకాన్ని రచించిన విషయం మనకు తెలిసిందే. ఆయన బోధనల ద్వారా వ్యాపారంలో వృత్తిలో విజయం సాధించిన వారు చాలా మంది ఉన్నారు. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఆదా చెయ్యాలి అనే విషయాలపైన కూడా స్పష్టతను ఇచ్చారు.

డబ్బుపైన వ్యామోహం ఎక్కువగా ఉండి, నీతినిజాయితీలు పాటించకపోతే ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదని చెప్పాడు. చెడు దారిలో డబ్బులు సంపాదించినా ఆ డబ్బు ఎక్కువ కాలం నిలవదన్నాడు.
ఇతరులకు గౌరవ మర్యాదలు ఇవ్వకుండా అవమానపరస్తూ సంపాదించేవాడి సంపద కూాడా ఎక్కువ కాలం నిలవదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి మరిన్ని కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నాడు.
డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు..
డబ్బు, అంటే లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు. దొంగతనం, జూదం, మోసం, అన్యాయం ద్వారా డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు ఎక్కువ రోజులు ఆ స్థానంలో ఉండదని అంటున్నారు. కాబట్టి తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించవద్దంటున్నారు.
ప్రస్తుతం కొందరు మనుషులు అనుభవిస్తున్న బాధలు, వ్యాధులు, పేదరికం ఇవన్నీ వారి చేసిన పనుల ఫలితాలని, మంచి పనులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి డబ్బును తప్పుడు మార్గంలో సంపాదిస్తే తరువాత కష్టాలను, బాధలను ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు.
డబ్బు లేని వారికి తక్కువ దృష్టితో చూడవద్దన్నాడు. వారిని తక్కువ అంచనా కూడా వేయవద్దన్నారు. డబ్బు లేనంత మాత్రాన తెలివి లేని వాడు కాదని చెప్పారు. వినయం లేనివాడే అందరికంటే పేదవాడని చాణక్యుడు స్పష్టం చేశాడు.
ఒకవైపు సంపాదిస్తూ మరోవైపు క్రమం తప్పకుండా దానం చేసే వారి ఇంట్లో పేదరికం ఉండదంటున్నారు. అయితే ఎక్కువగా దానం చేయడం కూడా మంచిది కాదన్నారు.
ధనికులు, వ్యాపారులు, మేధావులు, వైద్యులు ఉన్న చోట ఉండాలి. అలాంటి ప్రదేశంలో ఉంటే ఆర్థిక సమస్యలను ఎక్కువగా ఎదుర్కోమంటారు.
డబ్బును సంపాదించవచ్చు గానీ ఆత్మగౌరవాన్ని సంపాదించలేమని చాణక్యుడు అంటాడు. ఆత్మగౌరవం వున్న వ్యక్తే అసలైన సంపన్నుడని చెప్పాడు.



Click it and Unblock the Notifications