Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya Niti : ఎప్పటికీ అడుగు పెట్టకూడని 5 ప్లేస్ లు ఇవే..చాణక్యుడు చెప్పిన కీలక విషయం
భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఆచార్య చాణక్యుడు ఒకరు. ఈయనను కౌటిల్యుడు అని పేరుతో కూడా పిలుస్తారు. చాణక్యుడు కేవలం ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, గొప్ప తత్వవేత్త, ఆర్థికవేత్త, వ్యూహకర్త. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన గురువు. ఆయన రచించిన అర్థశాస్త్రం అనే గ్రంథం నేటికీ రాజనీతి, పరిపాలన, ఆర్థికశాస్త్రంపై ఒక ప్రామాణిక గ్రంథంగా పరిగణించబడుతుంది. జీవితంలో విజయం సాధించాలన్నా, గౌరవంగా బతకాలన్నా చాణక్యుడు చెప్పిన సూత్రాలు నేటికీ ఆచరణీయం.
చాణక్యుడి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం నంద సామ్రాజ్య పతనం, మౌర్య సామ్రాజ్య స్థాపన. నాటి నందరాజు ధననందుడు తన ప్రజలను అణచివేస్తూ అహంకారపూరితంగా వ్యవహరించేవాడు. ఒకసారి ధననందుడు చాణక్యుడిని అవమానించాడని దీనికి ప్రతీకారంగా చాణక్యుడు నంద సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో సహా పెకిలించి వేస్తానని ప్రతిజ్ఞ చేశాడని చెబుతారు. ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి చాణక్యుడు చంద్రగుప్తుడు అనే యువకుడిని గుర్తించాడు. చంద్రగుప్తుడిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, రాజకీయం పట్ల ఆసక్తిని గమనించిన చాణక్యుడు అతడిని ఒక గొప్ప యోధుడిగా, పాలకుడిగా తీర్చిదిద్దాడు. చాణక్యుడు తన అపారమైన వ్యూహాత్మక జ్ఞానంతో చంద్రగుప్తుడికి యుద్ధ కళలు, రాజనీతి, పరిపాలనా నైపుణ్యాలు బోధించాడు. చాణక్యుడి మార్గదర్శకత్వంలోనే చంద్రగుప్తుడు బలమైన సైన్యాన్ని నిర్మించి, నంద సామ్రాజ్యాన్ని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి అయ్యాడు.. చాణక్యుడు అతని ప్రధానమంత్రి, ముఖ్య సలహాదారుగా పనిచేశాడు.

చాణక్యుడు కొన్ని ప్రదేశాలకు పొరపాటున కూడా వెళ్లకూడదని.. అక్కడ ఉండటం వల్ల గౌరవం కోల్పోవడమే కాక, భవిష్యత్తు అంధకారమవుతుందని గట్టిగా హెచ్చరించారు. చాణక్య నీతి ప్రకారం మనిషి తన జీవితంలో సుఖశాంతులతో, విజయవంతంగా బతకాలంటే దూరంగా ఉండాల్సిన ఆ ప్రదేశాలు ఏవో ఇక్కడ చూడండి.
గౌరవం లేని చోట
మీకు మర్యాద, గౌరవం లభించని ప్రదేశానికి అసలు వెళ్లకూడదని చాణక్య నీతి తెలిపింది. అలాంటి చోట ఉండటం వల్ల మీ విలువ తగ్గిపోతుంది, మీ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ధనం కన్నా ఆత్మగౌరవమే గొప్పదని భావించేవారు అలాంటి ప్రదేశాన్ని వెంటనే వదిలివేయాలి.
విద్యాబుద్ధులు నేర్పని చోట
ఎక్కడైతే చదువుకు, జ్ఞానానికి విలువ ఉండదో ఆ ప్రదేశం భవిష్యత్తు లేని అంధకారంతో సమానం. చాణక్య నీతి ప్రకారం అలాంటి చోట నివసించడం అంటే మీ ఎదుగుదలను మీరే అడ్డుకున్నట్టు. మీ పిల్లల భవిష్యత్తును కూడా నాశనం చేసినట్లే. జ్ఞానాన్ని సంపాదించే అవకాశం లేని చోట జీవించడం వ్యర్థం అని చాణక్యుడు చెప్పాడు.

ఉపాధి అవకాశాలు లేని చోట
జీవించడానికి ఉపాధి అత్యవసరం. ఏ ప్రదేశంలో అయితే కష్టపడి పనిచేయడానికి అవకాశాలు ఉండవో, అక్కడ నివసించడం వల్ల నిరుద్యోగం, పేదరికం తప్పవు అని చాణక్యుడు తెలిపాడు. ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తీవ్రమైన కష్టాల్లోకి నెడుతుంది. కాబట్టి జీవనాధారం లేని ప్రదేశాన్ని వీలైనంత త్వరగా వదిలివేయడం శ్రేయస్కరం అని చాణక్యుడు చెప్పాడు.
బంధువులు, స్నేహితులు లేని చోట
మనం సంఘజీవులం. కష్టసుఖాల్లో పాలుపంచుకోవడానికి, ఆపదలో ఆదుకోవడానికి బంధుమిత్రులు అవసరం. మీకు అండగా నిలిచే వారు లేని కొత్త ప్రదేశంలో నివసించడం చాలా ప్రమాదకరం. ఏదైనా సమస్య వస్తే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. అందుకే మనవాళ్లు అని చెప్పుకోవడానికి ఎవరూ లేని చోట ఉండకూడదని చాణక్యుడు సూచించాడు.
త్యాగం, దయ, సత్ప్రవర్తన లేని చోట
ఎక్కడైతే ప్రజలలో త్యాగభావం, దయ, సహాయపడే గుణం, నైతిక విలువలు లోపిస్తాయో ఆ ప్రదేశం నివాసయోగ్యం కాదు. అలాంటి వాతావరణంలో పెరిగితే మనపై కూడా ఆ చెడు ప్రభావం పడుతుంది. మంచిని నేర్చుకోలేని చోట ఉండటం వల్ల ప్రయోజనం శూన్యం అని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications