Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Chanakya Niti: వీటిని అలవర్చుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటారు
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితం గురించి అనేక చెప్పిన ఆచార్య చాణక్యుడు.. జీవితంలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయంపై పలు సూచనలు చేశాడు. జీవితంలో కొన్ని అంశాలను అంగీకరించగలిగితే ఆనందంగా, సంతోషంగా జీవించవచ్చని చెప్పాడు ఆచార్యుడు. చాణక్యుడు చెప్పిన ఆ అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
దయ కలిగి ఉండటం:
దయ స్వభావం మనిషిని సమర్థవంతుడిగా చేస్తుంది. దయ గల వ్యక్తి తప్పులు చేయరు. ఇతరులకు ఇబ్బంది కలిగించే, సమస్యలు తెచ్చిపెట్టే పనులు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయరు. అలాంటి వ్యక్తులు పాపంలో భాగస్వాములు కాలేరు. ఇతరుల పట్ల దయతో ఉండే వ్యక్తులు ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రులుగా ఉంటారు. అలాంటి వారి హృదయాల్లో అపరాధ భావన కలగదు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు.
అత్యాశ లేని వ్యక్తులు:
ఉన్నదాంతో సంతృప్తి పడే వ్యక్తులు, అత్యాశ లేని వ్యక్తులు నిరాశ చెందలేరు. ఉన్నదాంతో సర్దుకుపోవడంతో పాటు సంతోషంగా ఉంటారు. జీవితంలో ఇంకేదో కావాలన్న అసంతృప్తి వారి జీవితాల్లో ఉండదు. మానసిక ప్రశాంతతతో ఆనందంగా జీవిస్తారు.
ఏదైనా పొందాలనే తపన మనిషిని తప్పు దారికి తీసుకెళ్తుంది. అక్కడి నుండి సంతోషాలు, మానసిక ప్రశాంతత దూరమవుతాయి. దురాశ మనిషి ఆలోచనా సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అత్యాశను అధిగమించే వ్యక్తులు జీవితంలో ఆనందంగా ఉంటారు.
ప్రశాంతమైన మనస్సు:
ప్రశాంతమైన మనస్సుతో ఎంతటి సమస్యకైనా పరిష్కారం వెతకవచ్చని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. శాంతి కంటే గొప్ప తపస్సు లేదని ఆచార్యుడు చెప్పుకొచ్చాడు. ఎంత సంపద ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే ఆనందంగా ఉండలేరని చెప్పాడు కౌటిల్యుడు. జీవితంలో అన్ని సౌకర్యాలు ఉన్నా ప్రశాంతమైన మనస్సు లేకపోతే జీవితం దుర్భరంగా మారుతుందని చెప్పాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications