Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
విషపు నాగుల కంటే ప్రమాదకరం..ఈ 5 వ్యక్తులకు దూరంగా ఉండండి
వందల ఏళ్ల క్రితం అపర మేధావిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి బోధనలు నేటికీ ఆచరణనీయమైనవి. చాణక్యుడు చెప్పిన ప్రతి మాట ఒక్కో వజ్రం లాంటిది. ఆయన చెప్పిన మాటలను పాటిస్తే జీవితంలో ఉన్నతస్థాయిలో ఉంటారు. డబ్బు,విజయం, కెరీర్, కుటుంబం ఇలా అనేక విషయాల గురించి ఆయన తన నీతిశాస్త్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. అయితే చాణక్యుడు కొందరు వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలని సృష్టంగా సూచించాడు. సాధారణంగా మనం మన జీవితంలో అనేక రకాల వ్యక్తులకును కలుస్తుంటాం.. ఇందులో కొందరు మనకు స్ఫూర్తినిస్తారు..కొందరు సహాయం చేస్తారు..మరికొందరు మంచిగా మాటలు చెప్పి వెన్నుపోటు పొడుస్తుంటారు.
కొందరు వ్యక్తులు విషపూరిత పాములకంటే ప్రమాదకరమని చాణక్యుడు చెప్పాడు. సకాలంలో ఈ వ్యక్తుల నుండి దూరం పాటించకపోతే జీవితంలో విధ్వంసం ఖాయం. అలాంటి వారిని గుర్తించి వారి నుండి మనల్ని మనం రక్షించుకోవాలని చాణక్య నీతి మనకు సలహా ఇస్తుంది. ఒక దుష్టుడిని వీలైనంత త్వరగా గుర్తించి, వీలైనంత వరకు అతనికి దూరంగా ఉండండి. మీరు అతన్ని మారుస్తారని లేదా మెరుగుపరుస్తారని మీరు అనుకుంటే అది మీ తప్పు. అలాంటి వ్యక్తులు మెరుగుపడరు, వారు బాధపెట్టడానికి కొత్త మార్గాలను మాత్రమే కనుగొంటారని చాణక్యుడు సృష్టంగా చెబుతున్నాడు.

చాణక్యుడు చెప్పిన డేంజర్ వ్యక్తులు వీళ్లే
సొంత ప్రయోజనాలే ముఖ్యంగా ఉండేటోళ్లు
ఏ వ్యక్తి అయితే కేవలం తన సొంత ప్రయోజనం లేదా లాభం కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారో పని పూర్తయ్యాక వాళ్లు మిమ్మల్ని గుర్తించడానికి నిరారిస్తారు. ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. ఇటువంటి వాళ్లు ఇప్పటికే మీ జీవితంలో ఉన్నట్లయితే ఎంత వీలైతే అంత త్వరగా వారి నుంచి దూరంగా ఉంటం మీకు మేలు చేస్తుంది.
నీ దుఃఖంలో మద్దతు ఇవ్వనోళ్లు
మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తుల నిజమైన ముఖం బయటపడుతుంది. మంచి సమయాల్లో మాత్రమే మీతో ఉండి కష్ట సమయాల్లో కనబడకుండా పోయేటోళ్లను అతిపెద్ద మోసగాళ్లుగా చాణక్యుడు అభివర్ణించాడు. వీరిని మించిన మోసగాళ్లు ఉండరు..కాబట్టి వీరిని వెంటనే కట్ చేయడం ఉత్తమం.
తియ్యగా మాట్లాడుతూ మనసులో ద్వేషం పెట్టుకునేటోళ్లు
మీ ముందు తియ్యటి మాటలు మాట్లాడి మనసులో మాత్రం అసూయ,ద్వేషం పెట్టుకునే వారిని ఎప్పటికీ దూరంగా ఉంచాలి. మీరు బలహీనంగా ఉన్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూసే వాళ్లు మిమ్మల్ని కిందకు దించగలరు.
మీ పురోగతిని చూసి అసూయపడేవారు
మీ పురోగతిని లేదా అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయినా, లోపల నుంచే అసూయపడి మీకు వ్యతిరేకంగా పుకార్లు వ్యాప్తి చేసేవాళ్లు మీ చుట్టూ అత్యంత ప్రమాదకరమైనవారు. వారు బయటి నుండి స్నేహితులలా ప్రవర్తిస్తారు కానీ లోపల శత్రువులగానే మిమ్మల్ని పరిగణిస్తారు. వీరిని సెకను ఆలస్యం చేయకుండా దూరం పెట్టేయడం ఉత్తమమని చాణక్యుడు అంటాడు.
అపనిందలు వేసేవారు
ఇతరుల గురించి కబుర్లు చెప్పుకునేవారు, అందరి ముందు ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాళ్ల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు వారు ఇతరులను అపనిందలు వేస్తున్నారు, రేపు వారు మిమ్మల్ని కూడా అపనిందలు వేయరని గ్యారెంటీ ఏం లేదు. ఈ రోజు ఒకడిపై చేసింది రేపు నీపైన కూడా చేయొచ్చు కాబట్టి ఇలాంటోళ్లను చేరదీయకూడదు,దగ్గరికి రానివ్వకూడదు.



Click it and Unblock the Notifications
