Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Chanakya Niti: చాణక్యుడు చెప్పిన ఈ విషయాలతో ఈ తెలుగు నూతన సంవత్సరం అద్భుతంగా ఉంటుంది
ఈ శోభకృతు నామ సంవత్సరంలో జీవితంలో ఆనందమయం కావడానికి చాణక్యుడు చెప్పిన ఈ సూచనలు పాటించండి. వాటి ద్వారా ఈ తెలుగు నూతన సంవత్సరం సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది.
నేడు ఉగాది. తెలుగు నూతన సంవత్సరం. ఈ సంవత్సరం బాగుండాలని, ఆరోగ్యంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా సంతోషంగా, సాఫీగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
ఈ శోభకృతు నామ సంవత్సరంలో జీవితంలో ఆనందమయం కావడానికి చాణక్యుడు చెప్పిన ఈ సూచనలు పాటించండి. వాటి ద్వారా ఈ తెలుగు నూతన సంవత్సరం సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది.

ప్రతి మనిషి జీవితంలో బాధలు, కష్టాలు ఉంటాయి. కష్టం వెనక సుఖం వస్తుందని చాణక్యుడు చెప్పాడు. రాత్రి తర్వాత పగలు వచ్చినట్లుగానే సుఖదుఃఖాలు వస్తాయని చెప్పాడు చాణక్యుడు. ఈ పరిస్థితుల్లో దేనికీ అతిగా స్పందించకూడదని, కష్టసుఖాల్లో ఒకటే దృఢమైన మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలని చెప్పాడు ఆచార్యుడు.
మనిషి యొక్క అసలైన గుణాలకు, వ్యక్తిత్వానికి, ఆలోచనలకు కష్ట సమయమే సరైన పరీక్ష పెడుతుందని చాణక్యుడు చెప్పాడు. కాబట్టి ఆ సమయంలో స్థిరంగా నిలబడాలని ఆచార్యుడు సూచించాడు. కొత్త సంవత్సరంలో ఎలా విజయతీరాలను చేరుకోవాలో చాణక్యుడు చెప్పిన ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః|
ధర్మోపదేశం విఖ్యాతం కార్యాకార్య శుభాశుభమ్||
అర్థం:
శాస్త్ర నియమాలను నిరంతరం ఆచరిస్తూ, నేర్చుకునే వ్యక్తి జ్ఞానాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తికి గొప్ప జ్ఞానం ఉంటుంది. ఎప్పుడూ నేర్చుకునే వ్యక్తులు, అపజయాల నుండి పాఠాలు నేర్చుకునే వారు విజయాన్ని పొందుతారు.
చాణక్యుడు జ్ఞానానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాడు. చాణక్యుడి ప్రకారం, అన్ని బాధలకు పరిష్కారం జ్ఞానం మాత్రమే. తెలివి ద్వారా ప్రతి లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పాడు చాణక్యుడు. జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే వారు జీవితంలో అపారమైన విజయాన్ని అందుకుంటారని ఆచార్యుడు చెప్పుకొచ్చాడు. అలాంటి వారికే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుందన్నాడు.
యస్మిన్ దేశే న సమ్మానో న వృత్తిర్న చ బాన్ధనః|
న చ విద్యాగమైప్యస్తి వాసస్తత్ర న కారయేత్||
అర్థం:
గౌరవం లేని ప్రదేశంలో నివసించొద్దు. స్నేహితుడు లేని చోట నివసించకూడదు. ఉపాధి లేని చోటును వదిలేయాలి. జ్ఞానం పొందలేని చోటులో నివసించకూడదు.
చాణక్యుడి సూచనల ద్వారా జీవితంలో ఆనందంగా గడపొచ్చు. ఆయన చెప్పిన సలహాలు పాటిస్తే జీవితం సాఫీగా సాగుతుంది. సమస్యలు సతమతం చేస్తున్నప్పుడు చాణక్యుడి సలహాలు కొత్త మార్గాన్ని చూపిస్తాయి.
జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాన్ధవాన్ వ్యాసనాగమే|
మిత్రం చాపత్తికాలే తు భార్యాం చ విభవక్షయే||
అర్థం:
చెడుకాలం సేవకునికి పరీక్షలా ఉంటుంది. కష్టాల్లో ఉన్నప్పుడు బంధువులకు పరీక్షలా ఉంటుంది. సంక్షోభ సమయంలో స్నేహితుడి నిజస్వరూపం బయటపడుతుంది. విపత్తు సంభవించినప్పుడు భార్య అసలు వ్యక్తిత్వం తెలుస్తుంది.
జీవితంలో సానుకూల దృక్పథానికి చాణక్యుడు ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతికూలతకు మనిషి దూరంగా ఉండాలని ఆచార్యుడు చెప్పాడు. ఇది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, కృషిని, సామర్థ్యాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు నమ్మాడు. ఎప్పుడూ సానుకూలంగా ఉండాలని, సానుకూల వైఖరితో మెలగాలని సూచించాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications