Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
Chanakya Niti: జీవితంలో ఈ వ్యక్తులను ఎప్పటికీ కోల్పోవద్దు! జీవితం నరకప్రాయం అవుతుంది
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
జీవితంలో విజయం కోసం మనం ఒంటరిగా పోరాడుతున్నప్పుడు, నిరాశ నుండి బయటపడటానికి, జీవితంలో కోల్పోయిన సమతుల్యతను పునరుద్ధరించడానికి, జీవితాన్ని సరైన మార్గంలో తెలివిగా నడిపించడానికి కొంత మంది సహాయం అవసరం అని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వ్యక్తులు ఎప్పుడూ కోల్పోకూడదని సూచించాడు. వారు ఉంటేనే జీవితంలో సాఫీగా సాగుతుందని చెప్పాడు. చాణక్యుడు చెప్పిన ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి స్నేహితుడు:
ఒక వ్యక్తి యొక్క స్నేహితులను బట్టి అతను ఎలాంటి వాడో చెప్పవచ్చని అంటారు పెద్దలు. స్నేహితులు ప్రతి ఒక్కరి జీవితంలో అంతటి ప్రభావం చూపిస్తారని దానర్థం. మంచి స్నేహితులు జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా ఉంటారు. మద్దతుగా నిలుస్తారు.
మంచి స్నేహితుడు ఎప్పుడూ మనల్ని మంచి దారిలోనే నడిపిస్తాడు. అలాంటి స్నేహితుడిని జీవితంలో ఎప్పటికీ దూరం చేసుకోవద్దని చెప్పాడు చాణక్యుడు. జీవితంలో ఎంతో మంచి వచ్చి వెళ్లిపోవచ్చు. కానీ ఒక మంచి స్నేహితుడు మాత్రం ఎప్పటికీ ఉండేలా చూసుకోవాలని అంటాడు చాణక్యుడు.
తెలివైన భార్య:
నిజాయితీగల, తెలివైన జీవిత భాగస్వామి దొరకడం ఎంతో అదృష్టం. అలాంటి జీవిత భాగస్వామితో జీవితంలో చాలా చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది. ఔనన్నా, కాదన్నా.. ఒక మంచి స్నేహితుడిలా మెలిగే జీవిత భాగస్వామితో జీవనం ఆనందమయంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
అలాంటి భార్య దొరకడం పూర్వజన్మ సుకృతమని చెప్పాడు చాణక్యుడు. తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలేసి మనతో వచ్చి జీవితాంతం తోడునీడగా ఉండే భార్యను ఎప్పటికీ వదులుకోవద్దని చెప్పాడు చాణక్యుడ.
కొడుకు:
కష్టకాలంలో మనకు అండగా నిలిచే పిల్లలు ఉండటం ప్రతి ఒక్క తల్లిదండ్రుల అదృష్టం. సత్ప్రవర్తన కలిగిన, వినయంతో మెలిగే కష్టసుఖాల్లో మద్దతుగా నిలబడే సంతానం ఉండటం కంటే మరొకటి అవసరం లేదని చెప్పాడు చాణక్యుడు. అలాంటి సంతానాన్ని ఎప్పటికీ దూరం చేసుకోవద్దని సూచించాడు. ఒకవేళ దూరం చేసుకుంటే జీవితాంతం, చనిపోయేంత వరకు బాధపడాల్సి వస్తుందని హెచ్చరించాడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
