Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Chanakya Niti: లక్ష్యాన్ని సాధించాలంటే రోజూ ఈ పనులు చేయాలన్న చాణక్యుడు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితంలో విజయం సాధించాలన్నా, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నా ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు పాటించాలని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. లక్ష్యాలను చేరుకోవాలంటే రోజూ ఉదయం నిద్ర లేవగానే ఈ పనులు చేయాలని సూచించాడు ఆచార్యుడు. ఆయన ప్రతి ఒక్కరూ చేయాలని చెప్పిన ఆ పనులు ఏమిటే ఇప్పుడు తెలుసుకుందాం.
త్వరగా నిద్ర లేవాలి:
లక్ష్యాన్ని చేరుకోవాలంటే నిద్రకు సమయాన్ని వృథా చేయకూడదు. రోజు ఎంత నిద్ర పోతే అది శరీరానికి మంచిదో అంతవరకు మాత్రమే నిద్రపోవాలి. మిగిలిన సమయంలో ఒక్క క్షణం కూడా వృథా కాకుండా చూసుకోవాలి. లక్ష్యాన్ని సాధించాలంటే శ్రమించాల్సిందే. అది తెల్లవారుజాము నుండే ప్రారంభం కావాలి. ఉదయమే నిద్రలేవడం వల్ల పనులు త్వరత్వరగా పూర్తవుతాయి.
రేపటి పనిని ఈరోజే చేయండి:
చాణక్యుడి ప్రకారం పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందవచ్చు. కానీ పోయిన సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పొందలేము. ఇలాంటి పరిస్థితుల్లో రేపటికి పనిని వాయిదా వేయవద్దని ఆచార్య చాణక్యుడు సూచించాడు. సమయాన్ని గౌరవిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారని సూచించాడు.
ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి:
సమయాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వృథా చేయవద్దు. రోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దాని తర్వాత ఎలా వ్యవహరించాలి లాంటివన్నీ పక్కాగా ప్లాన్ వేసుకోవాలని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. మంచి ప్రణాళిక విజయానికి తొలి మెట్టులాంటిదని చాణక్యుడు వివరించాడు.
ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు:
శరీరం అనారోగ్యకరంగా ఉంటే ఏ లక్ష్యాన్ని సాధించలేము. కలలను అర్థవంతం చేయాలనుకుంటే, ప్రతి రోజూ ఉదయం యోగా, వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే, పూర్తి శక్తితో పని చేయగలుగుతారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications